పీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ గా కుమార్తెను నియమించిన రామదాసు

కుమారుడు అన్భుమణిని వర్కింగ్ ప్రెసిడెంట్ గా తొలగించిన పీఎంకే అధ్యక్షుడు

Update: 2025-10-26 07:13 GMT
పీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు రామదాసు

పట్టాలి మక్కల్ కచ్చి వ్యవస్థాపకుడు(పీఎంకే) డాక్టర్ ఎస్ రామదాస్ శనివారం తన పెద్ద కుమార్తె శ్రీ గాంధీని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించారు. సెప్టెంబర్ లో ఆయన తన కుమారుడు అన్బుమణిని పార్టీ నుంచి బహిష్కరించారు.

ఇప్పుడు ఆయన స్థానంలో కుమార్తెను నియమించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ తన కుమారుడు నుంచి ఆయన పార్టీ పగ్గాలు స్వీకరించారు.

తరువాత పార్కీ వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి మాజీ కేంద్రమంత్రి అయిన అన్భుమనిని తొలగిస్తున్నట్లు ప్రకటించారు. ఇద్దరి మధ్య జరిగిన అధికార పోరాటంలో ఎన్నికల సంఘం ఆమోదించిన పార్టీ తీర్మానం ప్రకారం తాను పీఎంకే అధ్యక్షుడిగా కొనసాగుతున్నానని అన్భుమణి పేర్కొన్నారు.

శనివారం ధర్మపురీలో జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో శ్రీ గాంధీ పరశురామన్ అలియాస్ గాంధీమతిని పీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు.

‘‘నా పెద్ద కుమార్తె గాంధీమతిని పీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమించాను. ఆ పదవి నేనే సృష్టించాను. ఆమె తమిళనాడుకు గర్వకారణం. నేను ఆమెకు ఆ బాధ్యత అప్పగిస్తున్నాను’’ అని రామదాస్ విలేకరులతో చెప్పారు.

గాంధీ తన నాయకత్వంతో పార్టీని మరింత అభివృద్ది చేస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘నాకు ఈ కొత్త పదవి ఊహించని విధంగా వచ్చింది. నాయకత్వం సూచనలను నేను అమలు చేస్తాను’’ అని గాంధీమతి అన్నారు.

అలాగే రామదాస్ తన విధేయుడు జీకే మణి కుమారుడు జీకేఎం తమిళ్ కుమరన్ వన్నియార్ ఆధిపత్య పార్టీకి యువజన విభాగం అధ్యక్షుడిగా నియమించారు. తిరుప్పూర్ లో ఉన్న అన్భుమణి, పార్టీలో తాజా పరిణామంపై వ్యాఖ్యానించడానికి నిరాకరించారు. ‘‘ఇవన్నీ పార్టీ అంతర్గత వ్యవహరాలు, దీనిని ఇక్కడ చర్చించలేము’’ అని రామదాస్ విలేకరులతో అన్నారు.



Tags:    

Similar News