గుజరాత్ ప్రభుత్వం చట్టబద్దంగా చేస్తున్న భూకుంభకోణం ఏంటో తెలుసా?
లీజుదారుల నుంచి యజమానులుగా మారబోతున్న ఆర్ఎస్ఎస్ సంస్థలు;
Translated by : Praveen Chepyala
Update: 2025-05-03 08:31 GMT
(మూలం.. దమయంతి ధర్)
నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ సర్కార్ గత నెలలో వక్ఫ్ సవరణ చట్టం తీసుకువచ్చింది. ఈ సవరణకు అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా వక్ఫ్ బోర్డులు తమ భూముల నుంచి సరిగా ఆదాయం పొందడం లేదని, వాటిని ఉపయోగకరంగా మారుస్తామని పేర్కొంది.
ఇప్పుడు ఆయన స్వరాష్ట్రంలోని గుజరాత్ లో ప్రభుత్వ భూముల నుంచి భారీగా ఆదాయం కోల్పోతున్న అసలు పట్టించుకోవడం లేదు.
భారీగా తగ్గింపు ధరలు..
గతవారం గుజరాత్ రెవెన్యూ శాఖ లీజ్ హోల్డ్ ప్రభుత్వ భూముల, అలాగే నగర సర్వే ప్రాంతాల పరిధిలోకి వచ్చే బంజరు భూములను నియంత్రించే నిబంధనలను సవరించింది.
మొదట అహ్మాదాబాద్, సూరత్, భరూచ్ జిల్లాలో అమలు చేయబోయే కొత్త నియమాలు, ప్రస్తుత లీజుదారులకు అనుకూలంగా ఉండబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న రేట్ల కంటే భారీ తగ్గింపు రేట్లకు ఆ భూములను శాశ్వత యాజమాన్యాన్ని లీజుదారులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
ఇక్కడ వీటిని జంత్రిరేట్లు అని పిలుస్తారు. భూములకు ప్రభుత్వం రేటు నిర్ణయించడాన్ని జంత్రిరేట్ గా అంటారు. వీటిని 2013 లో చివరిసారిగా సవరించారు.
అక్కడి అంచనాల ప్రకారం.. అహ్మాదాబాద్, సూరత్, భరూచ్ లలో భూమి ప్రస్తుత మార్కెట్ రేట్లు జంత్రిరేట్ల కంటే కనీసం ఐదు రేట్లు ఎక్కువ. అందువల్ల ప్రభుత్వం అందిస్తున్న జంత్రిరేట్లపై భారీ రాయితీ అంటే లీజుదారులు శాశత్వంగా పొందే భూమి మార్కెట్ విలువలో కొంత భాగాన్ని మాత్రమే చెల్లిస్తారన్నమాట. ఇది భూమి విలువలో దాదాపు 10 నుంచి 30 శాతం వరకూ మాత్రమే ఉంటుంది.
ఇందులో లబ్ధిదారులు ఎవరూ?
పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, ప్రస్తుతం పనిచేస్తున్న, పదవీ విరమణ చేసిన అధికారులు, చివరిది అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. బీజేపీ, సంఘ్ పరివార్ కు అనుబంధంగా ఉన్న మతపరమైన ట్రస్టులు, రాజకీయ మత సంస్థలు
కొత్త నిబంధనల ప్రకారం.. ప్రస్తుతం 30 సంవత్సరాలకు పైగా చట్టబద్దంగా బదిలీ చేయబడిన ఏదైన భూమి లీజుదారుడు ప్రభుత్వం నుంచి ఆ భూమిని శాశ్వతంగా పొందవచ్చు. ప్రస్తుతం జంత్రి రేటులో 15 శాతం స్పల్పరేటుకు ఇది తీసుకోవచ్చు.
ప్రభుత్వ భూమి లీజుకు ఇవ్వబడి, చట్టబద్దంగా లీజుదారునికి బదిలీ చేయకపోతే ఆ వ్యక్తి లేదా సంస్థ ప్రస్తుతం జంత్రి రేటు లో కేవలం 30 శాతం చెల్లించడం ద్వారా శాశ్వత యాజమాన్యాన్ని పొందవచ్చు.
లీజులన్నీ అక్రమంగా బదిలీ అయినవే.. ?
కొత్త నిబంధనల ప్రకారం.. స్పల్ప, దీర్ఘకాలిక లీజు పునరుద్దరణ, శాశ్వత, యాజమాన్య బదిలీ ప్రక్రియను సులభతరం చేసే అవకాశం కూడా భూపేంద్ర పటేల్ నాయకత్వంలోని ప్రభుత్వం తీసుకుంది. దీనర్థం ఏంటంటే.. చట్టవిరుద్దంగా బదిలీ చేయబడిన లీజులు ఉన్నవారికి కూడా శాశ్వత యాజమాన్య హక్కులు ఇస్తారని అర్థం.
ఈ నిబంధనల ప్రకారం.. లీజును చట్టవిరుద్దంగా బదిలీ చేసిన సందర్భాల్లో సైతం లీజుదారుడు భూమి విలువలో 25 శాతం చెల్లిస్తే శాశ్వత యాజమాన్యాన్ని పొందవచ్చు. అదనంగా లీజుదారుడు షెడ్యూల్డ్ తెగ, షెడ్యూల్డ్ కులం లేదా వెనకబడిన తరగతులకు చెందినవారైతే ప్రభుత్వం 20 శాతం అదనపు రాయితీని అందిస్తుంది.
రాష్ట్ర రెవెన్యూ శాఖ నోటిఫికేషన్ ప్రకారం ‘‘ రూ. కోటి వరకూ విలువైన భూమిని జిల్లా కలెక్టర్ ఆమోదించవచ్చు’’ కోటి రూపాయల కంటే ఎక్కువ విలువ గల భూమిని ఆమోదించాలంటే వాటి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపాలి. దరఖాస్తులు రెండు సంవత్సరాలలోపు చేయాలి. ఇది శాశ్వత కేటాయింపు సమయంలో కొనుగోలుదారు నుంచి జంత్రి రేటు ఆధారంగా స్టాంప్ డ్యూటీ వసూలు చేస్తారు.
భూమి విలువ.. రూ. 1,256 కోట్లు..
ప్రభుత్వం సవరించిన నిబంధనల ప్రకారం.. లీజుకు తీసుకున్న ప్రభుత్వ భూమిలో భారీగా ఆదాయం కోల్పోతోంది. రెవెన్యూ శాఖ సవరించిన జంత్రిరేట్ల ప్రకారం.. ఈ భూములు విలువ రూ. 1,256 కోట్లు. ఇందులో రూ. 980 కోట్ల విలువైన భూమి ప్రస్తుతం వివిధ హిందూ మత సంస్థలు, ట్రస్టులకు లీజుకు ఇచ్చారు.
అవి ఇప్పుడు శాశ్వతంగా యాజమాన్యం తీసుకురావడానికి అనుకూలంగా ఉన్నాయి. దాదాపు అన్ని లీజుదారులకు వారి ప్రస్తుత భూమిని తక్కువ లీజు మొత్తాలకు ఇచ్చారని రెవెన్యూశాఖ వర్గాలు చెబుతున్నాయి.
చట్టబద్దమైన భూకజ్జా..
గతంలో డెబ్బై వేల కోట్ల చదరపు మీటర్ల లీజును ప్రధానంగా హిందూ సామాజిక, మతపరమైన ట్రస్టులు, పారిశ్రామికవేత్తలకు ఇచ్చారు. వారు ఇప్పుడు శాశ్వత యాజమాన్యాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఈ ప్లాట్లలో ఎక్కువ భాగం అహ్మాదాబాద్, సూరత్, వడోదర, గాంధీనగర్ లలో సంవత్సరాలుగా లీజుకు ఇచ్చారు. ఈ లీజుల కాల వ్యవధి 20 సంవత్సరాల నుంచి 150 సంవత్సరాల వరకూ ఉంటుంది.
లీజుకు విధించే ధర ప్లాట్ పరిమాణంతో సంబంధం లేకుండా చదరపు మీటర్ కు 20 పైసల నుంచి రూ. 1 తో ప్రారంభం అవుతుంది. ఇది ఒక సంవత్సరానికి వసూలు చేసే రుసుమని ఇక రెవెన్యూ అధికారి ఒకరు ‘ది ఫెడరల్’ తో అన్నారు.
‘‘కొత్త నిబంధనతో చాలామంది మతసంస్థలు, పారిశ్రామికవేత్తలు ప్రస్తుత మార్కెట్ ధరలతో పోలిస్తే హాస్యాస్పదంగా తక్కువ ధరకు లభించే భూములను తమ ఆధీనంలోకి తీసుకోవాలనుకుంటారు. ఇది చట్టబద్దమైన భూ కజ్జా కేసు అని కొంతమంది అధికారులలో ఆందోళనలు పెరుగుతున్నాయి’’ అని అధికారి తెలిపారు.
కాగ్ నివేదిక..
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 2023-24 నివేదిక గుజరాత్ భూమి లీజు విధానం, సంబంధిత చట్టాలు, నియమాలు, నిబంధనలు ప్రస్తుత కాలానికి అనుగుణంగా లేవని ఆక్షేపించింది.
కాగ్ నివేదిక ప్రకారం.. ‘‘అహ్మాదాబాద్ లో లీజుకు ఇచ్చిన ప్రభుత్వ భూమి మొత్తం జిల్లాలో అర్హత గల పరిమితిని మించిపోయింది. 17.57 లక్షల చదరపు మీటర్ల భూమిని మత సంస్థలకు లీజుకు ఇచ్చారు.
వీటి విలువ రూ. 69.71 కోట్లుగా ఉంటుంది. రెండు సందర్భాలలో సూరత్ లో రూ. 2.03 కోట్లు అదనపు ధరలను విధించలేదు.. వసూలు చేయలేదు.. భావ్ నగర్, జామ్ నగర్ జిల్లాల్లో పారిశ్రామిక ప్రయోజనాల కోసం మేత భూమిని కూడా సక్రమంగా లీజు ఇచ్చారు’’ అని రిపోర్ట్ లో వెల్లడించింది.
ప్రభుత్వ భూమిని మతపరమైన సంస్థలకు లీజుకు ఇచ్చిన మొత్తం 6,587 కేసుల్లో 4,682 లీజులు వాస్తవానికి 1933 నుంచి 2012 మధ్య గడువు ముగిశాయి. కానీ లీజుకు తీసుకున్న భూమి నుంచి లీజుదారులను పునరుద్దరించడానికి లేదా తొలగించడానికి ఎటువంటి చర్య తీసుకోలేదని నివేదిక పేర్కొంది.
అలాగే ఐదు కలెక్టరేట్లలోని 542 మంది లీజుదారులు 72,206 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమిని కొనుగోలుదారు లేదా సంస్థ పేరుతో బదిలీ చేయడానికి అనుమతించారని కాగ్ నివేదిక బట్టబయలు చేసింది.
బీజేపీ ద్వంద్వ ప్రమాణాలు..
దేశవ్యాప్తంగా ముస్లింలు మతపరమైన దానధర్మాలుగా ఇచ్చిన భూమి విషయంలో బీజేపీ కేంద్ర నాయకత్వం నిర్వహణ లోపాలు, మాఫియా రాజ్ గురించి ఆరోపణలు చేయవచ్చు కానీ లీజులో స్పష్టమైన అవకతవకలు, ఇప్పుడు స్పష్టంగా శాశ్వతంగా మారబోతున్నా విషయం రెవెన్యూ అధికారి దృష్టికి వచ్చింది. ప్రభుత్వ భూమి ప్రైవేట్ పౌరులు, వివిధ హిందూ సంస్థలకు కేటాయిస్తున్నట్లు తేలింది.
రెవెన్యూ శాఖ రికార్డుల ప్రకారం.. గుజరాత్ ప్రభుత్వం సూరత్, వడోదరలోని ప్రీమియం రియల్ ఎస్టేట్ జిల్లాల్లో సంవత్సరాలుగా లీజులకు ఇచ్చిన భూములలో ఎక్కువ భాగం హిందూ మతసంస్థలు, మితవాద సంస్థలకు చెందినవి.
‘‘వడోదరలో 150 మందికి పైగా లీజుదారులు ఉన్నారు. అన్నీ ప్రధానంగా హిందూ మతపరమైన ట్రస్టులు. వీటిలో చాలా సంస్థలు ఇప్పుడూ తమ ప్లాట్ల శాశ్వత యాజమాన్యం కోసం దరఖాస్తు చేసుకున్నాయి’’ అని సదరు రెవెన్యూ అధికారి తెలిపారు.
ఎస్జేఎమ్ కి అనువైన భూమి..
ఈ లీజుదారుల్లో వడోదరలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ స్వదేశీ జాగరణ్ మంచ్ (ఎస్జేఎం) కు అతి పెద్ద కార్యాలయం ఉంది. ‘‘2012 లో స్వదేశీ జాగరణ్ మంచ్, నగరం నడిబొడ్డును 325 ఎకరాల్లో విస్తరించి ఉన్న ప్రభుత్వ స్థలంలో ఒక బోర్డును ఏర్పాటు చేసింది.
2015 నాటికి ఆ స్థలంలో ఐదు అంతస్తుల భవనం వచ్చింది’’ అని మంచ్ కు భూమిని లీజుకు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ గుజరాత్ హైకోర్టులో పిల్ దాఖలు చేసిన నగరానికి చెందిన న్యాయవాది నిషా పటేల్ ది ఫెడరల్ తో అన్నారు.
‘‘స్వదేశీ జాగరణ్ మంచ్ 325 ఎకరాల భూమిని ఎకరానికి 30 పైసల చొప్పున 99 సంవత్సరాలకు లీజుకు పొందింది. ఈ సమయంలో, ఆ ప్రాంతంలో లీజుకు భూమిని బదిలీ చేయడానికి మార్కెట్ రేట చదరపు మీటర్ కు రూ. 3500 గా ఉండేది.
ఇప్పుడు అది చదరపు కిలోమీటర్ కు రూ. 10,500 కి పెరిగింది. 2012 లో స్వదేశీ జాగరణ్ మంచ్ లీజుకు తీసుకున్న భూమి బదిలీ ఖర్చు దాదాపు రూ. 46 కోట్లు కానీ లీజు బదిలీకి ఆ సంస్థ ప్రభుత్వానికి కేవలం రూ. 1.30 లక్షలు మాత్రమే చెల్లించింది’’ అని పటేల్ ఆరోపించారు. చివరికి భూమి యాజమాన్యం చివరకు కోర్టు ఆ సంస్థకు బదిలీ న్యాయసమ్మతమే అని అంగీకరించింది.
ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థకు మూడు వేల ఎకరాలు..
2015 లో ఇలాంటి కేసే ఒకటి వచ్చింది. సూరత్ మున్సిపల్ కార్పోరేషన్ 2,450 ఎకరాల గౌచర్ భూమిని మరోక ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన డాక్టర్ అంబేడ్కర్ వనవాసి కల్యాణ్ ట్రస్ట్ కు రూ. 1 వార్షిక ఫీజుకు 99 సంవత్సరాల పాటు లీజుకు వచ్చింది. 2019 లో ట్రస్ట్ ధర నిబంధనలకు ఎస్ ఎంసీ నుంచి అదనంగా 880 ఎకరాలను లీజుకు తీసుకుంది.
ఎస్ఎంసీ నిర్ణయాన్ని కోర్టుల్లో సవాలు చేసిన గిరిజన హక్కుల కార్యకర్త కృష్ణకాంత్ ‘ది ఫెడరల్’ తో మాట్లాడారు. ‘‘ఎస్ఎంసీ స్టాండింగ్ కమిటీ 2015 లో దానికి జరిగిన సమావేశంలో ట్రస్ట్ కు భారీ గౌచర్ భూమిని లీజుకు తీసుకోవడానికి ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది.
లీజు పత్రాలను అధికారికంగా మోహన్ భాగవత్ ఆ సంవత్సరం ఆగష్టులో నగరాన్ని సందర్శించినప్పుడు ఆయనకు అందజేశారు’’ అని అన్నారు.
‘‘సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం.. కోర్టు ఆదేశాలు లేకుండా గౌచర్ భూమిని ఎవరికీ కేటాయించలేము. కానీ నేను ట్రస్ట్ కు కేటాయించడానని సవాల్ చేసినప్పుడూ ఈ ప్లాట్ బంజరు భూమి అని దానిని లీజుకు ఇస్తున్నామని మాత్రమే వాదించారు.
అమ్మకానికి కాదని ఎస్ఎంసీ వాదించింది. డిసెంబర్ 2015 నుంచి సెప్టెంబర్ 2016 వరకూ ఈ కేసుపై కేవలం మూడు విచారణలు మాత్రమే జరిగాయి. ఆపై మార్చి 2017 లో కేసు ఫైల్ కనిపించకుండా పోయిందని నా న్యాయవాదికీ సమాచారం అందింది’’ అని కృష్ణకాంత్ అన్నారు.
బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు లీజు హోల్డ్ నియమాలను శాశ్వతంగా సవరిస్తున్నందున కృష్ణకాంత్, నిషా పటేల్ వంటి సామాజిక కార్యకర్తలు అత్యంత దారుణమైన భయాన్ని ఎదుర్కొంటున్నారు.
ప్రభుత్వ ఖజానాకు శాశ్వత నష్టం వాటిల్లబోతోంది. ప్రయివేట్ వ్యక్తులు, సంస్థలు , మత సంస్థలు భారీగా లబ్ధి పొందబోతున్నాయి. ఇది వక్ప్ భూమికాదు.