ISRO 'స్పేస్ స్టేషన్'కు ముందడుగు..

షార్ నుంచి PSLV-c60 రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. దీనివల్ల ఉన్న బహుళ ప్రయోజనాలను ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు.;

Byline :  Dinesh Gunakala
Update: 2024-12-30 17:13 GMT

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట సమీపంలోని శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం అనేక విజయాలను తన ఖాతాలో జమ చేసుకుంది. సోమవారం రాత్రి pslv c- 60 అంతరిక్ష వాహకనౌకను విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం విజయవంతం చేయడం ద్వారా ఇస్రో శాస్త్రవేత్తలు భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచ స్థాయిలో మరోసారి నిలిపారు. "అంతరిక్ష కేంద్ర నిర్మాణానికి" తొలి అడుగు వేయడం ద్వారా భారత్ ను శాస్త్రసాంకేతిక రంగంలో అమెరికా, రష్యా, చైనా సరసన నిలపడం ద్వారా కీర్తి ప్రతిష్టలను మరోసారి ఇనుమడింప చేశారు.


రాకెట్ ప్రయోగానికి కౌట్ డౌన్ ఆదివారం రాత్రి నుంచి ప్రారంభించారు. శ్రీహరికోట సతీష్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి రెండు ఉపగ్రహాలతో కూడిన ఈ వాహక నౌక రాత్రి 9.58. గంటల అంతరిక్షంలోకి దూసుకుని వెళ్ళాల్సి ఉంది. వాతావరణం వాతావరణం అనుకూలించలేదో, లేక సాంకేతిక లోపం ఏర్పండిదనేది తెలియలేదు. కానీ 2.15 నిమిషాలు ఆలస్యంగా నిప్పులు చెరుగుతూ రాకెట్ ఆకాశంలోకి తీసుకువెళ్లింది.
పీఎస్ఎల్వీసీ సీ 60 ప్రత్యేకతలు
229 టన్నులు బరువు, 44.5 మీటర్ల ఎత్తు ఉన్న ఈ రాకెట్ లో 440 కిలోల బరువు కలిగిన చేజర్, టార్గెట్ ఉపగ్రహాలతో పాటు, మరో 24 చిన్న ఉపగ్రహాలను నింగిలోకి చేర్చింది. రెండేళ్ల పాటు అంతరిక్షంలో పరిభ్రమిస్తూ ఈ బుల్లి ఉపగ్రహాలు సేవలు అందించనున్నాయి. ఇందులో మరో ప్రత్యేకత ఏమిటి అంటే టాకింగ్ సంక్లిష్ట సాంకేతిక పరిజ్ఞానంతో రోదసిలో చేజర్, టార్గెట్ ఉపగ్రహాలను అనుసంధానం చేసే విధంగా శాస్త్రవేత్తలు డిజైన్ చేశారు. ఇవి అనుసంధానం జరిగిన తర్వాత విడిపోయే ఉపగ్రహాలు భూ పరిశీలన సహజ వనరుల పర్యవేక్షణ, పచ్చదనం, రోదసీలో రేడియో ధార్మికతపై అధ్యయనం చేయడంలో ఈ ఉపగ్రహాలు కీలక భూమిక పోషించనున్నాయి. మానవ సహిత ప్రయోగాలకు డేటాను ఛేజర్, టార్గెట్ ఉపగ్రహాలు అందివ్వనున్నట్లు ఇస్రో శాస్త్రవేత్తలు వివరించారు. శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రంలోని కంట్రోల్ కేంద్రం నుంచి ఇస్రో డైరెక్టర్ డాక్టర్ సోమనాథ్ సహచర శాస్త్రవేత్తలతో కలిసి ఈ ప్రయోగాన్ని పర్యవేక్షించారు. PSLV -c60 రాకెట్ వల్ల రెండు ట్రాన్స్ పాండర్లను కక్షలోకి ప్రవేశపెట్టారు. దీనివల్ల ఆ బహుళ ప్రయోజనాలు ఉన్నాయని ఇస్రో శాస్త్రవేత్తలు ప్రకటించారు. రాకెట్ విజయవంతం అయిన విషయాన్ని ఆయన సహచరులతో కలిసి విజయహాసంతో ప్రకటించారు.


జంట ఉపగ్రహా లతో..
శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ నుంచి ఈ నెల 30, PSLV-C60 రాకెట్‌ ద్వారా స్పాడెక్స్‌ జంట ఉపగ్రహాలను రోదసీలోకి పంపింది. ఈ ప్రయోగం ద్వారా విభిన్న పరిశోధనలకు ఇస్రో శ్రీకారం చుట్టినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. ఈ రాకెట్ ప్రయోగం ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయని విషయాన్ని స్పష్టం చేశారు. దీని ద్వారా చేసే పరిశోధనలు.. భవిష్యత్‌లో అంతరిక్షంలో భారత్‌ ఆధ్వర్యంలో స్పేస్‌ స్టేషన్‌ నిర్మాణానికి ఎంతో దోహదపడతాయని వెల్లడించారు.
ఉపకరణాలతో ప్రయోజనం
పి ఎస్ ఎల్ వి c-60 రాకెట్ ద్వారా రోదిశలోకి పంపించిన ఉపగ్రహాలతో పాటు 24 ఉపకరణాలను కూడా అమర్చారు. ఈ ప్రయోగం విజయవంతం కావడం ద్వారా వల్ల భవిష్యత్తులో జరిపి ప్రయోగాల్లో మరిన్ని డాకింగ్ సిస్టం పరిశీలనకు అవకాశం ఏర్పడిందని శాస్త్రవేత్తలు స్పష్ట చేశారు. వీటి తోపాటు స్పేస్ స్టేషన్ నిర్మాణానికి మార్గం ఏర్పడిందని ఆనందంగా ప్రకటించారు.
రాకెట్‌ నుంచి స్పాడెక్స్‌ ఉపగ్రహం విడిపోయిన తర్వాత నాలుగో దశలో విభిన్న పరిశోధనలకు ఇస్రో శ్రీకారం చుట్టనుంది. ఈ ప్రయోగంలో పీఎస్‌-4 ద్వారా ఏకంగా 24 కల్పరిశోధనలు చేసేందుకు 24 చిన్న ఉపకరణాలను పంపించారు. వీటివల్ల నిర్వహించే పరిశోధనలతో ఇస్రో మరింత విలువైన సమాచారం సేకరించడానికి మార్గం ఏర్పడిందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.
స్టార్టప్ కంపెనీల ఉపకరణాలు
Pslvc 60 అంతరిక్ష వాహకనౌకలో అమర్చిన ఉపకరణాల్లో ఇస్రోకు చెందినవి 14 కాగా. మరో 10 ఉపకరణాలు దేశంలోని వివిధ ప్రైవేట్‌ స్టార్టప్‌ కంపెనీలు, విశ్వ విద్యాలయాలకు చెందినవి ఉన్నాయి.

పండుగ వాతావరణం..

శ్రీహరికోట సతీష్ ధావన్ రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి శాటిలైట్లు కక్ష్యలోకి పంపించే సమయంలో ఉద్విగ్న వాతావరణం నెలకొంటుంది. నిద్రాహారాలు మరిచిన శాస్త్రవేత్తలు కంట్రోల్ రూమ్ లో రాకెట్ ప్రయోగం చేయడంలో దృష్టి పెడతారు. షార్ కేంద్రంలోనే కాకుండా, సమీప ప్రాంతాల్లో ఉన్న వేలాదిమంది ఉద్యోగులు శాస్త్రవేత్తల కుటుంబీకులు ముద్దెలపైకి చేరి కరతాలధ్వనులు చేస్తూ రాకెట్ ప్రయోగాన్ని ఆస్వాదించారు. రాకెట్ ప్రయోగం సక్సెస్ అయితే ఇది ఇక్కడ పని చేసే ఉద్యోగులకే కాదు. సూళ్లూరుపేట సమీప ప్రాంతాల ప్రజలకు కూడా ఓ పెద్ద పండగ లాంటిదిగా భావిస్తారు. తెలియని ఆనందం వాళ్ళు వారి కళ్ళల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

దిశా నిర్దేశం..

సాధారణంగా రైలు, లేదా బస్సు ప్రయాణానికి ఓ మార్గం ఉంటుంది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి రాకెట్ నింగిలోకి దూసుకు వెళ్లడానికి కూడా ఓ మార్గం ఉంది. దిశా, గమనం, వాతావరణ సూచనలు చేయడంలో తిరుపతి జిల్లా చంద్రగిరి సమీపంలోని పాకాల వద్ద ఉన్న ఎన్ఏఆర్ఎల్ (National atmospheric research laboratory-NARl) గాదంకి రాడార్ స్టేషన్ రాకెట్ ప్రయోగంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ కేంద్రం నుంచి వాతావరణాన్ని మదింపు చేసి, పంపించే నివేదికల ఆధారంగా రాకెట్ నింగిలోకి దూసుకు వెళ్ళింది.

Tags:    

Similar News