TPCC సోషల్ మీడియా టీమ్ కి బిగ్ రిలీఫ్

సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో టీపీసీసీ సోషల్ మీడియా టీమ్ కి బిగ్ రిలీఫ్ వచ్చింది.

By :  Vanaja
Update: 2024-05-03 11:51 GMT

సెంట్రల్ హోమ్ మినిస్టర్ అమిత్ షా డీప్ ఫేక్ వీడియో కేసులో ఐదుగురు నిందితులకు బెయిల్ లభించింది. ఈ కేసులో టీపీసీసీ సోషల్ మీడియా టీమ్ సభ్యులు మన్నే సతీష్, పెండ్యాల వంశీకృష్ణ, నవీన్, ఆస్మా తస్లీమా, గీతాలను హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ ఐదుగురు నిందితులను పోలీసు అధికారులు శుక్రవారం నాంపల్లి హైకోర్టులో హాజరుపరిచారు.

న్యాయస్థానం ఐదుగురికి కండీషనల్ బెయిల్ మంజూరు చేసింది. పదివేల పూచీకత్తు చెల్లించాలని చెప్పింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు నిందితులు ప్రతి సోమ, శుక్రవారాలు కేసు ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్స్ ముందు హాజరు కావాలని ఆదేశాలిచ్చింది.

కాగా, అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా ఢిల్లీ పోలీసులు నాలుగైదు రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేశారు. తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్ ఇళ్లపై నిఘా ఉంచారు. రెండురోజుల క్రితం కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్ గీత మొబైల్ ఫోన్ ని కూడా ఢిల్లీ పోలీసులు సికింద్రాబాద్ లో స్వాధీనం చేసుకున్నారు.

ప్రస్తుతం హైదరాబాద్ పోలీసుల అదుపులో ఉన్న ఐదుగురి నిందితులని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు వీరిని గురువారం రాత్రంతా విచారించారు. ఫేక్ వీడియోకి సంబంధించిన హార్డ్ డిస్కులు, పెన్ డ్రైవ్ ను అధికారులు సీజ్ చేశారు.

Tags:    

Similar News