ఆ పెన్నుతోనే.. డీఎస్సీపై తొలి సంతకం

ఓ యువతి బహూకరించిన పెన్ను.. కొత్త ప్రభుత్వం, యువతతో తొలి అడుగులు వేయించనున్నది. సీఎంగా ఎన్. చంద్రబాబు చేసే సంతకంతో నిరుద్యోగుల సుదీర్ఘ నిరీక్ణణ ఫలించనున్నది.

Update: 2024-06-12 01:34 GMT

అధికారంలోకి రాగానే మెగా డీస్సీపై తొలి సంతకం ఉంటుందని టీడీపీ అధ్యక్షుడు ఎన్. చంద్రబాబు నాయుడు ఎన్నికల ప్రచారంలో ప్రకటించారు. అనుకున్నట్లుగానే కూటమి అధికారంలోకి వచ్చింది. బుధవారం ఉదయం (ఇంకొన్ని గంటల్లో) టీడీపీ కూటమి సర్కారు కొలవుదీరనున్నది. విజయవాడ సమీపంలోని గన్నవరం విమానాశ్రయం వద్ద ఉన్న కేసరపల్లి ఐటీ పార్కు వద్ద సీఎంగా ఎన్. చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎంగా జనసేన చీఫ్ కొణిదెల పవన్ కల్యాణ్ తోపాటు 25 మంది ప్రమాణ స్వీకారం చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. అనంతరం ఎన్నికల ప్రచారంలో ప్రకటించినట్లుగా మూడు ఫైళ్లపై సంతకాలు చేసే అవకాశం ఉంది. అందులో ప్రధానంగా మెగా డీఎస్సీ నిర్వహణకు సంబంధించిన ఫైల్ పై సంతకం ఉంటుంది.

ఆమె ఇచ్చిన పెన్నుతోనే...
ఏప్రిల్ 22వ తేదీ
ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. అందులో భాగంగా టీడీపీ చీఫ్ ఎన్. చంద్రబాబు నాయుడు కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రచారరథంపై నుంచి ఎన్. చంద్రబాబు నాయుడు ప్రసంగిస్తండగా ఓ యువతి పెన్ను కానకగా అందించారు. "ఈ పెన్నుతోనే తొలి సంతకం చేయాలని ఆమె కోరారని" సభలో ప్రకటించారు. సభకు హాజరైన వారితో పాటు పెన్ను కానకగా ఇచ్చిన యువతికి మరింత ఉత్సాహం కలిగించే మాటలు చెప్పారు. ’ కూటమి అధికారంలోకి రాగానే ఇదే పెన్నుతో తొలి సంతకం చేస్తా‘ అని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. మొదటి సంతకానికి అదే పెన్ను వినియోగించనున్నారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ప్రమాణ స్వీకారం అనంతరం మెగా డీఎస్సీతో పాటు ల్యాండ్ టైటిల్ డీడ్ రద్దు ఫైల్ పై సంతకం చేసే అవకాశం చేయనున్నారు. ఈ చట్టం కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. అందువల్ల సాధ్యాసాధ్యాలను పరీశీలించే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. దీనికి కేంద్ర ప్రభుత్వం ఎలా సహకారం అందిస్తుందనేది వేచిచూడాల్సిందే.
మూడు సంతకాలు
ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత ఎన్. చంద్రబాబునాయుడు మూడు ఫైళ్లపై సంతకాలు చేస్తానని ప్రజలకు మాట ఇచ్చారు. అందులో ప్రధానగా మెగా డీఎస్సీ ఫైల్ తోపాటు ఏపీ. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. సామాజిక పింఛన్ల మొత్తం రూ. మూడు వేల నుంచి నాలుగు వేలకు పంచే దస్త్రాలపై సంతకాలు చేయనున్నారు. ఏప్రిల్ నుంచే పెంచిన మొత్తం అందిస్తామని ప్రచారంలో చంద్రబాబునాయుడు ప్రకటించారు. దీంతో పెంచిన మొత్తంతో కలిపి ఏప్రిల్, మే, జూన్ నెలల రూ. వెయ్యితో కలిపి జూన్ నెల పింఛన్ ఏడు వేలు అందిస్తామని హామీ ఇచ్చారు.
డీఎస్సీ ఘనత మాదే...
’జాబ్ క్యాలెండర్, డీఎస్సీ నిర్వహిస్తామనే హామీలు ఇచ్చిన గత వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం మోసం నిరుద్యోగులను మోసం చేసింది‘ అని ప్రచార సమయంలో చంద్రబాబు విమర్శించారు. గతంలో కూడా తమ పార్టీ అధికారంలో ఉండగా మెగా డీఎస్సీలు నిర్వహించిన ఘనతను ఆ సందర్భంలో ఆయన గుర్తు చేశారు. ఇచ్చిన హామీల మేరకు ఆయన ఇంకొన్ని గంటల్లో మెగా డీఎస్సీ నిర్వహణకు వీలుగా ఫైల్ పై సంతకం చేయనున్నారు. ఆ మేరకు విద్యా శాఖ అన్ని లాంఛనాలు పూర్తి చేసినట్లు ఉపాధ్యాయ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం సర్వీసులో ఉన్న వారికి పదోన్నతులు కల్పంచడం ద్వారా ఏర్పడే పోస్టులతో పాటు, ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు.




 


“ ఐదేళ్లుగా నిరీక్షిస్తున్న నా కల నెరవేరుతుంది” అని డీఎస్సీ కోసం నిరీక్షిస్తున్న అభిరాం అనే నిరుద్యోగి ఫెడరల్ ప్రతినిధితో వ్యాఖ్యానించారు. నాకు అమ్మానాన్న లేరు. చిత్తూరు జిల్లా కార్వేటినగరంలోని ఉపాధ్యాయ శిక్షణ సంస్థలో పనిచేసే అధ్యాపకుడు ఆదుకున్నారు. ఆ సాయంతో డబుల్ డిగ్రీ చేశా. డీఎస్సీ రాలేదు. మళ్లీ ఆయన సాయంతోనే ఇలా చిన్నవ్యాపారం చేసుుని జీవిస్తున్న. అని చెబుతున్న అభిరాం టీచర్ కావాలని నా చిరకాల కోరిక డీఎస్సీ వస్తుందనే ప్రకటనతో ఆశలు రేకెత్తించిందని అంటున్నారు.


Tags:    

Similar News