తుంగభద్ర: వరద ఉధృతికి కొట్టుకుపోయిన గేటు..

కర్నాటకలో భారీగా వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర జలాశయానికి వరద పొటెత్తింది. వరధ ఉధృతికి గేటు కొట్టుకుపోవడంతో..

Update: 2024-08-11 08:08 GMT

కర్నాటకలో భారీ వర్షాలు కురుస్తుండటంతో తుంగభద్ర నదీ పొటేత్తుతోంది. వరదల తీవ్రతకు తుంగభద్ర డ్యాం గేటు కొట్టుకుపోవడంతో కృష్ణా నది వెంబడి ఉన్న నివాసితులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్రంలోని మల్నాడు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో మొత్తం 133 టీఎంసీల సామర్థ్యం కలిగిన తుంగభద్ర డ్యాం నీటిమట్టం  ప్రమాదకరంగా పెరిగింది.

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (APSDMA) ఆదివారం (ఆగస్టు 11) కృష్ణా నది ఒడ్డున నివసించే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించింది. గేట్ నంబర్ 19 చైన్ లింక్ తెగిపోవడంతో అక్కడ ఉన్న వరదను నియంత్రించే గేటు కొట్టుకుపోయింది. దీంతో దాదాపు 35 వేల క్యూసెక్కుల వరదనీరు ప్రవహించగా మొత్తం 48 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. కర్నూలు జిల్లాలోని కోసిరి, మంత్రాలయం, నందవరం, కౌతాళంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్‌డీఎంఏ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఆర్‌ కూర్మనాధ్‌ తెలిపారు. ఈ జిల్లాల్లో వరద హెచ్చరికలు జారీ చేశారు.
కర్ణాటకలోని హోస్పేట్‌లో శనివారం రాత్రి గేటు విరిగిపడి చాలా నీరు దిగువకు వదులుతోంది. కాలువలు, వాగులు దాటకుండా నివాసితులను కూడా హెచ్చరించింది. 70 ఏళ్లుగా తుంగభద్ర డ్యామ్‌కు ఇంత నష్టం వాటిల్లడం ఇదే తొలిసారి. 1953లో ప్రారంభించిన ఈ డ్యాం కర్ణాటకకే కాకుండా పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు కూడా నీటిని అందిస్తుంది.
Tags:    

Similar News