
నేడే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కౌంటింగ్..
తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది.
తుఫాను వచ్చే ముందు ప్రకృతి నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ కూడా ఎన్నికల ఫలితాల తుఫానును చవిచూడటానికి ముందులా అత్యంత నిశ్శబ్దంగా ఉంది. అధికార, ప్రతిపక్ష వర్గాలు సైతం సైలెంట్ అయిపోయాయి. అందరి చూపు ఎన్నికల ఫలితాలపైనే ఉన్నాయి. ఈ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ పెట్టి మరీ పలు సంస్థలు నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఆంధ్ర ఎన్నికలపై ఒక అంచనాను వేయలేకపోయాయి. ఈ ఎగ్జిట్ పోల్స్‌లో కూడా వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య పోటీ నువ్వానేనా అన్నట్లే ఉంది. దీంతో ఆంధ్ర ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది. కానీ ప్రజల తీర్పు మాత్రం ఈసారి ఆంధ్రప్రదేశ్‌ను తుఫానులా కాదు సునామీలా ఊపుఊపేయనుందని విశ్లేషకులు చెప్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో టీడీపీ, వైసీపీ నువ్వానేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. రాష్ట్రంలో వచ్చేది తమ ప్రభుత్వమే అని రెండు వర్గాలు పునరుద్ఘాటిస్తున్నాయి. తమ నేత జూన్ 9న ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆ ప్రమాణస్వీకార వేడుకలో వడ్డించే ఆహార మెనూ ఇదేనంటూ ఇరు పక్షాలు ప్రకటనలు కూడా చేస్తున్న క్రమంలో అసలు ఆంధ్రలో గెలుపెవరిది అనేది సస్పెన్స్ థ్రిల్లర్‌గా మరింది. ఈ సస్పెన్స్‌కు ఈరోజు ఫలితాలు ప్రకటించి ఈసీ తెర దించనుంది. ఈ నేపథ్యంలోనే ప్రతి పార్టీ వర్గాలు కూడా వళ్లు దగ్గర పెట్టుకుని మసలుకోవాలని, అటూఇటూ తేడాగా ఏమైనా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎన్నికల సంఘం హెచ్చరించింది.
Live Updates
- 4 Jun 2024 11:54 AM IST
ఏపీ ఎన్నికల్లో తొలి విజయం టీడీపీదే..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ తొలి విజయం నమోదు చేసింది. రాజమహేంద్రవరం (గ్రామీణం) టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణపై 63,056 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
- 4 Jun 2024 11:50 AM IST
రాజమండ్రి రూరల్‌లో టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం.. 50 వేల ఓట్ల మెజారిటీతో గెలుపు
- 4 Jun 2024 11:47 AM IST
రాయలసీమ జిల్లాలోని 52 అసెంబ్లీ స్థానాలు ఉండగా, కూటమి అభ్యర్థులు 40 స్థానాల్లో కూటమి అభ్యర్థులు ఆదిత్యంలో కొనసాగుతున్నారు.
- 4 Jun 2024 11:42 AM IST
చిత్తూరులో మూడో రౌండ్ ముగిసేసరికి..
టిడిపి అభ్యర్థి గాలి భాను ప్రకాష్ కు 18388, మంత్రి ఆర్కే రోజాకు 10376 ఓట్లు వచ్చాయి. మంత్రి ఆర్కే రోజా వెనుకంజలో ఉన్నారు. 812 ఓట్లతో టిడిపి ఆదిక్యం
- 4 Jun 2024 11:40 AM IST
అనంతపురం జిల్లా ఉరవకొండ అసెంబ్లీ స్థానానికి10 రౌండ్లు పూర్తి. టిడిపి అభ్యర్థి పయ్యావుల కేశవ్
12206 మెజారిటీ లో ఉన్నారు.
సింగనమల ఆరు రౌండ్ పూర్తి
3006 మెజారిటీ
టిడిపి ముందంజ
- 4 Jun 2024 11:39 AM IST
చిత్తూరు జిల్లా పీలేరు నియోజకవర్గంలో 8 రౌండ్లు పూర్తి అయ్యేసరికి టీ డీ పీ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి ప్రత్యర్థి చింతల రామ చంద్ర రెడ్డి పై 7844 ఓట్ల ఆధిక్యంతో ఉన్నారు
- 4 Jun 2024 11:39 AM IST
కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే..
8వ రౌండ్ పూర్తి ముగిసేసరికి 8260 ఓట్ల మెజార్టీతో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి..
వైఎస్ఆర్సీపీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి: 36612
టిడిపి సుగవాసి బాలసుబ్రమణ్యం: 28352
- 4 Jun 2024 11:36 AM IST
వెంకటగిరి అసెంబ్లీ ఎనిమిదో రౌండ్ ఫలితాలు
రామకృష్ణ టీడీపీ
36271
రామ కుమార్ రెడ్డి వైసిపి
34591
1680 లీడ్ టిడిపి రామకృష్ణ
గూడూరు అసెంబ్లీ 8 రౌండ్ ఫలితాలు
సునీల్ కుమార్ టిడిపి
41635
మురళీధర్ వైసిపి
27124
సునీల్ కుమార్ టిడిపి ఆధిక్యం
14,511
నాల్గవ రౌండ్ శ్రీకాళహస్తి అసెంబ్లీ ఫలితాలు
మధుసూదన్ రెడ్డి వైసీపీ
12830
సుధీర్ రెడ్డి టిడిపి
21029
టిడిపి సుధీర్ రెడ్డి ఆధిక్యం
8,199
- 4 Jun 2024 11:35 AM IST
కదం తొక్కుతున్న కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి నియోజకవర్గం 6 రౌండ్లు పూర్తి అయ్యేసరికి కూటమి అభ్యర్థి శ్రీ కన్నా లక్ష్మీనారాయణ 13119 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.
మంత్రి అంబటి రాంబాబు వార్డులో కూడా కన్నా కు 470 ఓట్ల మెజార్టీ లభించింది.
సత్తెనపల్లి మునిసిపల్ చైర్ పర్సన్ బూతులో కన్నా కు 460 ఓట్లమెజార్టీ