గుజరాత్ అల్లర్ల విషయంపై ప్రధాని మోదీ చెప్పింది నిజమేనా?

ప్రభుత్వ గణాంకాలు అల్లర్లపై ఏం చెబుతున్నాయి?;

By :  491
Update: 2025-03-19 10:24 GMT

దమయంతి ధర్

లీక్స్ ఫ్రిడ్ మాన్ తో జరిగిన పాడ్ కాస్ట్ లో ప్రధాని మోదీ మాట్లాడుతూ.. 2002 తరువాత గుజరాత్ లో ఎక్కడా కూడా అల్లర్లు జరగలేదని అన్నారు. అది నిజమేనా? కానీ హుస్సేన్ భాయ్ రహీమ్ వాలా షేక్ విషయంలో మాత్రం ప్రధాని చెప్పినట్లుగా జరిగిందా?

గుజరాత్ లోని ఉత్తర ప్రాంతానికి చెందిన పటాన్ లోని వాడావలి అనే గ్రామంలో మార్చి 25-26, 2017 లో అల్లర్లు జరిగాయి. దీనితో ఇక్కడ నివసిస్తున్న దాదాపు 50 ముస్లిం కుటుంబాలు పారిపోవాల్సి వచ్చింది.
ఇందులో షేక్ కుటుంబం కూడా ఉంది. ఈ కుటుంబం ఇంతకుముందు 2002 లో అల్లర్ల నుంచి బయటపడింది. ఈ కుటుంబం ‘ది ఫెడరల్’ తో మాట్లాడింది. గ్రామంలోని ముస్లిం కుటుంబాలపై దాదాపు వందమంది కూడిన గుంపు దాడి చేసి భయానక స్థితి సృష్టించించింది.
మూడూ గంటల్లో దాదాపు 80 ఇళ్లను దోచుకుని, కాల్చి వేశారు. ఇద్దరు ముస్లింలు చనిపోయారు. వారికి సంబంధించిన అన్ని దుకాణాలను దోచుకున్నారు.
ఉన్మాదం..
‘‘2002 అల్లర్ల తరువాత మేము వాడావళికి వచ్చాము. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. అల్లర్లు గ్రామాన్ని ప్రభావితాన్ని చేయలేదు. కానీ మా జీవితాలను పూర్తిగా పునర్ నిర్మించుకోవాల్సి వచ్చింది.
కానీ 2017 లో మరోసారి అలాంటి గుంపు పోగవడం చూశాము. తరువాత మేమంతా గాంధీనగర్ కి పారిపోయాము’’ అని నగరంలోని కలోల్ ప్రాంతంలో నివసిస్తున్న షేక్ చెప్పారు.
ఈ అల్లర్లు జరిగిన తరువాత కొన్ని రోజులకే గుజరాత్ లోని ఆరావళి జిల్లాలోని వడగామ్ లో మరో మత అల్లర్లు జరిగాయి. ఇక్కడ నివసిస్తున్న 35 సింధి ముస్లిం కుటుంబాలు గ్రామం వదిలిపోవాల్సి వచ్చింది.
అడవుల్లోకి పారిపోయాము..
‘‘మార్చిలో గ్రామంలోని ఓ మైనర్ బాలికను, ముస్లిం యువకుడు వేధించాడు. ఈ విషయం బాలిక ఇంటికి వెళ్లి చెప్పడంతో గ్రామానికి చెందిన 25 మంది వచ్చి ఆ యువకుడిని కొట్టారు’’ అని అల్లుభాయ్ అనే నివాసి చెప్పారు.
‘‘రాత్రి సమయంలో అక్భర్ ను అప్పగించాలని డిమాండ్ చేస్తూ మరో గుంపు వచ్చింది. శాంతిని కాపాడాటానికి అక్భర్, నేను వారితో పాటు వచ్చాము. వారు అరగంట పాటు మమ్మల్ని కొట్టి పోయారు.
దాదాపు 500 మందితో కూడిన పెద్దగుంపు కర్రలు, కత్తులు, పైపులతో వచ్చింది. దాడిలో పన్నెండు మంది గాయపడ్డారు. ’’ అని అల్లుభాయ్ గుర్తు చేసుకున్నారు.
కమ్యూనల్ హోర్డింగ్ లు..
గుజరాత్ కు చెందిన హక్కుల కార్యకర్త హెూజఫా ఉజ్జయిని ‘ది ఫెడరల్’ తో మాట్లాడుతూ భయంతో పారిపోయిన కుటుంబాలను గ్రామానికి తిరిగి రమ్మని సలహ ఇవ్వడానికి ప్రయత్నించామని చెప్పారు.
అయితే ఈ ప్రాంతంలో అనేక కమ్యూనల్ హోర్డింగ్ లు కనిపించాయి. హిందూ రాష్ట్ర కే వడగం, ధన్సురా, హర్సోల్ ఔర్ తలోద్ మే ఆప్కా స్వాగత్( హిందూ రాష్ట్రం, హర్సోల్, తలోద్ లకు స్వాగతం) అని ఉన్నాయి.
హోంమంత్రిత్వ శాఖ రికార్డులు..
దీని బట్టి ఈ మధ్య జరిగిన పాడ్ కాస్ట్ లో మోదీ చేసిన వాదనలు నిజం కాదని చెప్పవచ్చు. 2004 నుంచి 2022 వరకూ ప్రతి సంవత్సరం అనేక మత సంఘటనలు జరిగాయి.
‘‘2002 అల్లర్ల ప్రభావం లేని వివిధ గ్రామాలు, పట్టణాలలో ముస్లిం కుటుంబాలు స్థిరపడటం ప్రారంభించడంతో 2004 నుంచి చిన్న తరహ అల్లర్లు ప్రారంభమయ్యాయి’’ అని హక్కుల సంస్థ మైనారిటీ కో ఆర్డినేషన్ కమిషన్ సమన్వయ కర్త ముజాహిద్ నఫీస్ ది ఫెడరల్ తో అన్నారు.
అల్లర్ల సంవత్సరాలు..
2017 నుంచి 2022 మధ్య గుజరాత్ లో 13 మత హింస సంఘటనలు జరిగాయి. వాటిలో పది సంఘటనలు.. ఆనంద్, సబర్కాంత జిల్లాల్లో వడోదర, మెహసీనా, గిర్ సోమంత్ లో ఒక్కక్కటి జరిగాయి. ఈ కాలంలో బీజేపీ ఓట్ షేర్ కూడా 20 శాతం పడిపోయింది.
2017 రాష్ట్ర ఎన్నికల్లో కొంత కాంగ్రెస్ ప్రతిభ కనపర్చిన తరువాత కోట ఖంభట్ లో అప్పుడప్పుడూ మత ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. తరువాత 2018 లో ప్రభుత్వం పట్టణంలో డిస్టర్బెడ్ ఏరియాస్ ఆక్ట్ ను విధించింది. ఇది రెండు మత వర్గాల మధ్య ఆస్తి అమ్మకాన్ని నిషేధించింది.
చిన్న చిన్న విషయాలకే హింస..
ఫిబ్రవరి 2019 లో అక్బర్ పురాలో గాలిపటాలు ఎగురవేయడంపై ఇద్దరు పిల్లల మధ్య జరిగిన చిన్న గొడవ మత ఘర్షణగా మారింది. పోలీసులు ఏడు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. టియర్ గ్యాస్ ప్రయోగించారు. ఈ హింసలో ఒక పోలీస్ గాయపడ్డాడు.
పుల్వామా దాడి జరిగిన తరువాత మరోక మతపరమైన సంఘటన జరిగింది. సైన్యాన్ని, దేశాన్ని కించపరిచే పోస్ట్ పెట్టడంతో మతపరమైన సంఘటన జరిగింది.
ఫిబ్రవరి 2020 లో హిందూ ప్రాబల్యమైన భావ్ సర్వాడ్ లో ఒక దొంగతనం జరిగిన తరువాత హిందూ జాగరణ్ మంచ్ ఒక ర్యాలీని తీసి ముస్లింలను పట్టణం నుంచి తరిమి కొట్టాలని డిమాండ్ చేసింది. ఈ ర్యాలీ తరువాత ఖంభట్ లో అల్లర్లు జరిగాయి. ఇందులో 13 మంది ముస్లింలు గాయపడ్డారు. 30 కి పైగా దుకాణాలు లూటీకి గురయ్యారు.
హిందూ మూక రెచ్చగొడుతోంది..
ఆ అల్లరి మూకలను అణచివేయడానికి పోలీసులకు, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కి దాదాపు రెండుగంటలు పట్టింది. 2022 లో జరిగిన మరో సంఘటనలో ఖంబాట్ లో రామనవమి సందర్భంగా జరిగిన హింసలో ఒక హిందూ వ్యక్తి గాయపడి మరణించాడు.
తరువాత ఆ వ్యక్తి దేహాన్ని పోలీసులు విశ్వహిందూ పరిషత్ కు అప్పగించగా వారు ముస్లిం ప్రాబల్యం ఉన్న ప్రాంతాల గుండా ఊరేగించారు. దీనితో మత అల్లర్లు చెలరేగాయి. ‘‘వారు షక్కర్ పురా గ్రామంలోని ఒక మసీదు ముందు గంటకు పైగా ఆగిపోయారు. ’’ అని ఖంటాబ్ నివాసి జనిసర్ షేక్ ఫెడరల్ తో అన్నారు.
కాంగ్రెస్ కేంద్రాల్లో అల్లర్లు..
అదే రోజు ఖంభట్ నుంచి 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న హిమ్మత్ నగర్ లో అల్లర్లు చెలరేగాయి. ఈ హింసలో అనేక మంది పోలీసులు గాయపడ్డారు. ఒక మసీదు తగలబడింది.
అదే వారంలో సౌరాష్ట్ర ప్రాంతంలో గిర్ సోమనాథ్ లోని వెరావాల్ లోనూ అల్లర్లు జరిగాయి. 2017 నుంచి జరిగిన అల్లర్లన్నీ కూడా కాంగ్రెస్ గెలుస్తున్న నియోజకవర్గాలే కావడం గమనార్హం.
అదే నమూనా
1962 నుంచి గిర్ సోమనాథ్ కాంగ్రెస్ కు బలమైన మద్దతును అందిస్తోంది. 2017 లో కాంగ్రెస్ కు చెందిన విమల్ భాయ్ చుడాస్మా ఈ స్థానాన్ని 20 వేల ఓట్ల తేడాతో గెలుచుకున్నారు. అయితే ఐదు సంవత్సరాల తరువాత పరిస్థితి మారింది. కాంగ్రెస్ ఆధిక్యం ప్రదర్శించిన చాలా చోట్ల బీజేపీ జెండా పాతింది.
‘‘గుజరాత్ లో మత అల్లర్లలో ఒక నమూనా ఉంది. 2002 నాటి అలర్లు జరగని ప్రాంతాల్లోనే కాకుండా కాంగ్రెస్ కు మద్దతుగా నిలిచిన ప్రాంతాల్లోనే అల్లర్లు జరిగాయి. 2017 లో బీజేపీకి స్థానాలు తగ్గిన తరువాత ఈ అల్లర్లు పెరిగాయి. ’’ అని అహ్మాదాబాద్ కు చెందిన రాజకీయ విశ్లేషకుడు గౌరాంగ్ దేశాయ్ ‘ది ఫెడరల్’ తో అన్నారు.
కానీ 2022 లో బీజేపీ 152 సీట్లతో అఖండ విజయం సాధించిన తరువాత రాష్ట్రంలో మరోసారి అల్లర్లు జరగలేదని ఆయన చెప్పారు.
‘‘2001 లో గ్రామ పంచాయతీ ఎన్నికలు, మూడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత బీజేపీ కుదుపులకు గురైంది. అప్పటి ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ స్థానంలో నరేంద్ర మోదీని నియమించాలని పార్టీ నిర్ణయించింది.
అయితే అప్పటికీ మోదీ ప్రజాదరణ పొందిన నాయకుడిగా లేడు. 2002 ఫిబ్రవరిలో గుజరాత్ అల్లర్లు జరిగిన సమయంలో ఏప్రిల్ లో జరగాల్సిన ఎన్నికలు డిసెంబర్ లో జరిగాయి. బీజేపీ ఘన విజయాన్ని నమోదు చేసింది’’ అని దేశాయ్ అన్నారు.


Tags:    

Similar News