బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఇంకా ఎందుకు జరగలేదు ?

ఎన్నికల ఫలితాలు వెలువడి నాలుగు రోజులు గడుస్తున్న బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం ఇంకా జరగలేదు. కానీ ఎన్డీఏ సమావేశం మాత్రం బీజేపీ ఇప్పటికే నిర్వహించింది.

Update: 2024-06-08 05:25 GMT

నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ వరుస సమావేశాల తరువాత మోదీ 3.0 ప్రభుత్వానికి ఎన్డీఏ పక్షాలు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి. ప్రధానిగా నరేంద్ర మోదీ మరోసారి తమ అధినేతగా 15 మిత్ర పక్షాలు ఆమోదముద్ర వేశాయి. అయితే ప్రభుత్వ ప్రక్రియలో పార్లమెంటరీ బోర్డు లేకపోవడం పై భారతీయ జనతా పార్టీ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

బిజెపి నిబంధనల ప్రకారం, ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత, బిజెపి అధ్యక్షుడు పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేసి నాయకుడిని ప్రకటిస్తారు. ఈ నిర్ణయం తర్వాత పార్లమెంటరీ సమావేశంలో నాయకుడిని ఎన్నుకుంటారు. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడి మూడు రోజులు గడుస్తున్నా పార్లమెంటరీ బోర్డు ఎప్పుడు సమావేశం కానుందనే విషయంపై ఇంకా క్లారిటీ లేదు.
పార్లమెంటరీ బోర్డు సమావేశం
11 మంది సభ్యులతో కూడిన పార్లమెంటరీ బోర్డు BJP అత్యున్నత నిర్ణయాధికార సంస్థ, కూటమి భాగస్వాములకు ప్రభుత్వంలో చేర్చుకునే ముందు అన్ని ముఖ్యమైన నిర్ణయాలను చర్చించి, బాధ్యత వహిస్తుంది. "ఎన్నికల ఫలితాలు వెలువడి ఇన్ని రోజులు గడిచినా పార్లమెంటరీ బోర్డు సమావేశం కాకపోవడం ఆసక్తి రేపుతోంది.
సాధారణంగా ఫలితాలు వెలువడిన అదే రోజు సాయంత్రం బోర్డు సమావేశమవుతుంది. ఈ సమావేశం జరగకపోవడంపై చాలా మంది బీజేపీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కేడర్ ఆధారిత రాజకీయ పార్టీ, నిబంధనలను పాటించకపోవడం ఏంటో" అని బిజెపి సీనియర్ నాయకుడు ఫెడరల్‌తో అన్నారు.
సీనియర్ బిజెపి నాయకులు పార్లమెంటరీ బోర్డు సమావేశం కాకపోవడంపై ఆశ్చర్యపడటం లేదు; బోర్డు సభ్యులు ప్రధాని మోదీని బీజేపీ నాయకుడిగా ఎన్నుకుని ఉంటారని పలువురు అభిప్రాయపడ్డారు. "ప్రస్తుతం పార్లమెంటరీ బోర్డు కూర్పు ప్రధానమంత్రి మోదీ అభీష్టానికి అనుగుణంగా ఉంది. ఆయన బిజెపికి అతిపెద్ద నాయకుడు, బోర్డు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకునేది. అయినప్పటికీ, బోర్డు సభ్యులు సమావేశం ఏర్పాటు గురించి అడగలేదు. ’’ అని బీజేపీ నేత ఒకరు అన్నారు.
ప్రభుత్వ ఏర్పాటుకు ప్రాధాన్యమిచ్చింది
ప్రభుత్వ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వడం వల్లే పార్లమెంటరీ బోర్డు సమావేశంలో జాప్యం జరుగుతోందని కొందరు సీనియర్ నేతలు అంటున్నారు. దశాబ్ద కాలంలో తొలిసారిగా బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించకపోవడంతో, పార్టీ సాంకేతిక అంశాల కంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం దృష్టి పెట్టింది. "కొన్ని నిబంధనలను పాటించడంలో జాప్యం జరుగుతోందని చెప్పడంలో అర్థం ఏమిటి? ఇవి సాంకేతిక సమస్యలు.
ఎన్‌డిఎ భాగస్వామ్య పక్షాలందరూ ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్నికలకు వెళ్లాయి. కాబట్టి ఆయన ఎన్‌డిఎ నాయకుడు. పార్లమెంటరీ బోర్డు సమావేశమైనప్పటికీ , వారు ప్రధానమంత్రి మోదీని నాయకుడిగా ఎన్నుకునేవారు, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి సభ్యులు కొంతమంది ఎన్‌డిఎ సభ్యులతో టచ్‌లో ఉండటానికి ప్రయత్నిస్తున్నారు, అని నాగ్‌పూర్‌కు చెందిన రాజకీయ వ్యాఖ్యాత, RSS సమస్యల పరిశీలకుడు, దిలీప్ దేవధర్ ది ఫెడరల్‌తో చెప్పారు.
ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌లలో బిజెపి ఆశించిన స్థాయిలో సీట్లు అందకపోవడంపై ఆర్ఎస్ఎస్ సైతం దృష్టి సారించింది. ముఖ్యమంత్రులు, జాతీయ నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలను పరిష్కరించాలని ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేతలు బీజేపీ ఉన్నతాధికారులను కోరారు. "కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులతో సహా కొంతమంది బిజెపి నాయకులు కలిసి ఉండరనేది రహస్యం కాదు. ఈ అంతర్గత పోరు ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలలో ఇండి కూటమికి ప్రయోజనం చేకూర్చింది" అని దేవధర్ వ్యాఖ్యానిస్తున్నారు.
అంతర్గత విభేదాలను నివారించి రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో బీజేపీ నేతలంతా కలిసి పనిచేయాలని ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నేతలు కోరుతున్నారు.
ఎదురుదెబ్బ బీజేపీ వ్యూహాన్ని..
లోక్‌సభ ఎన్నికలలో ఎదురుదెబ్బ తగిలినందున, రాబోయే ఎన్నికలకు సంబంధించి బీజేపీ కచ్చితంగా తన వ్యూహాన్ని పున: సమీక్షించుకుంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ముఖ్యంగా రాబోయే 18 నెలల్లో మహరాష్ట్ర, హర్యానా అసెంబ్లీలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
మహారాష్ట్రలో బీజేపీ కనబరిచిన పేలవమైన పనితీరు ఉద్దవ్ థాకరేను తిరిగి ఎన్డీఏలో చేర్చడానికి తెరవెనక ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ప్రధాని మోదీ ఇందుకు ప్రయత్నాలు చేయాలని సూచిస్తున్నారు. అలాగే ఎన్నికలకు ముందు జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)తో పొత్తును బీజేపీ తెగతెంపులు చేసుకున్న హర్యానాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
"ఉద్ధవ్ థాకరేతో మాట్లాడేందుకు ప్రధాని మోదీ తీవ్రంగా ప్రయత్నిస్తే, ఆయన సానుకూలంగా స్పందిస్తారని, కూటమి భాగస్వాములు మళ్లీ కలిసి ఉంటారని నేను నమ్ముతున్నాను. శరద్ పవార్, కాంగ్రెస్‌ను ఓడించడానికి బిజెపికి థాకరే సహాయం కావాలి" అని దేవధర్ అన్నారు.
ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఆర్‌ఎస్‌ఎస్ సీనియర్ నాయకులు ఢిల్లీలో బిజెపి నాయకత్వంతో కనీసం రెండు సమావేశాలు నిర్వహించారు, శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి)తో సహా తన మాజీ మిత్రపక్షాలన్నింటినీ తిరిగి తీసుకురావడానికి బిజెపి ప్రయత్నించాలని సూచించారు.
"ఉద్ధవ్ ఠాక్రే, SAD తో సమస్య ఏమిటంటే, బిజెపి నాయకత్వం వారి ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవడం మానేసినందున రెండు పొత్తులు విచ్చిన్నం అయ్యాయి. ప్రస్తుత నాయకత్వం మిత్రపక్షాల సమస్యలపై మరింత శ్రద్ధ చూపి, వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వగలిగితే, బిజెపి ఈ పార్టీలతో పొత్తులను పునరుద్ధరించవచ్చు, ' అని బీజేపీ నేత అన్నారు.
Tags:    

Similar News