కేంద్రం తమిళ భాషతో వ్యవహరించే విధానం ఇది కాదు: కమల్ హాసన్

ఈ సంవత్సరం పార్లమెంట్ లో తమ పార్టీ వాయిస్ వినిపిస్తుందని ఆశాభావం;

Update: 2025-02-22 11:25 GMT

తమిళనాడు తన చరిత్ర, భాష కోసం దశాబ్ధాల పాటు పోరాటం కొనసాగించిందని నటుడు, రాజకీయ నాయకుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కమల్ హాసన్ అన్నారు.

హిందీని, తమిళనాడుపై రుద్దడానికి దీర్ఘంకాలంగా ఉత్తరాది వారు చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశ్నించారు. పార్టీ ఎనిమిదో వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన చెన్నైలో నిర్వహించిన కార్యక్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.

ప్రజల భాష ప్రాముఖ్యతను తక్కువ అంచనా వేయడానికి వీలులేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కూడా ఆయన తన రాజకీయ పార్టీ ఆశయాల గురించి కూడా మాట్లాడారు.

‘‘తమిళులు తమ భాష కోసం ప్రాణాలు అర్పించారు. వీటితో ఆడుకోకండి. తమిళ పిల్లలకు కూడా తమకు ఏ భాష అవసరమో తెలుసు. వారికి ఏ భాషను ఎంచుకోవాలనుకునే విషయంలో జ్ఞానం ఉంది.’’ అని కమల్ అన్నారు.
విఫలమైన నటుడు..
తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ, తనపై విఫలమైన రాజకీయ నాయకుడిగా ముద్రవేసిన విమర్శకులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. రాజకీయాల్లోకి ఆలస్యంగా ప్రవేశించడం పై స్పందిస్తూ.. తనకు సినిమాలపై ఉన్న ప్రభావం దీనిని అడ్డుకుని ఉండవచ్చని ఆయన అంగీకరించారు. ‘‘నేను 20 సంవత్సరాల ముందే చేరి ఉంటే.. ఈ రోజు నా ప్రసంగం, వైఖరి భిన్నంగా ఉండేవి’’ అని ఆయన అన్నారు.
ఈ సంవత్సరం పార్లమెంట్ లో, వచ్చే ఏడు తమిళనాడులో పార్టీ స్వరం వినిపిస్తుందని కమల్ ప్రకటించారు. 2026 నాటికి రాష్ట్ర అసెంబ్లీకి సన్నాహాలు మొదలు పెట్టాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎంఎన్ఎం లక్ష్యాలను సాధించడానికి అవిశ్రాంతంగా పనిచేయమని పార్టీ కార్యకర్తలను కోరారు.
నేషనల్ ఎడ్యూకేషన్ పాలసీ..
జాతీయ విద్యా విధానం 2020 పై తమిళనాడులో తీవ్ర వ్యతిరేకత మొదలైంది. త్రిభాష విధానం అమలు చేస్తేనే సమగ్ర శిక్ష అభియాన్ నిధులు విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పింది. ప్రస్తుతం బీజేపీ, డీఎంకే కు మధ్య హ్యాష్ ట్యాగ్ యుద్దం నడుస్తోంది. రాజకీయ మాటలు మాని సంస్కరణలు అమలు చేయాలని ఆయన కోరారు.
‘‘తమిళనాడు వైఖరి నాకు తెలుసు. నేను దానిని గౌరవిస్తాను. కానీ విదేశీ భాషలపై మనం అతిగా ఆధారపడటం పరిష్కారం కాదు. ఎన్ ఈపీ 2020 అమలు చేయకపోవడం ద్వారా విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ప్రపంచ, దేశ వ్యాప్త అవకాశాలను కోల్పోతున్నాము’’ అని ఆయన అన్నారు.
శాస్త్రీయ, ఆధునిక విద్యను ప్రొత్సహించమని కేంద్రం ‘‘పీఎం శ్రీ’’ పాఠశాలల పథకాన్ని తిరస్కరించడం ద్వారా తమిళనాడు 5 వేల కోట్ల నిధులను కోల్పోతుందని కూడా ఆయన హెచ్చరించారు.
‘’వాస్తవాలను తప్పుగా చూపించడం ద్వారా ఏమి పరిష్కరం కాదు. పీఎం శ్రీ పాఠశాలలను అమలు చేయకపోవడం ద్వారా తమిళనాడు రూ. 5 వేల కోట్లను కోల్పోతుంది. రాజకీయ విభేధాలకు అతీతంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను’’ అని ప్రధాన్ అన్నారు.
తమిళనాడు ప్రభుత్వం వైఖరి..
కేంద్రం ఎన్ని చెప్పినప్పటికీ తమిళనాడు ప్రభుత్వం ఎన్ఈపీ 2020 ని వ్యతిరేకించడంలో మాత్రం పట్టు సడలలేదు. ఇది రాష్ట్ర విజయవంతమైన విద్యానమూనాను దెబ్బ తీస్తుందని, విద్యా విధానంపై నియంత్రణను కేంద్రీకరిస్తుందని వాదిస్తుంది.
మొదట ఉదయనిధి స్టాలిన్ దీనిపై తన గళం విప్పారు. కేంద్రం ఒకే విధమైన విద్యా విధానాన్ని ప్రశ్నించారు. ‘‘తమిళనాడు అవసరాలకు అనుగుణంగా లేని విద్యా విధానాన్ని కేంద్ర ప్రభుత్వం విధించడానికి మేము అనుమతించము’’ అని ఆయన కుండబద్దలు కొట్టారు.


Tags:    

Similar News