ఈపీఎస్ పై బీజేపీ అంతర్గంగా ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోందా?
ఐక్యంగా ఉన్నామనే సంకేతాలు పంపిస్తున్న మాజీ ముఖ్యమంత్రి
By : Praveen Chepyala
Update: 2025-12-08 13:20 GMT
పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే మరోసారి వర్గపోరులో చిక్కుకునే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. తమిళనాడు లో ప్రధాన ప్రతిపక్ష పార్టీలోని ఐక్యతను ప్రభావితం చేసేలా పార్టీ బహిష్కృత అన్నాడీఎంకే సభ్యుడు ఎస్ సూర్యమూర్తి పార్టీ ప్రధాన కార్యదర్శి గా ఈపీఎస్ అర్హత లేదని సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేశాడు.
పిటిషన్ లో ఏం ఉంది?
2026 అసెంబ్లీ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ పిటిషన్ దాఖలైంది. ఈపీఎస్ 2022 లో పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారని, ఇది చెల్లదని, పార్టీ బై లా ప్రకారం ప్రత్యక్ష కేడర్ ఎన్నిక జరపాలని కోరారు.
మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం, జయలలిత నెచ్చెలి వీకే శశికళ, టీటీవీ దినకరన్ తిరుగుబాటుపై బీజేపీ రాజీ ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు అన్నాడీఎంకే నాయకత్వంపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తోంది. ఇది పార్టీలో తిరిగి అస్థిరత ఏర్పడుతుందనే భయాన్ని లేవనెత్తింది.
2022 సివిల్ దావా కొనసాగడానికి దిగువ కోర్టు అనుమతించిన దానిపై మద్రాస్ హైకోర్టు స్టే విధించింది. దీనిపై సూర్యమూర్తి సుప్రీంకోర్టులో ప్రత్యేక లీవ్ పిటిషన్ దాఖలు చేశాడు. అన్నాడీఎంకే బై లా లోని 20, 43 వ నిబంధన ప్రకారం.. జనరల్ కౌన్సిల్ ను జనరల్ సెక్రటరీని ఎన్నుకోకుండా నిషేధిస్తున్నాయని, బదులుగా ప్రాథమిక సభ్యులలో అట్టడుగు స్థాయి నుంచి ఎన్నిక తప్పనిసరని పిటిషన్ లో ఆయన వాదించారు.
న్యాయపరమైన వాదన..
సూర్యమూర్తికి పార్టీలో స్థానం లేదని ఈపీఎస్ నిరంతరం వాదిస్తూనే ఉన్నారు. ఆయన 2017 బహిష్కరణ, మిత్రపక్షమైన ఎంజీఆర్ కట్చి బ్యానర్ కింద 2021 అసెంబ్లీ ఎన్నికల పోటీని ఆయన ఎత్తి చూపారు.
మద్రాస్ హైకోర్టు, ఆగష్టు 2025 లో విచారణ పై స్టే ఇవ్వడంతో ఈపీఎస్ కు తాత్కాలికంగా ఉపశమనం లభించింది. కానీ సూర్య మూర్తి ప్రస్తుతం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి, ఈ ఉత్తర్వూను రద్దు చేసి కేడర్ ఆధారిత ఎన్నికలు జరిపించాలని కోరాడు. జయలలిత మరణం తరువాత పార్టీలో ఏర్పడిన గందరగోళం నుంచి ప్రారంభమైన సుదీర్ఘ న్యాయ చరిత్రలో ఇది తాజా అధ్యాయం.
2022 లో ఈపీఎస్ పదోన్నతిపై న్యాయస్థానం విధించిన ఇలాంటి ఉత్తర్వూను డివిజన్ బెంచ్ రద్దు చేసింది. 2023 లోనే సుప్రీంకోర్టు ఈ నిర్ణయాన్ని సమర్థించి, అతని నాయకత్వాన్ని పట్టిష్టం చేసింది.
అసమ్మతిని తేవడం ప్రధాన లక్ష్యమా?
పార్టీకి చెందిన రెండు ఆకుల గుర్తును కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలిస్తోంది. అయినప్పటిక అనేక వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. బహిష్కరించిన నాయకులు అనేక పిటిషన్లు దాఖలు చేస్తూనే ఉన్నారు. వీటి విచారణకు ఫిబ్రవరి 2025 లో హైకోర్టు అనుమతి ఇచ్చింది.
సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ప్రకారం.. తిరుగుబాటుదారుల ధైర్యం పెంచి, క్రమంగా పార్టీలో అసమ్మతి చెలరేగి కీలక నిర్ణయాలను ప్రభావితం చేయగలదని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
బీజేపీ పాత్ర..
చట్టపరమైన ముప్పును మరింత పెంచే ప్రయత్నాలు బీజేపీ తెరవెనక ముమ్మరంగా చేస్తోంది. బీజేపీ నాయకత్వం అన్నాడీఎంకే పునరేకీకరణకు తీవ్రంగా ప్రయత్నం చేస్తోంది. విచ్చిన్నమైన శక్తులు డీఎంకే కు బలం చేకూరే ప్రమాదం ఉందని అది భావిస్తోంది.
దక్షిణ తమిళనాడు లో కీలక కమ్యూనిటీ తేవర్లు ఒకటి. వీటిని ఓపీఎస్, శశికళ, దినకరన్ నియంత్రించగలరు. వీరిని తిరిగి తీసుకురావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ సీనియర్ వ్యూహకర్తలు ఇటీవల ఢిల్లీ సమావేశాలలో ఓపీఎస్ ను కోరినట్లు సమాచారం. ఎన్డీఏ వ్యతిరేకులు బలం పుంజుకోకుండా చూడటం, విజయ్ ప్రభావాన్ని నియంత్రించడం వీరి ముఖ్య లక్ష్యం.
2022 లో పార్టీ నుంచి బహిష్కరించబడిన ఓపీఎస్ వర్గం అవశేషాలు ఇంకా ఉన్నాయి. అలాగే శశికళ ఇంకా కార్యదర్శిగా తన ఉనికిని చాటుకుంటూనే ఉంది. దినకరన్ స్థాపించిన అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం(ఏఎంఎంకే) 2021 లో 4 నుంచి 5 శాతం ఓట్లను సాధించి, డీఎంకే కు సాయపడింది.
తమిళనాడు బీజేపీ చీఫ్ నైనార్ నాగేంద్రన్ ఈ గ్రూపులను కూటమిలో చేర్చుకోవడానికి ప్రత్యక్షంగా సంకేతాలిచ్చారు. ఇవన్నీ ఈపీఎస్ ఇంతకుముందు తిరస్కరించిన ప్రతిపాదనలే.
ఈపీఎస్ పై ప్రభావం..
సీనియర్ జర్నలిస్ట్ మాట్లాడుతూ.. ఈపీఎస్ స్థాయిని తగ్గించారు. ‘‘ తన ఆధీనులు, కార్యనిర్వహాక కమిటీలో 90 శాతం మంది విశ్వాసపాత్రులను ఉన్నారు. సంస్థాగత యంత్రాంగం చెక్కుచెదరకుండా చూసుకున్నారు’’ అని ప్రియన్ అన్నారు.
తిరుగుబాటుదారుల ప్రభావం క్రమంగా క్షీణిస్తోంది. ఎన్డీఏ నుంచి ఓపీఎస్, దినకరన్ నిష్క్రమణ వారిని మరింత ఒంటరిగా మార్చాయని ఆయన అభిప్రాయపడ్డారు.
2025 లోనే తిరిగి అన్నాడీఎంకే తో బీజేపీ పొత్తు తిరిగి ప్రారంభం అయిన తరువాత ఈ కూటమిలో ఎక్కువ మంది మిత్రులు లేకపోవడంతో బీజేపీ నిరాశలో ఉంది. ఈ చర్చలు విఫలమైతే బీజేపీ లో ఒత్తిడి పెరిగే అవకాశం కనిపిస్తుంది.
అన్నాడీఎంకే కీలక సమావేశం..
సమయం గడుస్తున్న కొద్ది ఈ అనిశ్చితి ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోంది. అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కమిటీ డిసెంబర్ 10న చెన్నైలోని వనగరంలో సమావేశం అవబోతున్నాయి. బీజేపీ- అన్నాడీఎంకే కూటమి పునరుద్దరణ తరువాత ఇదే మొదటి స్థాయి పెద్ద సమావేశం.
ప్రెసిడియం అధిపతి ఏ తమిజ్ మగన్ హుస్సేన్ అధ్యక్షత వహించి, ఈపీఎస్ అధ్యక్షత వహించే ఈ సమావేశాలు 2026 వ్యూహాలు బీజేపీతో సీట్ల చర్చలు, డీఎంకేలోని పాలన లోపాలు లక్ష్యంగా చేసుకుని ప్రచార ఇతివృత్తాలు కూటమి విస్తరణలను రూపొందిస్తాయని భావిస్తున్నారు.
ఆహ్వానాలు హజరును తప్పనిసరి చేస్తాయి. ఇది సంఘీభావాన్ని ప్రదర్శించడానికి ఈపీఎస్ చేసే ప్రయత్నాలను చూపిస్తుంది. పునరేకీకరణకు డిసెంబర్ 15ను ఓపీఎస్ గడువు విధించిన నేపథ్యంలో ఈ సమావేశం జరుగుతోంది.
ఇటీవల కేంద్ర హోంమంత్రిని కలిసిన తరువాత ఈపీఎస్ మాట్లాడుతూ.. ప్రస్తుత ముఖ్యమంత్రి స్టాలిన్ మంత్రివర్గంలో ఏడుగురు మాజీ అన్నాడీఎంకే సభ్యులు ఉన్నారని చెప్పారు. ఇది ఆయన తీసుకోబోయే నిర్ణయానికి ఉదాహరణగా చెప్పవచ్చు.