‘నేను దేశం వీడడం వెనక యూఎస్ కుట్ర దాగి ఉంది’

తన దేశంలో పాలన మార్పునకు దారితీసిన ఘటనల వెనుక అమెరికా పాత్ర ఉందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అనుమానం వ్యక్తం చేశారు.

Update: 2024-08-11 11:17 GMT

తన దేశంలో పాలన మార్పునకు దారితీసిన ఘటనల వెనుక అమెరికా పాత్ర ఉందని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా అనుమానం వ్యక్తం చేశారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆమె ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి బంగ్లాదేశ్‌ను వీడి భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్ నుంచి నిష్క్రమించిన తర్వాత షేక్ హసీనా మొదటిసారి మీడియాతో మాట్లాడారు.

"సెయింట్ మార్టిన్ ద్వీపం సార్వభౌమత్వానికి లొంగి, బంగాళాఖాతంపై అమెరికాను పట్టు సాధించడానికి అనుమతించినట్లయితే నేను అధికారంలో ఉండేదాన్ని" అని చెప్పారు.

అవామీ లీగ్ తిరిగి పుంజుకుంటుంది

నిరసన తెలుపుతున్న విద్యార్థులను రజాకార్లు అని నేను ఎక్కడ పేర్కొనలేదని, తన మాటలను వక్రీకరించారని షేక్ హసీనా స్పష్టం చేశారు. త్వరలో తాను బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని, అవామీ లీగ్ తిరిగి పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ('రజాకార్లు' అనే పదాన్ని తరచుగా 1971 లిబరేషన్ వార్ సమయంలో పాకిస్తానీ మిలిటరీకి సహకరించినట్లు భావించే వ్యక్తులకు వాడే పదం)

బంగ్లాదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన వ్యక్తం చేయడంతో షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి పారిపోవాల్సి వచ్చింది. ఆందోళనకారులను అణిచివేసే క్రమంలో 400 మంది నిరసనకారులు మరణించారు. 

Tags:    

Similar News