అక్షర్ ధామ్ దేవాలయంపై ఉగ్రవాద దాడి జరిగి 23 ఏళ్లు

బాధితులకి నివాళులర్పించిన వీహెచ్పీ, బీజేపీ, భజరంగ్ దళ్

Update: 2025-09-25 09:02 GMT
గుజరాత్ లోని అక్షర్ ధామ్ ఆలయం

దమయంతి ధర్

గుజరాత్ లోని గాంధీనగర్ లో గల ప్రసిద్ధ స్వామి నారాయణ్ అక్షర్ ధామ్ ఆలయంపై దాడి జరిగి సెప్టెంబర్ 24 నాటికి 23 సంవత్సరాలు పూర్తి అయింది. ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో పౌరులు భద్రతా సిబ్బంది సహ 33 మరణించారు.

రాష్ట్రంలో అంతకుముందు జరిగిన మత ఘర్షణలో వేయి మందికి పైగా మరణించడంతో అప్పడప్పుడే సాధారణ స్థితికి చేరుకుంటోంది. సరిగా అలాంటి సమయంలోనే గుజరాత్ పై ఉగ్రవాదులు దాడి చేసి అమాయకుల ప్రాణాలు తీశారు. దాదాపు 14 గంటల పాటు ఈ ఆపరేషన్ సాగింది.

దాడి జరిగి 23 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బాధితుల కోసం బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ సభ్యులు ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించారు.అనంతరం అక్షర్ ధామ్ ఆలయాన్ని సందర్శించారు.
రక్షించిన బృందాలు..
బనస్కాంత జిల్లాలోని నేషనల్ సెక్యూరిటీ గార్డ్(ఎన్ఎస్జీ) సంఘటన స్థలానికి చేరుకునే సరికి గ్రెనెడ్ దాడిలో పలువురు రాష్ట్ర పోలీసులు మరణించారు. రాష్ట్ర రిజర్వ్ పోలీస్ జవాన్ దివంగత అల్లా రఖా ఉనాడ్జమ్ కూడా ఈ దాడిలో మరణించాడు. ఆయన ఇంటికి వెళ్లి బీజేపీ నాయకుడు శంకర్ చౌదరి నివాళులర్పించారు. ఆయన జిల్లాలోని మదనా గ్రామానికి చెందినవాడు.
సబర్కాంతలో బీజేపీ హిమ్మత్ నగర్ ఎమ్మెల్యే వినేంద్ర సిన్హ్ దిలిప్ సిన్హ్ జాలా గ్రనెడ్ దాడిలో మరణించిన ఎస్ ఆర్పీకి చెందిన మరో జవాన్ అర్జున్ సింగ్ గమేటీ ఇంటిని సందర్శించారు.
అప్పుడు ఏం జరిగింది..
‘‘ఎస్ఆర్పీ జవాన్లు అల్లా రఖా, అర్జున్ గమేటీ లేకుంటే ఇంకా ఎక్కువ మంది చనిపోయి ఉండేవారు. ఈ రోజు సంఘటనా స్థలానికి మొదట స్పందించినది ఎస్ఆర్పీ గాంధీనగర్ యూనిట్.
ఆలయాన్ని చుట్టుముట్టడానికి ఓ బృందం ఉంది. గమేటీ ఆధ్వర్యంలో మరొక బృందం ఆలయం వెనక నుంచి ప్రవేశించి, భక్తులను భద్రపరచడానికి పంపారు. అల్లా రఖా కూడా ఈ బృందంలో భాగం.
వారు ఆలయ గర్బగుడి వద్దకు చేరుకోగలిగారు. అక్కడ చాలామంది భక్తులు దాక్కున్నారు. సాయంత్రం ఎన్ఎస్జీ వచ్చే వరకూ వారిద్దరు గర్భగుడిలోకి ఉగ్రవాదులు వెళ్లకుండా అడ్డుకున్నారు.
అయితే ఉగ్రవాదుల జరిపిన గ్రనెడ్ దాడిలో వారు వీరమరణం పొందారు’’ అని గాంధీనగర్ పోలీస్ సూపరిండెంటెండెంట్ ఆర్బీ బ్రహ్మ భట్ ది ఫెడరల్ తో అన్నారు.
‘‘ఉగ్రవాదులు ఉన్న కచ్చితమైన లోకేషన్ కనుగొనడానికి మూడో బృందానికి నేను నాయకత్వం వహిస్తున్నాను. మేము ప్రధాన ద్వారం నుంచి లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడూ విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
నా పై కాల్పులు జరిగాయి. ఆసుపత్రికి తీసుకెళ్లాల్సి వచ్చింది. కానీ కుట్లు వేశాక తరువాత సంఘటన స్థలానికి తిరిగి వచ్చాను. ఆపరేషన్ 12 గంటలకు పైగా కొనసాగింది. అక్కడ మేము ఎన్ఎస్జీకి సాయం చేసాము’’ అని ప్రస్తుతం సీఐడీ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ గా ఉన్న బ్రహ్మ భట్ అన్నారు.
ప్రత్యేక సినిమా..
బీజేపీ అహ్మదాబాద్ యూనిట్.. రెండు మల్టీప్లెక్స్ లలో సాయంత్రం అక్షర్ ధామ్ ఆపరేషన్ వజ్ర శక్తి సినిమా ప్రత్యేక ప్రదర్శనను ఏర్పాటు చేసింది.
‘‘ప్రతి సంవత్సరం అక్షర్ ధామ్ ఆలయంలో మరణించిన వారి జ్ఞాపకార్ధం ఒక కార్యక్రమం నిర్వహిస్తారు. మేము ప్రార్థన సమావేశానికి హజరవుతాము. ఆ తరువాత అక్షర్ ధామ్ ఆపరేషన్ వజ్ర శక్తి సినిమా ప్రత్యేక ప్రదర్శన ను ఏర్పాటు చేసాము’’
అని అహ్మాదాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు ప్రేరక్ భాయ్ షా అన్నారు. అయితే ఈ దాడిలో అసువులు బాసిన వారిని కోల్పోయిన అనేక కుటుంబాలు ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా దూరంగా ఉన్నాయి.
జీవితం అప్పటిలా లేదు..
‘‘నా కొడుకు, మనవరాలిని ఉగ్రవాదుల దాడిలో కోల్పోయాను. అప్పటి నుంచి ఆలయాన్ని సందర్శించలేదు. ఏ స్మారక ప్రార్థనకు హజరుకాలేదు. ప్రతి సంవత్సరం మరణించిన వారి జ్ఞాపకార్థం ఆలయంలో ప్రార్థన సమావేశం నిర్వహిస్తారు.
అక్షర్ ధామ్ అధికారులు ప్రతి సంవత్సరం నాకు ఫోన్ చేస్తారు. కానీ నేను మళ్లీ ఆలయంలోకి అడుగుపెట్టడానికి ధైర్యం చేయలేదు. ఆ సంఘటన గుర్తుకు రావడం నేను భరించలేకపోతున్నాను’’ అని దాడిలో కొడుకు, మనవరాలిని కోల్పోయిన 81 సంవత్సరాల అరుణా షా ‘ది ఫెడరల్’ తో అన్నారు.
‘‘ఆ రోజు మనవరాలు ‘పూర్తి’ పుట్టిన రోజు. ఆమెకు ఆరోజుతో మూడు సంవత్సరాలు వస్తాయి. నా కొడుకు శివం, కోడలు, పూర్తి కలిసి స్వామి ఆశీస్సుల కోసం గుడికి వెళ్లాము. కానీ సెప్టెంబర్ 25న ఉదయం పోలీసులు హత్యకు గురైన వారి మృత దేహాలను బయటకు తీసుకొచ్చాక శివం, పూర్తి చనిపోయారని తెలిసింది.
నా కోడలు గాయపడి ఆసుపత్రి పాలైంది. నేనే తన భర్త, కుమార్తె మరణం గురించి చెప్పాల్సి వచ్చింది. నా జీవితం అప్పటిలా లేదు’’ అని గాంధీ నగర్ నివాసి అన్నారు.
గుజరాత్ రాజధాని గాంధీనగర్ లోని దాడి జరిగినప్పుడూ సువర్ణ నానావతికి 19 సంవత్సరాలు. ఆ దురదృష్టకర రోజున, ఆమె కొత్తగా పైళ్లైన సోదరి, బావమరిదితో కలిసి ఆలయానికి వెళ్లింది.
‘‘మా కుటుంబంలో కొత్తగా పెళ్లైన జంట స్వామి నారాయణ్ ఆలయాన్ని సందర్శించి, వారి భవిష్యత్ కోసం ఆశీర్వాదాలు కోరుకోవడం ఆచారం. కానీ సోదరి, బావమరిది వివాహ జీవితాన్ని అనుభవించలేకపోయారు.
వారి వివాహాం తరువాత కేవలం వారం రోజులకే వారు ఉగ్రవాదుల దాడిలో మరణించారు. నా తల్లి ఆ వార్తను అంగీకరించకలేకపోయింది. ఆమెకు విషయం చెప్పగానే మూర్చపోయింది. ఆ తరువాత అనారోగ్యంతో 2019 లో మరణించింది. తన చివరి శ్వాస వరకూ ఆమె నా అక్క సోనాలిని కలవరించింది’’ అని నానావతి ది ఫెడరల్ తో అన్నారు.
స్మారక రాజకీయాలు..
‘‘నాకు ఇంకా గుర్తుంది. నేను నా సోదరిని ఆలయంలోకి వెళ్లమని చెప్పాను. నేను అక్షర్ ధామ్ ఆలయంలోని క్యాంటీన్ నుంచి నీరు తీసుకురావడానికి బయలుదేరాను. నేను ఆమెను మళ్లీ చూడలేదు.
ఆ సమయంలో క్యాంటీన్ లో దాదాపు 20 లేదా 30 మంది ఉన్నారు. క్యాంటిన్ సిబ్బంది వేగంగా వ్యవహరించి మమ్మల్ని వంటగదిలోకి తీసుకెళ్లి లోపలి నుంచి తలుపు లాక్ చేసి మమ్మల్ని రక్షించారు.
అప్పటి నుంచి నేను ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 24న ప్రార్థన సమావేశంలో పాల్గొనడానికి ఆలయాన్ని సందర్శించాను. నేను ప్రార్థిస్తే నా సోదరి, బావమరిది ప్రశాంతంగా ఉంటారని నేను నమ్ముతున్నాను.
అందుకే ప్రతి సంవత్సరం ఆలయానికి వస్తాను. గత సంవత్సరం నేను అహ్మదాబాద్ లో జరిగిన సమావేశానికి కూడా హజరయ్యాను. కానీ నేను ఈ రోజు ఆ సమావేశానికి హజరుకావడం లేదు. సంఘటనతో సంబంధం లేని వ్యక్తులు నిర్వహించే స్మారక సమావేశానికి హజరుకావడంలో అర్థం లేదు’’ అని ఆమె అన్నారు.
దాడి జరిగిన సమయంలో హితేష్ ధారియా ఆలయంలో సెక్యురిటీ గార్డుగా పనిచేశాడు. నాలుగు బుల్లెట్ గాయాలతో బయటపడ్డాడు. ఎనిమిది నెలల పాటు అహ్మదాబాద్ లోని సివిల్ హాస్పిటల్ లో చికిత్స పొందిన తరువాత తన అవయవాన్ని తిరిగి అటాచ్ చేయడానికి ముంబైలోని ఒక ప్రయివేట్ హాస్పిటల్ లో ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవలసి వచ్చింది.
‘‘ప్రారంభంలో నేను అహ్మాదాబాద్ సమావేశాలకు హజరయ్యేవాడిని. నా అనుభవం గురించి మాట్లాడటానికి చాలా సంస్థలు నాకు ఫోన్ చేసేవి. కానీ 2007 లో అమరవీరుడు ఎస్ఆర్పీ జవాన్ అల్లారఖా తండ్రి అక్షర్ ధామ్ ఆలయాన్ని సందర్శించాలని అనుకున్నాడు.
దీనిపై నిర్వాహకులు నిరసన తెలిపారు. నేను ఈ సమావేశంలో దానికి హాజరుకావడం మానేశాను. ఈ సంఘటన జరిగి రెండు దశాబ్ధాలకు పైగా అయింది. రాజకీయ పార్టీలు ఇప్పుడు మమ్మల్ని ఒంటరిగా వదిలేయాలని నేను భావిస్తున్నాను’’ అని ధారియా ది ఫెడరల్ తో అన్నారు.
‘‘నేను ఇప్పటికీ నా కుడి చేతిని స్వేచ్చగా కదపలేకపోతున్నాను. నేను ముంబై నుంచి తిరిగి వచ్చిన తరువాత అహ్మాదాబాద్ లోని ఒక ఎన్జీఓ లో స్వచ్చంద సేవకురాలిగా ఉన్నాను.’’ అని 54 ఏళ్ల ధారియా అన్నారు.


Tags:    

Similar News