పోక్సో కేసులో 60 ఏళ్ల వృద్ధుడికి శిక్ష

రెండు సంవత్సరాల న్యాయపోరాటంలో బాధితురాలికి న్యాయం.;

By :  Admin
Update: 2025-09-16 07:00 GMT

పోక్సో న్యాయస్థానాలు తీర్పులు వెలువరించే విషయంలో ఏమాత్రం వెనకాడటం లేదు. బాధితులకు న్యాయం అందించడమే లక్ష్యంగా దూసుకెళ్తున్నాయి. దోషిగా తేలిన మరుక్షణం కఠిన శిక్షలు విధిస్తూ సమాజానికి తమ తీర్పులు ఉదాహరణగా మారేలా చర్యలు తీసుకుంటున్నాయి. నల్లగొండ జిల్లా పోక్సో కోర్టు తాజాగా ఓ కేసులో వెలువరించిన తీర్పు ఇందుకు నిదర్శనం. సోమవారం ఓ పోక్సో కేసులో దోషికి 21 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ పోక్సో కోర్టు ఇన్‌ఛార్జ్‌ జడ్జి రోజా రమణి తీర్పు వెలువరించారు. ఇందులో దోషి 60 ఏళ్ల వృద్ధుడు. అతనికి 24 సంవత్సరాల జైలు శిక్ష, రూ.40 వేల జరిమానా విధిస్తున్నట్లు న్యాయస్థానం తన తీర్పులో స్పష్టం చేసింది.

మార్చి 2023లో అన్నెపర్రి గ్రామంలో ఘోరం జరిగింది. 4వ తరగతి చదువుతున్న పదేళ్ల చిన్నారిపై 60 ఏళ్ల మర్రి ఊషయ్య అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ విషయం తెలుసుకున్న చిన్నారి కుటుంబం పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఊషయ్యను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. అప్పటి నుంచి ఈ కేసు వాదనలు జరుగుతున్నాయి. తాజాగా విచారణ ముగిసింది. ఊషయ్యను దోషిగా కోర్టు నిర్ధారించింది. అతనికి 24 ఏళ్ల జైలు, రూ.40 వేల జరిమానా విధించింది. కోర్టు తీర్పుపై బాధిత కుటుంబం హర్షం వ్యక్తం చేసింది.

Tags:    

Similar News