తప్పు చేసిన కాంట్రాక్టర్లను గుర్తించండి
పాత్ హోల్ ఫ్రీ రహాదారులే ప్రాధాన్యత ఇవ్వాలని రహదారులు, భవనాల శాఖ పై సమీక్షలో సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
రోడ్ల నిర్మాణాలలో తప్పు చేసిన, నాణ్యతలో రాజీపడిన కాంట్రాక్టర్లను కాంట్రాక్టర్లను గుర్తించాలి అని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ లాజిస్టిక్స్ అండ్ ఇన్ఫ్రాస్టక్చర్ కార్పోరేషన్ – ఏపీ లింక్ సంస్థను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా పని చేయాలని ఆదేశించారు. రాష్ట్రంలోని రహదారులను గుంతలు లేకుండా తీర్చిదిద్దడమే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యతా అంశమని సీఎం స్పష్టం చేశారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఆర్ అండ్ బి శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ...”ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేయబోతున్న ఏపీ-లింక్ సంస్థ ద్వారా పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. ఇప్పటి నుంచే దీనిపై ప్రణాళికలు రూపోందించాలి. లాజిస్టిక్స్ కార్పోరేషన్ ను బలోపేతం చేసే క్రమంలో రహదారులు భవనాల శాఖకు వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయాలను ఎంత వరకు వినియోగించుకోవచ్చో చూడాలి. లాజిస్టిక్స్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తే సంస్థ ఆర్థికంగా బలోపేతం చేయడానికి మార్గం సుగమం అవుతుంది. అప్పుడు రాష్ట్రంలోని రహదారుల నెట్ వర్క్ తో పాటు ఇతర మౌలిక సదుపాయాలను అద్భుతంగా తీర్చిదిద్దవచ్చు.”అని సీఎం చెప్పారు.
నాణ్యత ఇంజనీర్ల జవాబుదారీతనం