సంధ్య థియేటర్ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను అరెస్ట్ చేశారు చిక్కడపల్లి పోలీసులు. అనంతరం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. పుష్ప2 సినిమా విడుదల సందర్భంగా 4వ తేదీన సంథ్య థియేటర్‌లో తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందారు. దాంతో తొక్కిసలా ఘటనపై చిక్కడ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసులో అల్లు అర్జున్‌ను కూడా నిందితుడిగా చేర్చారు పోలీసులు. అయితే తనపై నమోదైన కేసును కొట్టేయాలని ఇదివరకే పిటీషన్ దాఖలు చేశారు అల్లు అర్జున్. ఆకస్మాత్తుగా బన్నీ అరెస్ట్ చేయడంతో సినీవర్గాలతోపాటు అభిమానులు షాకయ్యారు.సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మృతిపై ఇదివరకే అల్లు అర్జున్ రియాక్ట్ అయ్యారు. మృతురాలి రేవతి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ‘సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన గురించి విని షాక్ అయ్యాం. ఆ వార్తతో పుష్ప సెలబ్రేషన్స్ లో యాక్టివ్ పాల్గొనలేకపోయాం. మేము సినిమా తీసేదే జనాలు థియేటర్ కు వచ్చి ఎంజాయ్ చేయాలి అని. రేవతి గారి ఫ్యామిలీకి నా సంతాపం తెలియజేస్తున్నా. నా తరఫున బాధిత కుటుంబానికి రూ.25లక్షలు అందిస్తా. అలాగే మా టీమ్ నుంచి ఇంకా ఎలాంటి సాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. వారికి నా వల్ల అయినంత సాయం చేస్తాను. త్వరలోనే రేవతి కుటుంబాన్నిస్వయంగా కలుస్తాను’ అని భరోసా ఇచ్చాడు బన్నీ. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను రిలీజ్ చేశాడు అల్లు అర్జున్.