ఆ వీడియోలు ఒరిజినల్.. అందులో ఉన్నది ప్రజ్వలే.. తేల్చేసిన ఎఫ్‌ఎస్‌ఎల్

ఇప్పటి వరకు హాసన్, బెంగళూరులో ప్రజ్వల్‌పై మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. ప్రజ్వల్ బాధితుల్లో ప్రభుత్వ అధికారులు, నటీమణులు, సాధారణ మహిళలు కూడా ఉన్నారు.

Update: 2024-08-02 11:39 GMT

కర్ణాటకలో తీవ్ర దుమారం రేపిన కర్ణాటక హసన్ నియోజకవర్గ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో కీలక అప్‌డేట్ ఇది. మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు అయిన ప్రజ్వల్ పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన కొంతమంది మహిళలతో సన్నిహితంగా ఉన్న వీడియోలు పార్లమెంటు ఎన్నికల సమయంలో బయటకు వచ్చాయి. దాంతో ఆయన దేశం వీడి పారిపోయారు. ఈ ఏడాది మే 31న జర్మనీలోని మ్యూనిచ్ నుంచి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగిన కొద్దిసేపటికే పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. ప్రస్తుతం కేసు కోర్టు విచారణలో ఉంది. ఆ వీడియోలు మార్ఫింగ్ చేసినవని ప్రజ్వల్ తరపు న్యాయవాది న్యాయమూర్తి ముందు వాదించారు. దాంతో ఆ వీడియోలో ఉన్నది అసలు ప్రజ్వలేనా? అనే నిర్ధారించడానికి వాటిని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ (FSL)కి పంపారు. అవి ఒరిజినల్ వీడియోలోనని, వీడియోలు ఎలాంటి మార్ఫింగ్ లేదని FSL ధృవీకరించింది.

ఇప్పటి వరకు హాసన్, బెంగళూరులో ప్రజ్వల్‌పై మొత్తం నాలుగు కేసులు నమోదయ్యాయి. ప్రజ్వల్ బాధితుల్లో ప్రభుత్వ అధికారులు, నటీమణులు, సాధారణ మహిళలు కూడా ఉన్నారు. ప్రజ్వల్ తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని 47 ఏళ్ల పనిమనిషి ఫిర్యాదు చేయడంతో అతనిపై ఏప్రిల్ 28, 2024న మొదటి కేసు నమోదైంది.

Tags:    

Similar News