కొత్త చట్టాన్ని వైద్యులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు?

వైద్యుల నిర్లక్ష్యంపై జైలు శిక్ష, జరిమానా విధించే కొత్త చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తమిళనాడు ఎంపీ డాక్టర్ కళానిధి వీరాస్వామి అమిత్ షాకు లేఖ రాశారు.

Update: 2024-07-10 11:07 GMT

కేంద్రం జులై 1 నుంచి మూడు కొత్తచట్టాలను అమల్లోకి తెచ్చింది. ఇకపై వైద్యుడి నిర్లక్ష్యం వల్ల మరణం సంభవిస్తే..సదరు వైద్యుడికి జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తారు. దీన్ని కొంతమంది వైద్యులు తప్పబడుతున్నారు. రోగికి చికిత్స చేస్తున్నప్పుడు వైద్యుడికి ఎలాంటి నేరపూరిత ఉద్దేశం ఉండదని 4 లక్షల మంది వైద్యులున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) వాదిస్తోంది. చికిత్స సమయంలో మరణించడం హత్య కాదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పార్లమెంట్ వేదికగా అంగీకరించారని ప్రధానికి రాసిన లేఖలో ఐఎంఏ ఎత్తిచూపింది. తమిళనాడులోని ఉత్తర చెన్నై నియోజకవర్గం ఎంపీ డాక్టర్ కళానిధి వీరాస్వామి అమిత్ షాకు లేఖ రాశారు. వైద్యుల నిర్లక్ష్యంపై జైలు శిక్షలు, జరిమానా విధించే కొత్త చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. అంతకుముందు చట్టం ప్రకారం జైలు లేదా జరిమానా మాత్రమే ఉండేదని గుర్తు చేస్తున్నారు.

అసలు కొత్త చట్టాలు ఏం చెబుతున్నాయి..

దేశంలో కొత్త క్రిమినల్‌ చట్టాలు అమల్లోకి వచ్చాయి. కొత్త చట్టాల ప్రకారం మైనర్‌పై సామూహిక లైంగిక దాడికి పాల్పడితే మరణ శిక్ష లేదా జీవిత ఖైదు విధించే అవకాశం ఉంది. పిల్లలను అమ్మడం లేదా కొనడం క్రూరమైన నేరంగా భావిస్తారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ విధానంతో ఒక వ్యక్తి పోలీసుస్టేషన్‌ పరిధితో సంబంధం లేకుండా ఏ స్టేషన్‌లో అయినా ఫిర్యాదు చేయవచ్చు. దీని ద్వారా ఏదైనా ఘటనను రిపోర్టు చేయడంలో లేదా చట్టపరమైన చర్యలు ప్రారంభించడంలో ఆలస్యాన్ని నివారించే అవకాశం ఉంది. కొత్త చట్టాల ప్రకారం ఏదైనా ఘటనను ఒక వ్యక్తి ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌ ద్వారా ఫిర్యాదు చేసేందుకు వీలుంది. పోలీసుస్టేషన్‌కు వ్యక్తిగతంగా వెళ్లాల్సిన అవసరం లేదు. దీని ద్వారా వేగవంతమైన ఫిర్యాదు ద్వారా అదే వేగంతో పోలీసులు తగిన చర్యలు తీసుకొనే వెసులుబాటు ఉంటుంది. ఎలక్ట్రానిక్‌ రూపంలో సమన్లు జారీ చేయవచ్చు. దీని ద్వారా చట్టపరమైన ప్రక్రియను వేగవంతం చేయడంతోపాటు పేపర్‌ వర్క్‌ను తగ్గిస్తుంది.

Tags:    

Similar News