‘‘ముంబైలో కోవిడ్ వల్ల ఎవరూ మరణించలేదు‘‘

బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ ప్రకటనను తోసిపుచ్చిన కేఈఎం ఆస్పత్రి;

Translated by :  Praveen Chepyala
Update: 2025-05-20 09:48 GMT

ముంబైలోని వైద్య కేంద్రంలోని ఇద్దరు రోగుల మరణాలు కోవిడ్ వల్ల జరగలేదని, కో మోర్బీడిటీల కారణంగా జరిగాయని కేఈఎం ఆసుపత్రి సోమవారం స్పష్టం చేసింది. ప్రజలు ఎవరూ దీనిపై ఆందోళన చెందవద్దని సూచించింది.

పరేల్ లోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్(కేఈఎం) ఆసుపత్రిలో కోవిడ్ 19 సోకిన ఇద్దరు రోగులు మరణించినట్లు బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్(బీఎంసీ) ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇందులో 14 ఏళ్ల టీనేజర్ సహ 54 సంవత్సరాల మహిళ ఉందని తెలిపింది.
అయితే ఈ ప్రకటనలను ఆస్పత్రి యాజమాన్యం ఖండించింది. కోవిడ్ వల్ల ఈ మరణాలు జరగలేదని, హైపోకాల్సేమిక్ మూర్చలు, క్యాన్సర్ తో కూడిన నెఫ్రోటిక్ సిండ్రోమ్ వంటి తీవ్రమైన వ్యాధుల వల్ల సంభవించాయని ఆసుపత్రి అధికారులు స్పష్టం చేసినట్లు ప్రకటనలో తెలిపింది.
అందువల్ల ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పౌర సంఘం తెలిపింది. కోవిడ్ -19 ప్రస్తుతం కేవలం ఒక ఆరోగ్య సమస్యగా పరిగణిస్తున్నారని, అది మహమ్మారి కాదని అన్నారు. చాలా తక్కువ కేసులు మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా నమోదు అవుతున్నాయని అది కూడా అప్పుడప్పుడూ మాత్రమే అని నివేదికలు తెలుపుతున్నాయి.
ఆసుపత్రిలో మరణించిన ఇద్దరు రోగులు కూడా నగరానికి చెందిన వారు కాదని సింధు దుర్గ్ జిల్లా, అలాగే థానే జిల్లాలకు చెందిన డోంబివ్లికి చెందినవారని ఓ ప్రకటనలో యాజమాన్యం తెలిపింది.
తూర్పు ఆసియాలో కేసులు..
గత కొన్ని రోజులుగా సింగపూర్, హాంకాంగ్, తూర్పు ఆసియా కొన్ని దేశాలలో కోవిడ్ కేసులు పెరుగుతున్నట్లు కొన్ని నివేదికలు వస్తున్నాయి. కొన్ని రోజుల వ్యవధిలోనే వందల కేసులు నమోదు అయినట్లు అక్కడి మీడియా కథనాలు ప్రచురించింది.
‘‘బీఎంసీ ఆరోగ్య శాఖ నిరంతరం కోవిడ్- 19 వ్యాప్తిని పర్యవేక్షిస్తుంది. జనవరి 2025 నుంచి ఏప్రిల్ 2025 వరకూ కోవిడ్ -19 రోగుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు రిపోర్ట్ వస్తుంది. కానీ మే ప్రారంభం నుంచి కొన్ని కోవిడ్ కేసులు నమోదయ్యాయి. అయితే ఈ విషయంలో భయపడవద్దని బీఎంసీ పరిపాలన పౌరులకు విజ్ఞప్తి చేస్తోంది’’ అని ప్రకటన జోడించింది.
ముంబైలోని మునిసిపల్ ఆసుపత్రులలో కోవిడ్-19 రోగులకు చికిత్స చేయడానికి ప్రత్యేక పడకలు, గదులు కేటాయించడం వంటి ఏర్పాట్లు చేసినట్లు బీఎంసీ తెలిపింది. అవసరమైతే ఈ సామర్థ్యాన్ని వెంటనే పెంచుతామని కూడా ఓ ప్రకటనలో తెలిపింది.



Tags:    

Similar News