సారీ గోవా కాదు.. ‘గోమా’ అంట.. ప్రమాదం పై క్లారిటీ

సామాజిక మాధ్యమాల్లో పడవ ప్రమాదం జరిగిన వీడియో విస్తృతంగా చలామణీ అవుతోంది. ఇది దేశంలోని గోవాలో జరిగిందని ఈ యాక్సిడెంట్ లో పదుల సంఖ్యలో ప్రజలు..

By :  491
Update: 2024-10-05 12:50 GMT

భారత్ లోని గోవాలో కిక్కిరిసిన పడవ బొల్తా పడి 78 మంది మృతి చెందారని సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వైరల్ అయింది. ఎక్స్ లో మల్టీ డెక్ ఓడ బొల్తా పడిన వీడియో బాగా పాపులర్ కావడంతో గోవా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ పడవ ప్రమాదం ఆఫ్రికాలోని కాంగో దేశంలోని జరిగిందని వివరించారు.

కాంగోలోని గోమాలోని కివు సరస్సుపై కిక్కిరిసిన పడవ బొల్తా పడిందని ఇందులో 78 మంది ప్రయాణికులు మరణించారని పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై రిపబ్లిక్ ఆఫ్ కాంగో లోని పోలీసులు ఇన్విస్టిగేషన్ కూడా ప్రారంభించారని తెలిసింది. అయితే అది ఫేక్ న్యూస్ అని, ఆ వీడియో కాంగోకి చెందినదని గోవా పోలీసులు స్పష్టం చేశారు.

“గోవా తీరానికి సమీపంలో పడవ బోల్తా పడిందని సోషల్ మీడియాలో ఒక వీడియో హల్ చల్ చేస్తోంది. ఇది అబద్ధం. ఈ ఘటన ఆఫ్రికాలోని కాంగోలోని గోమాలో చోటుచేసుకుంది. దయచేసి ధృవీకరించని వార్తలను షేర్ చేయడం మానుకోండి” అని గోవా పోలీసులు శనివారం (అక్టోబర్ 5) తమ అధికారిక ఎక్స్ హ్యాండిల్‌లో తెలిపారు.
క్వాంగో నదిలో గత నెలలో మరో పడవ బోల్తా పడిన ఘటనపై కూడా విచారణ జరుపుతున్నట్లు కాంగో అధికారులు తెలిపారు. "ఈ పరిశోధనలు ఈ దురదృష్టకర సంఘటనల పరిస్థితులను స్పష్టం చేయడం, బాధ్యతలను ఏర్పాటు చేయడం లక్ష్యంగా పెట్టుకుంటాయి. తద్వారా ఈ ప్రమాదాలకు మూలంగా ఉన్న వ్యక్తులు న్యాయస్థానాల ముందు విచారణ ఎదుర్కొంటారు" అని న్యాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
దక్షిణ కివు ప్రావిన్స్ గవర్నర్ ప్రకారం, మరణించిన వారి సంఖ్య 78కి చేరింది. ప్రమాద సమయంలో బోటులో దాదాపు 278 మంది ప్రయాణికులు ఉన్నారు. "కచ్చితమైన సంఖ్యలను పొందడానికి కనీసం మూడు రోజులు పడుతుంది, ఎందుకంటే అన్ని మృతదేహాలు ఇంకా కనుగొనబడలేదు" అని గవర్నర్ జీన్ జాక్వెస్ పురిసి రాయిటర్స్‌తో అన్నారు.

Tags:    

Similar News