తెలుగుదేశం పార్టీలో చేరనున్న శిద్దా రాఘవరావు

మాజీ మంత్రి, ప్రకాశం జిల్లా వాసి శిద్దా రాఘవరావు తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నట్లు సమాచారం. గతంలో తెలుగుదేశం నుంచి వైఎస్సార్సీపీలోకి వచ్చారు.

Update: 2024-09-09 10:00 GMT

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో శిద్దా రాఘవరావుకు ఒక ప్రత్యేకత ఉంది. ఆయన వైశ్య సామాజిక వర్గానికి చెందిన వారు. ప్రముఖ గ్రానైట్ వ్యాపారి. ప్రకాశం జిల్లా చీమకుర్తిలో దేవాలయం నిర్మించి పలువురికి ఆదర్శంగా నిలిచారు. దాన ధర్మాలు చేయడంలో కూడా ముందుంటారు. 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు శిద్దా రాఘవరావు చంద్రబాబు మంత్రివర్గంలో దేవదాయ శాఖ మంత్రిగా పనిచేశారు. వివాద రహితునిగా పేరు తెచ్చుకున్న రాఘవరావు రాజకీయాల్లో ఒకే పార్టీలో రాణించలేకపోయారు. అందుకు వ్యాపార సంబంధాలేనని పలువురు చెప్పుకోవడం విశేషం.

టిక్కెట్ కోసం ప్రయత్నించి విఫలమై...

2019లో వైఎస్సార్సీపీ నుంచి దర్శి టిక్కెట్ కోసం ప్రయత్నించి రాఘవరావు విఫలమయ్యారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దర్శి టిక్కెట్ ఇచ్చేందుకు నిరాకరించారు. అయితే ఒంగోలు నుంచి పోటీ చేయాలని ఒక దశలో శిద్దాకు జగన్ చూసించారు. అక్కడ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఉండటం వల్ల తాను అక్కడి నుంచి పోటీ చేయలేనని జగన్ కు తేల్చి చెప్పారు. దీంతో జగన్ ఒంగోలు ఎంపిగా పోటీ చేసేందుకు ఆఫర్ ఇచ్చారు. అయితే అందుకు కూడా శిద్దా అంగీకరించలేదు. రాష్ట్ర రాజకీయాలకే పరిమితం అవుతానని, మాగుంట శ్రీనివాసులురెడ్డి టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నందున ఆయనను కాదని తాను అక్కడి నుంచి పోటీ చేయలేని చెప్పారు. దీంతో 2019లో శిద్దాకు పోటీ చేసే అవకాశం రాలేదు. అప్పట్లోనే తెలుగుదేశం పార్టీ టిక్కెట్ కోసం శిద్దా ప్రయత్నించారు. అయితే ఆయనకు కాకుండా గట్టిపాటి నర్సయ్య కుమార్తె గొట్టిపాటి లక్ష్మికి తెలుగుదేశం పార్టీ దర్శి టిక్కెట్ ఖరారు చేయడంతో శిద్దాకు అవకాశం దక్కలేదు.

వైఎస్సార్సీపీకి రాజీనామా..

ఎన్నికలు ముగిన తరువాత వైఎస్సార్సీపీ ఓడిపోవడం, రాజకీయ పరిణామాలు అనూహ్యంగా మారి ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా ఓడిపోవడంతో వైఎస్సార్సీపీలో కొనసాగటం మంచిది కాదని భావించిన శిద్దా వైఎస్సార్సీపీకి రాజీనామా చేశారు. అయితే తాను ఏ పార్టీలో చేరాలనుకుంటున్నాననే విషయం మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఆదివారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలవడం రాజకీయ చర్చకు దారితీసింది. ఆయనతో పాటు తన సోదరులు ఇరువురూ చంద్రబాబును కలిసి వరద బాధితులకు విరాళం ఇచ్చారు.

Delete Edit

టీడీపీలో చేరేందుకు యత్నాలు..

రాజకీయ పార్టీలు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నాయి. బడా వ్యాపారులను తమ పార్టీలోకి రాకుంటే ఆర్థికంగా దెబ్బతీసేందుకు వ్యూహాలు పన్నుతున్నాయి. శిద్దా రాఘవరావు మొదట తెలుగుదేశం పార్టీ కావడం, ఆ తరువాత వైఎస్సార్సీపీలో చేరడం జరిగాయి. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటంతో శిద్దాకు చంద్రబాబు నాయుడుతో ఉన్న సంబంధంతో తిరిగి టీడీపీలో చేరేందుకు నిర్ణయించినట్లు సమాచారం. వైఎస్సార్సీపీలో టిక్కెట్ దక్కనప్పటి నుంచి టీడీపీలో చేరేందుకు శిద్దా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఎవరు టీడీపీలో చేరాలన్నా తమ పదవులకు రాజీనామా చేసి రావాలనే షరతు విధించారు. శిద్దాకు ప్రస్తుతం వైఎస్సార్సీపీలో ఎటువంటి పదవులు లేవు. అందువల్ల ఆయనకు వచ్చని ఇబ్బంది అంటూ ఏమీ లేదు. చంద్రబాబు ఓకే అంటే తెలుగుదేశం పార్టీలో ఉన్నట్లుండి చేరిపోవొచ్చు. ఎందుకంటే వైఎస్సార్సీపీ ప్రాథమిక సభ్యత్వానికి ఇప్పటికే రాజీనామా చేశారు. ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా వ్యపారాలు చేసుకుంటూ ఉన్నారు.

విజయవాడ వరద భాదితుల సహాయార్థం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు పిలుపు మేరకు రూ.50 లక్షలు విరాళం అందించారు శిద్దా. మాజీమంత్రి శిద్దా రాఘవరావు ఆయన సోదరులు శిద్దా హనుమంతరావు, శిద్దా సూర్య ప్రకాశరావు ఈ మేరకు విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఒంగోలు శాసన సభ్యులు దామచర్ల జనార్ధన్ తో కలసి విరాళం చెక్కును నారా చంద్రబాబు నాయుడుకు అందచేశారు. సీఎం వారిని ఈ సందర్బంగా అభినందించారు.

Tags:    

Similar News