‘TVK విజయ్ జనసమూహాన్ని పార్టీగా మార్చలేడు’

AIADMK ఇచ్చిన అవకాశాన్ని మిస్ చేసుకున్నాడన్న ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త ఎస్ గురుమూర్తి..;

Update: 2025-09-13 14:10 GMT
Click the Play button to listen to article

ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త, తమిళ రాజకీయ వారపత్రిక ‘తుగ్లక్’ సంపాదకుడు ఎస్ గురుమూర్తి(S Gurumurthy) ‘ది ఫెడరల్‌’‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పారు. తమిళనాడు(Tamil Nadu)లో డీఎంకే(DMK), ఏఐఏడీఎంకే(AIADMK), బీజేపీ(BJP)లో చోటుచేసుకుంటున్న రాజకీయ పరిణామాలు, రాజకీయ రంగ ప్రవేశం చేసిన వర్థమాన నటుడు విజయ్ గురించి మాట్లాడారు. అలాగే మోదీ పదవీ విరమణ, నేపాల్‌లో లాగా భారతదేశంలో నిరసనలు వెల్లువెత్తే అవకాశం లేకపోవడానికి గల కారణాలను ఆయన వివరించారు.

తొలుత బంగ్లాదేశ్‌లో ఆందోళనకర పరిస్థితులపై మాట్లాడుతూ..

‘‘తూర్పు పాకిస్తాన్ నుంచి విడిపోయిన బంగ్లాదేశ్‌ 1971లో హింస ద్వారా ఏర్పడింది. అదే హింస మళ్లీ బంగ్లాలో పునరావృతమైంది. ప్రజాదరణ పొందిన నాయకుడిగా పేరున్న ముజిబుర్ రెహమాన్ తనను ముట్టడిస్తున్నారని భావించి నియంతగా మారిపోయాడు. ఒక దేశాన్ని ప్రజాస్వామ్యబద్దంగా నడిపించడానికి పరిణతి చెందిన నాయకత్వం చాలా ముఖ్యం. పాకిస్తాన్‌లో లేదా బంగ్లాదేశ్‌లో అది జరగలేదు. చారిత్రాత్మక దేశం నేపాల్‌లో ప్రస్తుత పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. నిజానికి ఒకానొక సమయంలో నేపాల్ భారత్‌లో భాగం కావాలని కోరుకుంది. అలాగే శ్రీలంక కూడా. కానీ భారతదేశం ఎదుర్కొన్న సవాళ్ల దృష్ట్యా.. జవహర్‌లాల్ నెహ్రూ అదనపు భౌగోళికాలు, జనాభాను తీసుకోకూడదని నిర్ణయించుకున్నారు.

రాచరికం దారితప్పినప్పుడు నేపాల్‌లోకి చైనా ప్రవేశించింది.. మొదటి అస్థిరతకు బీజం పడింది అక్కడే. అప్పటి నుంచి నేపాల్ పూర్తిగా కోలుకోలేదు. ఈ మూడు దేశాలు ప్రజాస్వామ్యానికి తగినంత పరిణత సాధించలేదని చెబుతాయి.’’ అని పేర్కొన్నారు.

ప్రశ్న: భారతదేశం ఇప్పుడు నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. త్వరలో మూడోది కాబోతుంది. కానీ నిరుద్యోగం, తయారీ.. ఆ వృద్ధిని పూర్తిగా ప్రతిబింబించడం లేదు. పన్ను కోతలు, ప్రోత్సాహకాలు, సంస్కరణలు ఉన్నా.. ఆశించిన మార్పులు కార్యరూపం దాల్చలేదు. మీరు దీన్ని ఎలా చూస్తారు?

జవాబు: ఇది నేను లోతుగా అధ్యయనం చేసి రాసిన విషయం. దాంట్లో కొన్ని ప్రభుత్వ విధానాలకు ప్రయోజనం చేకూర్చాయి. భారత్ ఎల్లప్పుడూ వ్యవస్థాపక ఆర్థిక వ్యవస్థగా ఉంది. అది అలానే విజయం సాధిస్తుంది. ఇది సహజంగానే స్వయం ఉపాధి ఆర్థిక వ్యవస్థ.

నేను IITలో బోధిస్తున్నప్పుడు దీన్ని ప్రత్యక్షంగా చూశాను. ఉద్యోగాల కోసమే చదువుతున్నారా? లేదా ఉపాధి కల్పించేందుకు చదువుతున్నారా? అని నేను విద్యార్థులను అడిగేవాడిని. అసలు నిరుద్యోగ సమస్య అనేది మార్కెట్లో డిమాండ్ లేని కోర్సులు చేయడం వల్లే ఉత్పన్నమవుతుంది.

ప్రశ్న: ముఖ్యంగా కొంతమంది అన్నాడీఎంకే పార్టీ నాయకులు పార్టీని వీడటం, మరికొందరు చర్చలు జరపడం, బీజేపీతో పొత్తు పెట్టుకోవడాన్ని మీరెలా చూస్తారు?

జవాబు: ఈ రోజున్న పరిస్థితి ఎన్నికలకు ముందు ఉండకపోవచ్చు. చాలా పార్టీలు ఎంత ఒత్తిడిలో ఉన్నాయంటే.. 8 నెలల ముందుగానే ప్రచారం ప్రారంభించాయి. ఇప్పుడు ఏం చెప్పినా రెండు నెలల్లో మర్చిపోతారని నేను తుగ్లక్‌లో కూడా రాశాను.

తమిళనాడులో బీజేపీ ఒక ఫాక్టర్‌గా మారిందన్నది వాస్తవం. అంతకుముందు ఈ పరిస్థితి లేదు. 2011లో తన ఆందోళనకు ముందు అరవింద్ కేజ్రీవాల్ నన్ను కలిశారు. ఆ సందర్భం నాకు ఇంకా గుర్తుంది. 1989 ఎన్నికలకు ముందు ‘ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ బోఫోర్స్ సమస్యను మూడేళ్లు ఎలా సజీవంగా ఉంచిందని కేజ్రీవాల్ నన్ను అడిగారు. పార్లమెంటు లోపల, బయట వీధుల్లో పోరాటం చేయడం, మీడియా సహకారంతో సాధ్యమయ్యిందని చెప్పాను. కాని ప్రస్తుతం టెలివిజన్ మీడియా ఏ సమస్యనయినా నెల రోజులకు మించి చూపడం లేదు. కాబట్టి 2026 ఎన్నికల వరకు ప్రస్తుత పరిస్థితి ఇలాగే ఉంటుందని చెప్పడానికి వీల్లేదు.

నా అభిప్రాయం ప్రకారం..ఈ ఎన్నికలు DMK, ప్రతిపక్ష కూటమికి మధ్య ప్రధాన పోటీ ఉంటుంది. DMKకి వ్యతిరేకంగా ఇప్పటికే వ్యతిరేక వర్గం ఏర్పడుతోంది. దాన్ని ఎదుర్కోవడానికి ఆ పార్టీకి మేధో బలం లేదు. డబ్బు 2-3 శాతం ఓట్లను ప్రభావితం చేయవచ్చు. 20 శాతం ఓట్లను కాదు.

ప్రశ్న: తమిళనాడు రాజకీయాల్లోకి నటుడు విజయ్ ప్రవేశం గురించి మీరు ఏమనుకుంటున్నారు? గతంలో రజనీకాంత్‌ను తీసుకురావడానికి బలమైన ఒత్తిడి ఉండేది. కానీ అది వివిధ కారణాల వల్ల పని చేయలేదు. అయితే నటుడు విజయ్‌కు చాలా బలమైన ప్రజాదరణ ఉంది. ఆయన రాజకీయాల్లో రాణిస్తారని భావిస్తున్నారా?

జవాబు: ఎంజీఆర్ రాజకీయ రంగంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి నేను తమిళ రాజకీయాలను నిశితంగా గమనిస్తున్నాను. ఎంజీఆర్ ప్రవేశం వ్యక్తిగత చర్య కాదు. డీఎంకేలోని ఎంజీఆర్ రసికర్ మన్రామ్‌లకు 45-50 మంది ఎమ్మెల్యేలు, 4-5 మంది మంత్రులు, 10-12 మంది ఎంపీలు ఉన్నారు. పార్టీలోని ఒక పార్టీగా ఒక నిర్మాణం, జిల్లా కార్యదర్శులు ఉన్నారు. డీఎంకే ప్రభావవంతంగా రెండుగా విడిపోయింది. ఎంజీఆర్ అసమానుడు కాబట్టి ఆయన ఉదాహరణ ప్రత్యేకమైనది మరియు అనుకరించదగినది కాదు.

ఇలాగే ప్రయత్నించిన మరో వ్యక్తి విజయకాంత్. మైలాంలో తన జనసమూహం వెళుతుండగా ఎనిమిది గంటలు వేచి ఉండటం నాకు ఇప్పటికీ గుర్తుంది. రజనీకాంత్ విషయానికొస్తే.. ఆయన రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నాను. నేను కూడా ఆయనకు మద్దతు ఇచ్చాను. కానీ జనసమూహాన్ని నిర్మాణాత్మక పార్టీగా మార్చడం అంత తేలికైన పని కాదు. పార్టీ ఏర్పాటు చేయడానికి ఐదుగురు నమ్మకమైన వ్యక్తులు ఉన్నారా? అని నేను రజనీ, కమల్ హాసన్‌లను అడిగాను. రజనీకి ముగ్గురు ఉన్నారు. కమల్ ఎవరూ లేరు. విశ్వసనీయ వ్యక్తులు లేకుండా.. పార్టీ ఏర్పాటు చేయడం అసాధ్యం. చివరికి, రజనీకాంత్ తన జనసమూహాన్ని పార్టీగా మార్చలేకపోయాడు.

విజయ్ జనసమూహాన్ని పార్టీగా మార్చడానికి ప్రయత్నిస్తున్నాడు. జనసమీకరణ బాగానే ఉన్నా రాజకీయ విజయానికి హామీ ఇవ్వదు. అన్నాడీఎంకే ఇప్పటికే బీజేపీతో జతకట్టింది. AIADMKతో పొత్తు పెట్టుకునే అవకాశాన్ని విజయ్ కోల్పోయారు. ఒంటరి ప్రయత్నం ఫలించకపోవచ్చు.

ప్రశ్న: రామ జన్మభూమి సమస్య తర్వాత కాశీ, మధుర ఎజెండాలోనే ఉన్నాయి. వీటిని కొనసాగిస్తారని మీరు అనుకుంటున్నారా? అవి ప్రస్తుతం ఎక్కడ ఉన్నాయి?

జవాబు: 1990-91లో, 2023లో ముస్లింలతో జరిగిన చర్చల్లో నేనుకూడా ఉన్నాను. ఆ సమయంలో ముస్లింలు దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నారని నేను చెప్పగలను. కేరళకు చెందిన కెకె మహ్మద్ దీని గురించి వివరంగా రాశారు. తీర్మానాన్ని అడ్డుకున్నది వామపక్షాలు. రామ జన్మభూమి సమస్యను 1990లోనే పరిష్కరించవచ్చు, కానీ చిన్న చిన్న అంశాలు, ఓటు బ్యాంకు రాజకీయాలు దీర్ఘకాలిక మత సంఘర్షణగా మార్చాయి.

ముస్లింలకు జ్ఞానవాపి మసీదు వంటి ప్రదేశాలు అంత పవిత్రమైనవి కావు. వారానికి దాదాపు 300 మంది మాత్రమే అక్కడ నమాజ్ చేస్తారు. మధుర మసీదులో ఇంకా తక్కువ కార్యకలాపాలు జరుగుతాయి. నేడు రామ జన్మభూమి ఆందోళనతో పోల్చదగిన ఉద్యమం జరిగే అవకాశం చాలా తక్కువ. హిందువులు కూడా లోతుగా పాల్గొనడం లేదు.

చర్చల ద్వారా పరిష్కారం సాధ్యమే. మధురలో రాబోయే 50 సంవత్సరాల వరకు పునర్నిర్మాణం లేదా ఇలాంటి చర్యలు జరగకూడదని కోర్టు ఇప్పటికే నిర్దేశించింది. దీనివల్ల ఉద్రిక్తతలు తొలగిపోతాయి. పరిష్కారానికి ఇలాంటి అవకాశం వస్తే.. ముస్లింలు అంగీకరించకుండా ఏ రాజకీయ పార్టీ వాస్తవికంగా నిరోధించదు. అందువల్ల కాశీ మధుర రెండూ చర్చల ఫలితాలను చూడవచ్చు, అయితే ఇతర సంబంధిత సమస్యలు హిందువులకు పెద్దగా ప్రాముఖ్యతను కలిగి ఉండవు.

బీజేపీ, ఏఐఏడీఎంకే ఒకరినొకరు పూర్తిగా విశ్వసించకపోయినా.. డీఎంకే వ్యతిరేక భావనను కలిసి ప్రసారం చేయగలరా లేదా అనే దానిపై చాలా ఆధారపడి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే డీఎంకేకు గట్టి పోటీ ఇచ్చేవారు దొరకలేదని అన్నామలై చెప్పడం కొంతవరకు కరెక్టే.

ప్రశ్న: పార్టీ కోసం కష్టబడ్డ అన్నామలైపై ఎందుకు ఆశలు వదులుకుంది? ఆయనపై నమ్మకం లేకపోవడమా? మరేదైనా కారణం ఉందా?

జవాబు: ఉదాహరణకు మహారాష్ట్ర తీసుకోండి. శివసేనకు భాగస్వామ్య పార్టీగా ఉన్న బీజేపీ క్రమేణా ఎదిగింది. అలా ఎదగడానికి దాదాపు 20 సంవత్సరాలు పట్టింది. ఒక బ్రాహ్మణుడిని ముఖ్యమంత్రిని చేయడం ఒక అద్భుతం తప్ప మరేమీ కాదు. రాజకీయాలను మార్చడానికి చేసిన చాలా కష్టతరమైన ప్రాథమిక పనిని ఇది ప్రతిబింబిస్తుంది. తమిళనాడులో కూడా ఇదే విధమైన పునాది అవసరం. అన్నామలైని పార్టీ అధ్యక్ష పదవి నుంచి తప్పించి మరొకరిని నియమించడం నా దృష్టిలో సరైన నిర్ణయం. పార్టీ తీసుకున్న నిర్ణయానికి అన్నామలై కూడా కట్టుబడి ఉన్నాడు. 2024 ఎన్నికలలో ఓట్ షేర్‌ను పెంచగలిగాడు. కాని బీజేపీ స్వయంగా దాన్ని కొనసాగించలేకపోయింది. కూటమి అవసరమని గుర్తించింది. తనను తప్పించడం వెనక వ్యూహం ఉందని అన్నామలై కూడా అర్థం చేసుకున్నాడు. అన్నామలై కూడా బీజేపీ వ్యూహానికి తగ్గట్టుగానే వేగంగా కదులుతున్నాడు.

ప్రశ్న: ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘ్‌చాలక్ మోహన్ భగవత్ 75 ఏళ్లు నిండాయి. ప్రధానితో సహా అనేక మంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఆర్‌ఎస్‌ఎస్‌లో నాయకత్వ పరివర్తన ఎలా జరుగుతుందో, విజయ దశమి తర్వాత మనం ఏమి ఆశించవచ్చో మీకు తెలుసా?

జవాబు: అతను ఎంతకాలం కొనసాగాలో ఆర్‌ఎస్‌ఎస్‌లో, సర్‌సంఘ్‌చాలక్ నిర్ణయిస్తాయి. మోహన్ భగవత్ పదవీ విరమణ చేయాలని ఎంచుకోవచ్చు, కానీ బృందం కూడా అంగీకరించాలి. బీజేపీ విషయానికొస్తే.. ఆర్‌ఎస్‌ఎస్‌లో ఉన్నట్లుగా కఠినమైన వయో నియమం లేదు. అద్వానీ, మురళీ మనోహర్ జోషి వంటి నాయకులు కూడా 70ల చివరి వరకు సేవలందించారు. వయో నియమం బీజేపీకి వర్తించదు. అతను కోరుకుంటే పదవీ విరమణ చేయడాన్ని ఎంచుకోవచ్చు, కానీ అతను అలా చేయవలసిన అవసరం లేదు.

ప్రశ్న: మోదీ నాయకత్వంలో బీజేపీ వృద్ధిని ఎలా అంచనా వేస్తారు?

జవాబు: బీజేపీ చాలా సంప్రదింపులు జరిగే పార్టీ. ఏ ఒక్క వ్యక్తి కూడా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోరు. అందుకే బీజేపీలో నిర్ణయాలు కొన్నిసార్లు ఆలస్యం కావడానికి అదే కారణం. ఆలస్యం అంటే గందరగోళం కాదు. ఏకాభిప్రాయం కోసం. అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కంటే పార్టీకి చాలా ఎక్కువ బాధ్యతలు ఉంటాయి. కాబట్టి సమయాన్ని తదనుగుణంగా సర్దుబాటు చేస్తారు.

ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేసే విషయంలో బీజేపీతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ను కూడా సంప్రదిస్తారు. సంప్రదింపులు జరిగే చోట రెండు కీలక విషయాలు ఉన్నాయి: రాష్ట్రపతి ఎంపిక, ప్రధానమంత్రి ఎంపిక. ఆర్‌ఎస్‌ఎస్‌కు, బీజేపీకి మధ్య ఉన్న ఏకైక అధికారిక సంబంధం ఏమిటంటే.. బీజేపీ ప్రధాన కార్యదర్శి ఎప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ ప్రచారక్‌ అయి ఉంటారు.

ప్రశ్న: బీహార్ ఎన్నికలు, SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ)‌ను మీరు ఎలా చూస్తారు?

జవాబు: నేను ఎన్నికల కమిషన్ అయితే ముందుగా ఒక రాష్ట్రంలో దీన్ని అమలు చేసేవాడిని. ఆ తర్వాత బీహార్‌కు అమలు చేసేవాణ్ణి. అందులో తప్పేముంది? నేను కాంగ్రెస్‌తో సహా రాజకీయ పార్టీలలో ఉన్నప్పుడు.. మేము ఇంటింటికి వెళ్లి ఓటర్ల స్థితిని తనిఖీ చేసేవాళ్ళం. ఇప్పుడు ఏ పార్టీ కూడా అలా చేయదు. ఆ పని ఎన్నికల కమిషన్‌కే వదిలేశారు. ఇప్పుడు 65 లక్షల మందిని తొలగించారు. సుప్రీంకోర్టు కూడా దాన్ని గమనించింది. భాగస్వామ్య ప్రజాస్వామ్యం ఎలా పనిచేస్తుందో అలానే ఉంటుంది. ఇది కేవలం ఎన్నికల ప్రక్రియ కాదు.

Tags:    

Similar News