నీతి ఆయోగ్ సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ సీఎం మమత వాకౌట్..

తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా మొదటి నుంచి బీజేపీని విభేదిస్తున్నారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపును కూడా తప్పుబట్టారు.

Update: 2024-07-27 11:10 GMT

ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్ సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శనివారం బయటకు వచ్చేశారు. తనకు మాట్లాడేందుకు తగిన సమయం కేటాయించలేదని ఆగ్రహంతో సమావేశం నుంచి వాకౌట్ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మోడీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మాట్లాడటానికి 20 నిమిషాల సమయం ఇచ్చారని, బీజేపీ పాలిత అసోం, గోవా, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రులు ఒక్కొక్కరికి 10 నుంచి 12 నిమిషాలు ఇచ్చారని మమత పేర్కొన్నారు. అయితే తనకు 5 నిముషాలు కూడా కేటాయించలేదని మండిపడ్డారు.

తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమతా మొదటి నుంచి బీజేపీని విభేదిస్తున్నారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ కేటాయింపును కూడా తప్పుబట్టారు. నిధుల కేటాయింపులో పక్షపాతంగా వ్యవహరించాలని విమర్శించారు. తమ ప్రభుత్వాన్ని కాపాడే ఏపీ, బీహార్ రాష్ట్రాలకు అధిక నిధులు కేటాయించారని ఆరోపించారు.

‘‘ప్రవేశ పెట్టిన బడ్జెట్ పక్షపాతపూరితంగా ఉంది. ఇతర రాష్ట్రాలపై ఎందుకు వివక్ష చూపుతున్నారు? “నీతి ఆయోగ్‌కు ఆర్థిక అధికారాలు లేవు. మరి అది ఎలా పని చేస్తుంది? దానికి ఆర్థిక అధికారాలు ఇవ్వండి లేదంటే.. ప్లానింగ్ కమిషన్‌ను తిరిగి తీసుకురండి” అని మమత అన్నారు. 

Tags:    

Similar News