ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్యలతో మోదీ మారతారా?
ప్రధాని మణిపూర్ లో పర్యటించకపోవడం పట్ల ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ ఆందోళన
By : Praveen Chepyala
Update: 2024-06-12 11:56 GMT
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ లో పరిస్థితి ఇంకా నివురు గప్పిన నిప్పులా ఉందని, దీనిపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పందించిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఈశాన్య రాష్ట్రంలో పర్యటిస్తారా అని శివసేన(యూబీటీ) నాయకుడు ఉద్దవ్ ఠాక్రే ప్రశ్నించారు. జమ్మూకాశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ 370 తొలగించిన తరువాత అక్కడ జరిగిన స్పష్టమైన మార్పుల గురించి ప్రస్తావించాలని కూడా అడిగారు. " ప్రజల ప్రాణాలు పోతున్నాయి. జమ్మూ కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడులకు బాధ్యులెవరు?" అతను ఠాక్రే ప్రశ్నించారు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ భగవత్ సోమవారం మణిపూర్‌లో శాంతి నెలకొనడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఒక సంవత్సరం తర్వాత కూడా మణిపూర్‌లో శాంతిభద్రతలు అదుపులోకి రాకపోవడం, కలహాలతో ఉన్న ఈశాన్యరాష్ట్రాల్లో పరిస్థితికి అత్యంత ప్రాధాన్యతతో సరిదిద్దాలని అన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ వ్యాఖ్యల తర్వాత ప్రధాని మోదీ మణిపూర్ వస్తారా? అని థాకరే ప్రశ్నించారు. "నేను దేశ భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నాను. NDA ప్రభుత్వ భవిష్యత్తు గురించి కాదు" అని శివసేన (UBT) నాయకుడు అన్నారు.
శరద్ పవార్ నేతృత్వంలోని శివసేన (యుబిటి), కాంగ్రెస్, ఎన్‌సిపి (ఎస్‌పి)లతో కూడిన ప్రతిపక్ష మహా వికాస్ అఘాడిలో నాలుగు నియోజకవర్గాలకు జరగనున్న రాష్ట్ర శాసన మండలి ఎన్నికలకు అభ్యర్థులపై ఎలాంటి విభేదాలు లేవని ఆయన అన్నారు. " మా మధ్య ఎలాంటి తేడా లేదు" అని థాకరే నొక్కిచెప్పారు. అయితే మహ వికాస్ అఘాడీ మధ్య కొన్ని పొరపొచ్చాలు ఉన్న మాటలు వాస్తవమే అని, లోక్ సభ ఎన్నికల తరువాత తాను ఇక్కడ లేనని థాకరే అంటున్నారు.
ఈ సమయంలోనే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించాయని, నిర్ణీత గడువులోగా నామినేషన్లు దాఖలు చేయాలని చెప్పారు. నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ జూన్ 7 కాగా, జూన్ 26న ఓటింగ్ నిర్వహించి జూలై 1న ఫలితాలు వెల్లడిస్తారు.