మనవడికి తాత వార్నింగ్..

లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ విషయంలో పొలిటికల్ హీట్ పెరిగిపోతుంది. ఇక తన మనవడికి మాజీ ప్రధాని దేవేగౌడ ఏమని వార్నింగ్ ఇచ్చారు?

Update: 2024-05-23 12:45 GMT

తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చినప్పటి నుంచి దేశం విడిచి అజ్ఞాతంలోకి వెళ్లిన తన మనవడు, హాసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణకు జేడీ(ఎస్) అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ గట్టి వార్నింగ్ ఇచ్చారు.

ప్రజ్వల్ దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేయాలని కోరుతూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ప్రధాని నరేంద్ర మోదీకి గురువారం రెండో లేఖ రాశారు. అదే రోజు ప్రజ్వల్ స్వదేశానికి వచ్చి లొంగిపోవాలని దేవేగౌడ లేఖ రాశారు.

సిద్ధరామయ్య లేఖకు సమాధానంగా కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. దౌత్య పాస్‌పోర్ట్‌ను రద్దు చేయడానికి “ఒక ప్రక్రియ” ఉంటుందని, ప్రజ్వల్‌ను తిరిగి దేశానికి తీసుకురావడంలో సహకరించడానికి కేంద్రం సిద్ధంగా ఉందని అన్నారు.

"వెంటనే లొంగిపోవాలి’’

దేవెగౌడ ప్రజ్వల్‌పై వస్తున్న ఆరోపణలు, దుశ్చర్యల గురించి తనకు తెలియదని ఎవరినీ ఒప్పించే స్థితిలో లేనప్పటికీ, తాను చేయగలిగింది పోలీసుల ముందు లొంగిపోవాలని అతనికి హెచ్చరిక జారీ చేయడం మాత్రమేనని అని 91 ఏళ్ల దేవేగౌడ పేర్కొన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పోస్ట్ చేసిన లేఖ సారాంశం..

“ఈ సమయంలో నేను (దేవేగౌడ) ఒక్కటే చేయగలను. నేను ప్రజ్వల్‌కి గట్టి వార్నింగ్ ఇస్తున్నాను. ఆయన తిరిగి వచ్చి పోలీసుల ముందు లొంగిపోవాలని చెబుతున్నా. ప్రజ్వల్‌కు ఇది నా విజ్ఞప్తి కాదు. హెచ్చరిక. దీన్ని పట్టించుకోకపోతే  ఆయన  నా కోపాన్ని, నా కుటుంబ సభ్యులందరి ఆగ్రహాన్ని చూడాల్సి ఉంటుంది. ప్రజ్వల్‌పై వచ్చిన ఆరోపణలను చట్టం చూసు కుంటుంది. ఆయనకు నా పట్ల గౌరవం మిగిలి ఉంటే వెంటనే తిరిగి రావాలి.” అని రాశారు.

"విచారణలో జోక్యం చేసుకోను"

ప్రజ్వల్‌పై విచారణలో తను లేదా తన కుటుంబ సభ్యుల జోక్యం చోసుకోబోమని చెప్పారు. “నా మనస్సులో ఈ విషయంలో ఎలాంటి భావోద్వేగం లేదు. అతని దుశ్చర్యల వల్ల నష్టపోయిన వారికి న్యాయం జరగాలని కోరుకుంటున్నా.

60 ఏళ్లకు పైగా [తన] రాజకీయ జీవితంలో [తనకు] అండగా నిలిచిన “ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందడం” చాలా ముఖ్యం. నేను వారికి ఎంతో రుణపడి ఉన్నాను. నేను జీవించి ఉన్నంత వరకు వారిని నిరాశపరచను” అని సంతకం చేశారు దేవేగౌడ.

Tags:    

Similar News