SIR వెనుక లక్ష్యం అదే: మమతా బెనర్జీ

‘‘లౌకికవాదం ప్రమాదంలో పడినపుడు, సమాఖ్యవాదం అణచివేతకు గురయినపుడు రాజ్యాంగ పరిరక్షణ అత్యవసరం’’ - పశ్చిమ బెంగాల్ సీఎం

Update: 2025-11-26 12:14 GMT
Click the Play button to listen to article

జాతీయ పౌర రిజిస్టర్ (NRC) కోసమే ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ చేపడుతున్నారని పశ్చిమ బెంగాల్(West Bengal) ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee) ఆరోపించారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కోల్‌కతాలోని రెడ్ రోడ్‌లోని బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ..స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత ప్రజల పౌరసత్వం గురించి ప్రశ్నించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘‘లౌకికవాదం ప్రమాదంలో పడినపుడు, సమాఖ్యవాదం అణచివేతకు గురయినపుడు రాజ్యాంగ పరిరక్షణ అత్యవసరం’’ మమతా సామాజిక మాధ్యమంలో ఎక్స్‌లో పోస్టు చేశారు. విభిన్న సంస్కృతులు, భాషలు, సమాజ వైవిధ్యాన్ని కలిగి ఉండే భారత రాజ్యాంగం దేశానికి వెనెముక అని పేర్కొన్నారు.

నవంబర్ 26, 1949న రాజ్యాంగ సభ భారత రాజ్యాంగాన్ని అధికారికంగా స్వీకరించిన రోజు. భారత ప్రభుత్వం 2015లో నవంబర్ 26ని రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

Tags:    

Similar News