‘నిరుద్యోగ సమస్యను పూర్తిగా నిర్లక్ష్యం చేశారు’

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. హర్యానాతో సహా దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు.

Update: 2024-09-24 11:16 GMT

లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ బీజేపీపై విరుచుకుపడ్డారు. హర్యానాతో సహా దేశంలోని యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంలో కేంద్రం ఘోరంగా విఫలమైందని ఆరోపించారు. ఉద్యోగాలు లేక హర్యానా యువత విదేశాల బాట పట్టిందని, అక్కడ వారికి సరైన తిండి, నివాసం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను అమెరికా పర్యటనకు వెళ్లిన సమయంలో తమ సమస్యలు చెప్పుకొని బాధ పడ్డారని చెప్పారు. హర్యానా నుంచి విదేశాలకు వెళ్లిన వారు అక్కడ ఎదుర్కొంటున్న ఇబ్బందులను పేర్కొంటూ వారు మాట్లాడిన వీడియోను రాహుల్ షేర్‌ చేశారు.

వీడియోను షేర్‌ చేస్తూ ‘హర్యానా ప్రజలు ‘డంకీ’లుగా ఎందుకు మారుతున్నారు?’ అంటూ రాహుల్ ప్రశ్నించారు. ఉద్యోగావకాశాలు లేకపోవడంతో ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలి వెళ్లేవారిని ‘డంకీ’లుగా పిలుస్తారు. బీజేపీ తప్పులకు యువత తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ శిక్ష అనుభవిస్తున్నారని, ఫలితంగా వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చూసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయిందని అన్నారు. హరియాణాలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే ఇక్కడే ఉద్యోగావకాశాలు కల్పించడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.

అక్టోబరు 5న హర్యానాలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ నుంచి అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. రైతుల సమస్యలు, నిరుద్యోగాన్ని అస్త్రాలుగా చేసుకొని పెద్ద ఎత్తున ఎన్నికల ప్రచారాలు నిర్వహిస్తోంది.

Tags:    

Similar News