చెన్నై శివారు, నేరాలకు అడ్డాలుగా మారుతున్నాయి.. ఎందుకు?

చెన్నైలోని శివారు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన అనేక ప్రాంతాలు ఇప్పుడు నేరాలకు అడ్డాలుగా మారాయి. ఇక్కడ మాదక ద్రవ్యాల వినియోగం, లైంగిక హింసలు సాధారణంగా మారాయి.

Update: 2024-07-10 06:53 GMT

చెన్నై నగరానికి కేవలం 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న సెమ్మంచెరిలో వందలాది మంది తల్లులు తమ ఆడపిల్లలను వీధుల్లో ఆడుకోనివ్వకుండా జాగ్రత్తపడుతున్నారు. లైంగిక వేధింపులు, హింసాత్మక దాడుల భయం వల్ల తల్లిదండ్రులు తమ పిల్లలను గడప దాటనివ్వడం లేదు. ఇది అనేక సంవత్సరాలుగా జరుగుతోంది.

ఈ భయం వాళ్లని ఇళ్లకే పరిమితం అవుతున్నారు. చాలా ఇళ్లలో ఇది చిన్న తనంలోనే వివాహానికి కూడా దారి తీసింది. సెమ్మెంచెరిలోని కొన్ని కుటుంబాలు తమ పిల్లలపై నిఘా ఉంచడానికి, నేరాల నుంచి వారిని రక్షించడానికి ఇళ్ల వెలుపల సిసిటివి కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.

క్రైమ్ జోన్లు..
చెన్నై నగరంలోని ఎగ్మోర్, థౌజండ్ లైట్స్, బెసెంట్ నగర్, ఆర్‌ఎ పురం వంటి ప్రధాన ప్రదేశాలలో 100 మురికివాడలు, హౌసింగ్ బోర్డు కాలనీలలో నివసించే లక్షకు పైగా కుటుంబాలు దశాబ్దం క్రితం వివిధ అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల వేరే ప్రాంతాలకు తరలించబడ్డాయి. సెమ్మంచేరి, కన్నగి నగర్, పెరుంబాక్కం, నవలూరులో అనేకమందికి ప్రభుత్వం పునరావాసం కల్పించగా, ఈ పునరావాస ప్రాంతాలు ఏళ్ల తరబడి క్రైమ్ జోన్‌లుగా మారాయి.


 


భయభ్రాంతులకు గురైన నివాసితులు..
ది ఫెడరల్ చెన్నై నగర శివార్లలోని రెండు పునరావాస ప్రాంతాలను సందర్శించినప్పుడు, చాలా మంది తల్లులు భయంతో జీవిస్తున్న వారి కథలను బాధాకరంగా పంచుకున్నారు. వారిలో ఒకరు 30 ఏళ్ల పి విజి, ఆమె తన పసిబిడ్డపై నిఘా ఉంచడానికి తన ఇంటి ప్రవేశద్వారం వద్ద సిసిటివి కెమెరాను ఏర్పాటు చేసుకుంది. తన కుటుంబం అనేక దశాబ్దాలుగా బీసెంట్ నగర్‌లో నివసిస్తోందని, అయితే వారిని తొలగించి 2017లో సెమ్మంచెరికి మకాం మార్చారని విజీ చెప్పారు. పి విజి తన పసిబిడ్డపై నిఘా ఉంచేందుకు తన ఇంటి బయట సిసిటివి కెమెరాను అమర్చుకుంది.
"మేము నగరంలో ప్రశాంతమైన జీవితాన్ని గడిపాము, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, నేను నిత్యం భయంతో జీవిస్తున్నాను. ఇక్కడ మహిళలను వెంబడించడం సర్వసాధారణం. బహిరంగ ప్రదేశాల్లో మహిళల దాడులు, పిల్లలపై అఘాయిత్వాలు, మాదక ద్రవ్యాల వినియోగం వంటివి నేను చాలా సార్లు చూశాను’’.
నా బిడ్డ భద్రత గురించి నేను ఆందోళన చెందాను. నేను ఆమెను బయట ఆడుకోవడానికి అనుమతించను. నా పసిపాప సురక్షితంగా ఉందని నిర్ధారించుకోవడానికి CCTVని కూడా తరుచూ చూస్తాను,” అని విజి చెప్పారు.
ప్రధాన కారణాలు ఏంటంటే..
K Kanjana వంటి సామాజిక కార్యకర్తలు ఈ అంశంపై మాట్లాడుతూ.. ప్రజలను వారున్న ప్రదేశం నుంచి తొలగించడంలో సరైన ప్రణాళికలు అనుసరించలేదని అభిప్రాయపడ్డారు. ఇవీ నిరుద్యోగానికి దారితీశాయి. కుటుంబ సంబంధాలపై తీవ్రంగా ప్రభావం చూపాయి. దీనికి అనేక ఉదాహారణలు ఉన్నాయని వివరించారు. ఈ ప్రాంతంలో గృహ హింస, దాడులకు నిరుద్యోగం మూలకారణమని స్థానిక నివాసి ఎం బెలిండా చెప్పారు.
“నిరుద్యోగులలో ఎక్కువమంది మద్యం, మాదకద్రవ్యాలకు బానిసలుగా మారారు. చాలా మంది యుక్త వయస్కులు కూడా తమ తండ్రుల మాదిరిగానే మత్తు పదార్థాలకు వ్యసనపరులుగా మారుతున్నారు” అని ఆమె తెలిపారు.
కనీస సౌకర్యాల కొరత
పునరావాస ప్రాంతాల్లోని అనేక ప్రాంతాల్లో తాగునీరు, డ్రైనేజీ పైపులైన్లు వంటి కనీస సౌకర్యాలు కూడా సరిగా లేవని బెలిండా చెబుతున్నారు. “మాకు సరైన తాగునీరు లేదు. డ్రైనేజీ నీరు తాగునీటి పైపులైన్లలో కలుస్తోంది. ఇక్కడ ప్రజలు తరచుగా అనారోగ్యానికి గురవుతారు, ”అన్నారాయన. ఈ ప్రాంతంలో సరఫరా అవుతున్న నీటి నాణ్యత చాలా తక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు


 


ఈ ప్రాంతంలో వీధిలైట్లు లేవని, దీంతో మహిళలు రాత్రిపూట బయటకు వెళ్లడం లేదని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో వేలాది మంది నివాసితులకు సేవలందించేందుకు ఒకే ఒక వైద్యుడి నడుస్తున్న ఆస్పత్రి మాత్రమే ఉంది. అంతే కాకుండా, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు మహిళా పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేయాలని పలువురు మహిళలు డిమాండ్ చేశారు.
పెరుగుతున్న బాల్య వివాహాలు..
తల్లిదండ్రుల్లో అభద్రతాభావం వల్ల చాలా మంది తమ కూతుళ్లకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని కార్యకర్తలు అంటున్నారు.
"అనేక అవగాహన కార్యక్రమాలు ఉన్నప్పటికీ, ఇక్కడ అనేక బాల్య వివాహాలు జరుగుతాయి. యుక్తవయస్సులోని తల్లులు అయిన వారిని మేము చూశాము. పిల్లలను ఇంట్లో ఒంటరిగా వదిలేయడం ఇష్టంలేని తల్లిదండ్రులు టీనేజ్‌లో పెళ్లి పీటలు ఎక్కిస్తున్నారు. గృహ హింస, పేదరికం ఇక్కడ మహిళలను ప్రభావితం చేస్తూనే ఉన్నాయి, ”అన్నారాయన.
పునరావాస ప్రాంతాలలో మహిళలపై హింస, జీవనోపాధిని కోల్పోవడాన్ని పరిష్కరించాలని పెనురిమై ఇయ్యక్కం సంస్థ 2017లో మద్రాసు హైకోర్టులో కేసు వేసింది. పిటిషన్ ప్రకారం, రద్దీగా ఉండే నగర ప్రాంతాల నుంచి, శివారు ప్రాంతాలకు బహిష్కరించబడిన అనేక మంది రోజువారీ కూలీలు పునరావాసం కారణంగా తమ జీవనోపాధిని కోల్పోయారు. చాలామంది నిరుద్యోగులుగా మారడంతో, నేరగాళ్లుగా మారుతున్నారని, ఇవి నేరాల రేటు పెరుగుదలకు కారణమైందని చెబుతున్నారు.
అడ్వకేట్ కమిషనర్ నివేదిక..
2018లో, నేరాల పెరుగుదలకు కారణాలను గుర్తించడానికి, మహిళల భద్రతను మెరుగుపరిచే చర్యలను ప్రతిపాదించడానికి హైకోర్టు అడ్వకేట్ కమిషనర్ కె. ఇలాంగోను నియమించింది. జూలై 2018లో ఇలాంగో మొదటి నివేదిక ఆధారంగా పెరుంబాక్కం వంటి పునరావాస ప్రాంతాలలో కొత్త పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేశారు.
జూన్ 2024లో తన ఇటీవలి నివేదికలో, పునరావాస ప్రాంతాల్లోని నివాసితుల రోజువారీ జీవితాలను ప్రాథమిక సౌకర్యాలు, భద్రతా సమస్యలు ఎలా ప్రభావితం చేస్తాయో ఎలాంగో హైలైట్ చేశారు. గత ఏడేళ్లలో మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని అన్నారు. అక్కడ నేరాలు తగ్గాలంటే పగలు, రాత్రి సమయాల్లో పోలీసుల పెట్రోలింగ్‌ను పెంచాల్సిన అవసరం ఉందన్నారు.
“ఈ ప్రాంతంలో తగినంత మంది పోలీసులను 24 గంటలు మోహరించినప్పుడే ప్రజలు ప్రశాంతంగా జీవిస్తారు. ఈ పరిసరాల్లో సరఫరా అవుతున్న నీరు సరిగా లేదు. పెరుంబాక్కమ్‌లోని పోలీసు స్టేషన్‌లో మంజూరైన సంఖ్య 76, కానీ ప్రస్తుతం 50 మంది మాత్రమే ఉన్నారు. అయితే, పోలీసు విధులను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు 20 మంది పోలీసులు మాత్రమే అందుబాటులో ఉన్నారు” అని ఆయన నివేదికలో తెలిపారు.
ప్రభుత్వ ప్రయత్నాలు ఎంతదాకా..
దీర్ఘకాలిక భద్రతా సమస్యలను పరిష్కరించడానికి మీరు ఏం చేశారని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పరిష్కరించడంతో గృహ నిర్మాణ శాఖ స్పందించింది. తమిళనాడు స్లమ్ క్లియరెన్స్ బోర్డు తరఫున న్యాయవాదీ మాట్లాడుతూ.. కుటుంబాలు జీవించడానికి అవసరమైన అన్ని ప్రాథమిక అవసరాలు, సౌకర్యాలు కల్పించబడ్డాయని నివేదించారు.
అయితే అధికారులు చెబుతున్నసమాధానాలు, కార్యక్రమాల పై స్వచ్ఛంద సంస్థలు సంతృప్తి చెందడం లేదు. ప్రభుత్వ కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఎలాంటి ప్రభావం చూపడం లేదని ఆరోపించారు.
పునరావాస ప్రాంతాలు మహిళలకు సురక్షితంగా చేయడానికి తీసుకున్న చర్యల గురించి ఫెడరల్ సోషల్ వెల్ఫేర్ కమిషనర్ వి అముధవల్లిని కలిసి మాట్లాడినప్పుడు.. బహిరంగ ప్రదేశాల్లో మహిళలపై హింస, గృహ హింస, పునరావాసంలో పిల్లల లైంగిక వేధింపులను నివేదించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆమె చెప్పారు.
“తగిన భద్రత కల్పించేందుకు మేము పోలీసు శాఖతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాము. ఉపాధి కోల్పోవడం, ఆడపిల్లల్లో డ్రాపౌట్‌లు ప్రధాన సమస్యలు. డ్రాపౌట్‌లు తిరిగి పాఠశాలలో చేరేలా మేము ప్రయత్నిస్తాం. ఆ పరిసరాల్లోని మహిళల భద్రత కోసం సౌకర్యాలను మెరుగుపరుస్తాము, ”అని ఆమె చెప్పారు.
'బలహీనమైన కుటుంబాల ఘెట్టోలైజేషన్'
అయితే, కార్యకర్త వెనెస్సా పీటర్‌కు ప్రభుత్వ కార్యక్రమాలపై నమ్మకం లేదు. పునరావాస ప్రక్రియలు ఘెట్టోలైజేషన్‌కు దారితీశాయని కుటుంబాల ప్రాథమిక మానవ గౌరవం, హక్కులను ఉల్లంఘిస్తున్నాయని ఆమె విమర్శించారు.
“పట్టణ అణగారిన వర్గాల జీవనోపాధి స్థాన-కేంద్రీకృత, మార్కెట్-కేంద్రీకృతమైనది. ప్రజలు వేరే ప్రాంతాల్లో పునరావాసం పొందినప్పుడు, ఉపాధి అవకాశాలు కోల్పోతారు. ఇవన్నీ మహిళలపై ఎక్కువ ప్రభావం చూపుతాయి. పునరావాసం పొందిన వారిలో తొంభై నుంచి 95 శాతం మంది అనధికారిక కార్మిక రంగంలో నిమగ్నమై ఉన్నారు. ఈ పునరావాసం వారు నగరంలో నివసించే హక్కును మరియు జీవనోపాధిని పొందే హక్కును కూడా దూరం చేసింది, ”అని ఆమె అన్నారు.
హెల్ప్‌లైన్ నంబర్‌లు:
మహిళల హెల్ప్‌లైన్ - 181
మహిళల హెల్ప్‌లైన్ - 1091
చెన్నై పోలీసు యొక్క డిస్ట్రెస్ హాట్‌లైన్ - 8300304207


Tags:    

Similar News