మరోసారి శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడిగా బాదల్..

గతేడాది పదవికి రాజీనామా..పార్టీ సభ్యుల ఆమోదంతో మరోసారి..;

Update: 2025-04-12 12:29 GMT

శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడిగా సుఖ్‌బీర్ బాదల్ ( Sukhbir Badal) మళ్లీ ఎన్నికయ్యారు. శనివారం పంజాబ్ (Punjab) రాష్ట్రం అమృత్‌సర్‌లోని జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయనను ఎన్నుకున్నారు. బాదల్ పేరును పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ బల్వీందర్ సింగ్ భుందార్ ప్రతిపాదించగా.. పార్టీ నాయకుడు పరమ్‌జిత్ సింగ్ సర్నా బలపరిచారు.

శ్రీ దర్బార్ సాహిబ్ కాంప్లెక్స్‌లోని తేజా సింగ్ సముందారి హాల్‌లో శిరోమణి అకాలీదళ్ (Shiromani Akali Dal) కొత్త అధ్యక్షుడి ఎన్నికకోసం ఏర్పాటుచేసిన సమావేశానికి బాదల్ భార్య, బటిండా ఎంపీ హర్సిమ్రత్ కౌర్ బాదల్, మాజీ మంత్రులు బిక్రమ్ సింగ్ మజితియా, దల్జిత్ సింగ్ చీమా, సీనియర్ నాయకుడు మహేష్ ఇందర్ సింగ్ గ్రేవాల్ సహా పలువురు సీనియర్ పార్టీ నాయకులు హాజరయ్యారు.

దోషిగా పేర్కొనడంతో రాజీనామా..

2007 నుంచి 2017 వరకు శిరోమణి అకాలీదళ్ ప్రభుత్వం చేసిన "తప్పులకు" 'తంఖయ్య' (మతపరమైన దుష్ప్రవర్తనకు దోషి)గా ప్రకటించిన తర్వాత.. నవంబర్ 16, 2024న బాదల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. జనవరిలో ఆయన రాజీనామాను పార్టీ వర్కింగ్ కమిటీ ఆమోదించింది. తరువాత పార్టీ కొత్త సభ్యత్వ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 

Tags:    

Similar News