నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..
x

నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..

తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది.


తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది. అధికార, ప్రతిపక్ష వర్గాలు సైతం సైలెంట్ అయిపోయాయి. అందరి చూపు ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి. ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఆంధ్ర ఎన్నికలపై ఒక అంచనాను వేయలేకపోయాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌లో కూడా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లే ఉంది. దీంతో ఆంధ్ర ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది. కానీ ప్రజల తీర్పు మాత్రం ఈసారి ఆంధ్రప్రదేశ్‌ను తుఫానులా కాదు సునామీలా ఊపుఊపేయనుందని విశ్లేషకులు చెప్తున్నారు.

ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలో వచ్చేది తమ ప్రభుత్వమే అని రెండు వర్గాలు పునరుద్ఘాటిస్తున్నాయి. తమ నేత జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆ ప్రమాణస్వీకార వేడుకలో వడ్డించే ఆహార మెనూ ఇదేనంటూ ఇరు పక్షాలు ప్రకటనలు కూడా చేస్తున్న క్రమంలో అసలు ఆంధ్రలో గెలుపెవరిది అనేది సస్పెన్స్ థ్రిల్లర్‌గా మరింది. ఈ సస్పెన్స్‌కు ఈరోజు ఫలితాలు ప్రకటించి ఈసీ తెర దించనుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి పార్టీ వర్గాలు కూడా వళ్లు దగ్గర పెట్టుకుని మసలుకోవాలని, అటూఇటూ తేడాగా ఏమైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది.

Live Updates

  • 4 Jun 2024 10:12 AM IST

    టిడిపి ఏజెంట్ కు గుండెపోటు

    ఏపీ ఎన్నికల కౌంటింగ్ వేళ పల్నాడు జిల్లా చిలకలూరిపేట సెగ్మెంట్, టిడిపి అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు తరపున టిడిపి పార్టీ ఏజెంట్ రమేష్ గుండెపోటుకు గురి అయ్యారు. నరసరావుపేట జేఎన్టీయూ కౌంటింగ్ కేంద్రంలో ఈ ఘటన జరిగింది. దీంతో వెంటనే ఆయనను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయన స్థానంలో మరొక వ్యక్తికి ఏజెంట్గా అధికారులు అవకాశం కల్పించారు.

  • 4 Jun 2024 10:11 AM IST

    నరసరావుపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ లావు శ్రీ కృష్ణదేవరాయలు 6588 ఓట్ల మెజారిటీతో ఉన్నారు. నరసరావుపేట వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి 1396 ఆధిక్యం

  • 4 Jun 2024 10:11 AM IST

    గుంటూరు పశ్చిమ మొదటి రౌండ్


    గళ్ళా మాధవి - 5,745

    విడదల రజిని - 2,422

    3,223 ఆధిక్యంలో గళ్ళా మాధవి

  • 4 Jun 2024 10:10 AM IST

    కడప జిల్లా జమ్మలమడుగులో బీజేపీ అభ్యర్థి ఆది నారాయణరెడ్డి 5265 ఓట్ల లీడ్. వైయస్సార్సీపి అభ్యర్థి డాక్టర్ మోలే సుధీర్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు.

  • 4 Jun 2024 10:09 AM IST

    అదరగొడుతున్న అనగాని సత్యప్రసాద్

    రేపల్లెలో టీడీపీ అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ 3 రౌండ్లు పూర్తి అయ్యేసరికి 11,286 ఓట్లతో ముందంజ

  • 4 Jun 2024 10:08 AM IST

    చంద్రగిరి అసెంబ్లీ మొదటి రౌండు ఈవీఎం కౌంటింగ్ ఫలితాలు


    వైసిపి మోహిత్ రెడ్డి

    4977

    టిడిపి పులివర్తి నాని

    6805

    చంద్రగిరిలో టిడిపి ఆదిత్యం మొదటి రౌండ్ కి

    1828

  • 4 Jun 2024 10:08 AM IST

    రాజంపేట అసెంబ్లీ మూడు రౌండ్‌లు పూర్తి అయ్యేసరికి టిడిపి అభ్యర్థి సుగవాసి సుబ్రమణ్యం కి 3870 వై సీ పీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి 3721 మూడో రౌండ్ పూర్తి అయ్యేసరికి టిడిపి అభ్యర్థి కి 149 ఓట్ల ఆధిక్యం

  • 4 Jun 2024 10:07 AM IST

    తాడికొండ లో 3 వ రౌండ్ ముగిసే సమయానికి టిడిపి అభ్యర్థి 17, 498 ఓట్లు ఆధిక్యం సాధించారు.

  • 4 Jun 2024 10:07 AM IST

    పెదకూరపాడు టిడిపి అభ్యర్థి 545 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

  • 4 Jun 2024 10:07 AM IST

    గురజాల టీడీపీ అభ్యర్థి యరపతినేని శ్రీనివాస్ రెండవ రౌండ్ లో 4474 అధిక్యం

Read More
Next Story