హత్రాస్ తొక్కిసలాట వెనక కుట్ర?

హత్రాస్ తొక్కిసలాట ఘటన వెనక కుట్ర దాగి ఉందని, అందుకు తమ వద్ద ఆధారాలు కూడా ఉన్నాయని స్వయం ప్రకటతి భోలేబాబా తరపు న్యాయవాది ఏపీ సింగ్ తెలిపారు

Update: 2024-07-07 12:06 GMT

హత్రాస్ తొక్కిసలాట ఘటన వెనక కుట్ర దాగి ఉందని స్వయం ప్రకటతి భోలేబాబా తరపు న్యాయవాది ఏపీ సింగ్ అని పేర్కొన్నారు. ఢిల్లీలో ఆయన విలేఖరులతో మాట్లాడారు. బాబాకు పెరుగుతున్న ఆదరణను సహించలేకే.. కొందరు ఈ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. కొంతమంది చేతుల్లో డబ్బాలను గమనించామని సత్సంగ్ కు వచ్చిన భక్తులు చెప్పారని పేర్కొన్నారు. మృతుల పోస్టుమార్టం రిపోర్టులో కూడా గాయాలతో చనిపోలేదని, ఊపిరి ఆడక ప్రాణాలొదిగారని రాసి ఉందన్నారు. కుట్రకు పాల్పడ్డ వారు తప్పించుకుని వెళ్లేందుకు వీలుగా కొన్ని వాహనాలను సత్సంగ్ వేదిక సమీపంలో ఉంచారని, అందుకు ఆధారాలు తమవద్ద ఉన్నాయన్నారు.

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం హత్రాస్‌ జిల్లాగా స్వయం ప్రకటిత బాబాగా ప్రకటించుకున్న సూరజ్‌పాల్ అలియాస్ నారాయణ్ సకర్ హరి నిర్వహించిన 'సత్సంగం'లో తొక్కిసలాట జరిగి 121 మంది మరణించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనకు సంబంధించి కీలక నిందితుడు దేవప్రకాష్ మధుకర్ సహా తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వాస్తవానికి సత్సంగ్‌లో 80వేల మంది మాత్రమే పాల్గొనేందుకు అనుమతి ఇవ్వగా.. 2.5 లక్షల మంది భక్తులు హాజరయ్యారు. సికిందరావు పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌లో బాబా పేరును ఇంకా చేర్చలేదు. ఈ ఘటనపై విచారణకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం జ్యుడీషియల్ కమిషన్ ఆదేశించిన విషయం తెలిసిందే. కమిషన్ ముందు కూడా భోలే బాబా హాజరవుతారని ఏపీ సింగ్ తెలిపారు.

సాక్షులు తమ వాంగ్మూలాన్ని ఇచ్చేందుకు కమిషన్ త్వరలో పబ్లిక్ నోటీసును కూడా జారీ చేయనుందని, అలహాబాద్ హైకోర్టు రిటైర్డ్ జడ్జి బ్రిజేష్ కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. 

Tags:    

Similar News