ఆరోగ్యంపై పుకార్లను కొట్టిపారేసిన రతన్ టాటా
తాను భేషుగ్గా ఉన్నానని, తన గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని ప్రజలను, మీడియాను రతన్ టాటా ఇవాళ ‘ఎక్స్’ వేదికగా కోరారు.
By : Sravana Babu
Update: 2024-10-07 13:32 GMT
టాటా గ్రూప్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా(Ratan Tata) తన ఆరోగ్యంపై ఇవాళ వచ్చిన వార్తలపై స్పందించారు. ఎలాంటి ఆందోళనకూ గురవ్వాల్సిన అవసరంలేదని, తాను ఐసీయూలో చేరానని వచ్చిన పుకార్లను నమ్మవద్దని ఒక ప్రకటనలో కోరారు. వృద్ధాప్యంకారణంగా ఎదురయ్యే సమస్యలకు సంబంధించిన పరీక్షలకోసం మాత్రమే తాను ఆసుపత్రికి వెళ్ళానని పేర్కొన్నారు.
86 సంవత్సరాల రతన్ టాటా ఇవాళ ఉదయం ముంబాయిలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రికి వెళ్ళారు. దీనితో ఆయనపై అనేక పుకార్లు జోరుగా ప్రచారంలోకి వచ్చాయి. దీనిపై స్పందిస్తూ, తాను భేషుగ్గా ఉన్నానని, తన గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని ప్రజలను, మీడియాను రతన్ టాటా ఇవాళ ‘ఎక్స్’ వేదికగా కోరారు.