గుజరాత్: కుప్పకూలిన మహిసాగర్ నదీ వంతెన

నదిలో పడిపోయిన రెండు ట్రక్కుల, పికప్ వ్యాన్, ఓ బైక్.. ముగ్గురు మృతి;

Update: 2025-07-09 08:31 GMT

గుజరాత్ లోని మహిసాగర్ నదిపై నిర్మించిన గంభీర వంతెన కుప్పకూలిపోయింది. ఆనంద్- వడోదర నగరాలను కలిపే ఈ వంతెన కూలిపోవడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు.

వంతెన కూలిపోవడంతో దానిపై ప్రయాణిస్తున్న అనేక వాహనాలు నీటిలో పడిపోయాయని నివేదికలు తెలిపాయి. కొన్ని నివేదికలు మాత్రం ముగ్గురు వ్యక్తులు మరణించినట్లు వెల్లడించాయి. అయితే ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

నలుగురు..
ఇప్పటి వరకూ నలుగురిని రక్షించామని, ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని పద్రా పోలీస్ ఇన్ స్పెక్టర్ విజయ్ చరణ్ జాతీయ మీడియాకు తెలిపారు.
ఈ సంఘటన ఉదయం 7.30 నిమిషాలకు పద్రా తాలుకాలోని ముజ్ పూర్ గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఇది ప్రధాన గుజరాత్- సౌరాష్ట్ర మధ్య కీలకమైన లింక్.
‘‘మహిసాగర్ నదిపై ఉన్నగంభీర వంతెనలో ఒక భాగం ఉదయం 7.30 నిమిషాలకు కూలిపోవడంతో నాలుగు వాహనాలు నదిలో పడిపోయాయి. రెండు ట్రక్కులు, రెండు వ్యాన్లు సహా వాహనాలు నదిలో పడిపోయాయి. ఇప్పటి వరకూ నలుగురిని రక్షించాము’’ అని చరణ్ చెప్పారు.
స్థానిక నివేదికల ప్రకారం.. వంతెన కూలిపోయిన తరువాత రెండు ట్రక్కులు, ఒక పికప్ వ్యాన్, ఒక మోటార్ బైక్ నదిలో పడిపోయాయి. అగ్నిమాపక దళం బృందాలు, అత్యవసర సేవలతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వాహానాలను వెలికితీసి, వాటిలో చిక్కుకున్న వారిని రక్షించడంపై ప్రయత్నాలు చేస్తున్నాయి.
స్థానిక యంత్రాంగం సంఘటనా స్థలంలో ఉన్నప్పటికీ, కూలిపోవడానికి గల కారణాలను అధికారులు పరిశీలిస్తున్నారు. వర్షాకాలంలో భారీగా గుంతలు ఏర్పడటంతో వంతెన బలహీనంగా మారిందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. తాత్కాలిక మరమ్మతులతో దీనిని పరిష్కరించినట్లు సమాచారం. అయితే కూలిపోవడానికి కచ్చితమైన కారణం ఇంకా తెలియరాలేదు.
కీలకమైన మౌలిక సదుపాయాల నిర్మాణం..
వంతెన కీలకమైన మౌలిక సదుపాయాల నిర్మాణం. ఇది ఆనంద్- వడోదర మధ్య వస్తువులు, ప్రయాణీకులు వెళ్లిరావడానికి ఉపయోగపడుతుంది.. ఈ వంతెన కూలిపోవడం వల్ల ప్రాణనష్టం జరగడమే కాకుండా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శిథిలాలను తొలగించి సాధారణ స్థితిని పునరుద్దరించడానికి అధికారులు కృషి చేస్తున్నారు.
గుజరాత్ లో ఇంతకుముందు మోర్బీ వంతెన కూలిపోవడంతో పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. ఇప్పుడు తాజాగా మరో వంతెన కూలిపోయింది. అలాగే బీహార్ లో కూడా గత ఏడాది వరుసగా దాదాపుగా ఇరవై వంతెనలు కూలిపోయాయి.


Tags:    

Similar News