
నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..
తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది.
తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది. అధికార, ప్రతిపక్ష వర్గాలు సైతం సైలెంట్ అయిపోయాయి. అందరి చూపు ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి. ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఆంధ్ర ఎన్నికలపై ఒక అంచనాను వేయలేకపోయాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌లో కూడా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లే ఉంది. దీంతో ఆంధ్ర ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది. కానీ ప్రజల తీర్పు మాత్రం ఈసారి ఆంధ్రప్రదేశ్‌ను తుఫానులా కాదు సునామీలా ఊపుఊపేయనుందని విశ్లేషకులు చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలో వచ్చేది తమ ప్రభుత్వమే అని రెండు వర్గాలు పునరుద్ఘాటిస్తున్నాయి. తమ నేత జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆ ప్రమాణస్వీకార వేడుకలో వడ్డించే ఆహార మెనూ ఇదేనంటూ ఇరు పక్షాలు ప్రకటనలు కూడా చేస్తున్న క్రమంలో అసలు ఆంధ్రలో గెలుపెవరిది అనేది సస్పెన్స్ థ్రిల్లర్‌గా మరింది. ఈ సస్పెన్స్‌కు ఈరోజు ఫలితాలు ప్రకటించి ఈసీ తెర దించనుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి పార్టీ వర్గాలు కూడా వళ్లు దగ్గర పెట్టుకుని మసలుకోవాలని, అటూఇటూ తేడాగా ఏమైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది.
Live Updates
- 4 Jun 2024 11:24 AM IST
155 స్థానాల్లో గెలుపు దిశగా కూటమి..
రాయలసీమలోనూ కూటమి అభ్యర్థుల అనూహ్య విజయాలు.. దక్షిణ కోస్తాలో కూటమి అభ్యర్థుల విజయ ఢంకా.. ఉత్తరాంధ్రలో కూటమి అభ్యర్థుల పూర్తి ఆధిక్యత.. 20 లోక్‌సభ స్థానాల్లో కూటమిదే పైచేయి
- 4 Jun 2024 11:23 AM IST
పిఠాపురంలో భారీ ఆధిక్యం దిశగా పవన్ కల్యాణ్.. ఆరు రౌండ్లు పూర్తయ్యే సరికి 25,244 ఓట్ల ఆధిక్యంలో పవన్
- 4 Jun 2024 11:22 AM IST
నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గంలో 32 వేల 817 ఓట్ల ఆధిక్యంలో టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి
- 4 Jun 2024 11:18 AM IST
6వ రౌండ్ ముగిసేసరికి నంద్యాల టిడిపి అభ్యర్థి ఫరూక్ 10600 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉన్నారు
- 4 Jun 2024 11:18 AM IST
బనగానపల్లె అసెంబ్లీ నాలుగో రౌండ్ ఫలితం
టిడిపి అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి 1011 ఓట్ల ఆదిక్యత
- 4 Jun 2024 11:17 AM IST
ఏలూరు జిల్లా..
ఆరో రౌండ్ పూర్తయ్యేసరికి చింతలపూడి టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ 15,000 ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్నారు
- 4 Jun 2024 11:16 AM IST
శ్రీకాకుళం జిల్లా..
టెక్కలి మూడో రౌండ్ ముగిసిన అనంతరం..
4,388 ఓట్ల ఆదిక్యంలో తెదేపా అభ్యర్థి అచ్చన్నాయుడు.
- 4 Jun 2024 10:59 AM IST
మదనపల్లె లో హోరాహోరీ...
4 రౌండ్లు ముగిసే నాటికి 37 ఓట్ల ఆధిక్యంతో టిడిపి అభ్యర్థి షాజహాన్ బాషా
- 4 Jun 2024 10:58 AM IST
చంద్రబాబు ఇంటికి పోలీసులు
చంద్రబాబు ఇంటికి చేరుకున్న పోలీస్ ఉన్నతాధికారులు...
భారీ భద్రత కల్పించేలా ప్రోటోకాల్ నిబంధనలు పర్యవేక్షిస్తున్న అధికారులు....
ఇప్పటికే 160 సీట్లలో లీడ్ లో ఉన్న కూటమి.
- 4 Jun 2024 10:58 AM IST
కడపలో దూసుకుపోతున్న కూటమి అభ్యర్థులు..
జమ్మలమడుగు లో ఆధిక్యత కనబరుస్తున్న, బిజెపి అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి..
ఐదవ రౌండ్ ముగిసే సరికి 1908 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు..
మైదుకూరులో దూసుకుపోతున్న టిడిపి అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్..
ఆరవ రౌండ్ పూర్తి అయ్యేసరికి 8,178 ఓట్ల ఆధిక్యత లో పుట్టా సుధాకర్ యాదవ్...