సిట్ కస్టడీకి ప్రజ్వల్ రేవణ్ణ

పలువురి మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్) మాజీ ఎంపీ ప్రజ్వల్‌ను కోర్టు సిట్ కస్టడీకి అప్పగించింది.

Update: 2024-06-13 07:06 GMT

పలువురి మహిళలపై అత్యాచారం, లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీ(ఎస్) మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను కోర్టు బుధవారం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కస్టడీకి అప్పగించింది. జూన్ 18 వరకు ఆయన సిట్ కస్టడీలో ఉంటారు.

సైబర్ క్రైమ్ కేసుకు సంబంధించి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నప్రజ్వల్‌ను సిట్ బాడీ వారెంట్ కోరింది. వారి అభ్యర్థనను కోర్టు ఆమోదించడంతో ప్రజ్వల్‌ను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు.

JD(S) చీఫ్, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ మనవడయిన ప్రజ్వల్ ఇటీవలి హాసన్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.

ఎన్నికలు జరగానికి ముందు రోజు ఆయన అశ్లీల వీడియోలు బయటకు రావడంతో దేశం వీడారు. మే 31న జర్మనీ నుంచి బెంగళూరుకు తిరిగిరావడంతో ఆయనను కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో సిట్ అధికారులు అరెస్టు చేశారు.

Tags:    

Similar News