ఏటీఎంల వద్ద డిపాజిటర్లకు బురిడీ, కొత్త రకం మోసం

హైదరాబాద్‌లో ఏటీఎంల వద్ద డబ్బు డిపాజిట్ చేసే బ్యాంకు ఖాతాదారులను బురిడీ కొట్టించి డబ్బు స్వాహా చేసిన బాగోతం వెలుగుచూసింది. నిందితుడు కొత్తరకం మోసాలకి తెర లేపాడు

Update: 2024-10-19 13:55 GMT

హైదరాబాద్ వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్, మధురానగర్ పోలీసులు ఒక అంతర్ రాష్ట్ర అటెన్షన్ డైవర్షన్ కు అలవాటైన నేరస్థుడిని పట్టుకున్నారు. నిందితుడి నుంచి 5,16,000 లక్షల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు.

- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రాజోల్ మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన ఇంటిపల్లి రామారావు బీటెక్ చదివి గతంలో గ్రాఫిక్ డిజైనరుగా ఉద్యోగం చేశాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌కు అలవాటు పడి డబ్బు కోసం నేరాలకు పాల్పడటం ప్రారంభించాడు.
- నిందితుడు రామారావుపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో 55 కేసులున్నాయి. ప్రస్తుతం 19 నేరాలకు పాల్పడినట్లు అంగీకరించాడు. వాటిలో 9 హైదరాబాద్ సిటీలో నమోదయ్యాయి.

కొత్త తరహా మోసాలు
రామారావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నగదు డిపాజిట్ ఏటీఎం కేంద్రాలను లక్ష్యంగా చేసుకొని మోసాలకు తెర లేపారు. నిందితుడు రామారావు నగదు జమ చేసేందుకు వచ్చే వారి కోసం ఈ కేంద్రాల వద్ద వేచి ఉండి, తన ఏటీఎం కార్డు ద్వారా డబ్బు విత్‌డ్రా చేసేందుకు నిరాకరించిందని, తనకు అత్యవసరంగా నగదు అవసరమని పేర్కొంటూ వారిని సంప్రదించాడు. తాను నెఫ్ట్ లేదా ఐఎంపీఎస్ ద్వారా వారి ఖాతాకు డబ్బు బదిలీ చేస్తానని చెప్పి వారి వద్ద డబ్బు తీసుకుంటాడు. తన ఖాతా నుంచి డబ్బును పంపించినట్లు ఎస్ఎంఎస్ చూపించి నగదు తీసుకొని పరారవుతాడు.
రామారావు అనే నిందితుడి నుంచి రూ.5.16 లక్షల డబ్బుతోపాటు సెల్ ఫోన్ ను స్వాధీనం చేసుకొని నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొత్త తరహా మోసాలు నగరంలో జరుగుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని టాస్క్ ఫోర్స్ డీసీపీ హెచ్చరించారు.


Tags:    

Similar News