‘మాతృభాషను కాపాడుకుందాం’

పొరుగు రాష్ట్రాలకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ..;

Update: 2025-02-27 10:01 GMT

త్రిభాషా విధానంపై కేంద్రంలోని బీజేపీకి, తమిళనాడులోని డీఈంకే (Dravida Munnetra Kazhagam) ప్రభుత్వానికి మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం నడుస్తోంది. జాతీయ విద్యావిధానం(ఎన్‌ఈపీ)లో భాగంగా దేశవ్యాప్తంగా విద్యార్థులు హిందీ, ఇంగ్లీషు, ఒక స్థానిక భాషను నేర్చుకోవాలన్నది కేంద్రం యోచన. అయితే తాము ద్విభాషా విధానానికే కట్టుబడి ఉన్నామని, హిందీ భాషాను అనుమతించమని ఇప్పటికే సీఎం ఎంకే స్టాలిన్ (CM Stalin) స్పష్టం చేశారు. జాతి, సంస్కృతికి, ప్రజలకు నష్టం కలిగించే చర్యలను సహించబోమని కూడా హెచ్చరించారు.

ఈ నేపథ్యంలో స్టాలిన్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పెట్టిన పోస్టు వైరలవుతోంది. హిందీ కారణంగా 19 భారతీయ భాషలు కనుమరుగైపోతున్నాయని, హిందీని అనుమతిస్తే మీ మాతృభాష కూడా ఆ జాబితాలో చేరుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. 

లేఖ సారాంశం..

పొరుగు రాష్ట్రాలకు తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ..‘ఇతర రాష్ట్రాల సోదర, సోదరీమణులారా... హిందీ కారణంగా 100 ఏళ్లలో 19 భాషలు కనుమరుగయ్యాయి. భోజ్‌పురి, మైథిలీ, బుందేలీ, గర్వాలీ, కుమావోని, మాగాహి, మార్వారీ, మాల్వీ, ఛత్తీస్‌గఢి, సంథాలీ, అంజికా ఇలా అనేక భాషలు మనుగడ కోల్పోయాయి. ఉత్తరప్రదేశ్‌, బిహార్‌ హిందీ రాష్ట్రాలు కావు. వాటి అసలు భాషలు గతంలో కలసిపోయాయి. తమిళనాడుకు ఆ దుస్థితి రాకూడదనే పోరాడుతున్నాం. జాతి, సంస్కృతిని నాశనం చేయడానికి భాషలపై చేస్తున్న దాడిని’ ప్రతిఘటించండి’’ అని స్టాలిన్‌ రాసుకొచ్చారు.

మరోవైపు.. భాజపా, డీఎంకేల మధ్య వివాదం చిన్నపిల్లల కొట్లాటలా ఉందంటూ తమిళగ వెట్రి కళగం పార్టీ (TVK) అధ్యక్షుడు నటుడు విజయ్‌ (Vijay) వ్యాఖ్యానించారు.

Tags:    

Similar News