కర్ణాటక సీఎం సిద్ధరామయ్యను కలిసిన రేణుకాస్వామి తల్లిదండ్రులు

ఇటీవల కర్ణాటకలో హత్యకు గురైన రేణుకాస్వామి తల్లిదండ్రులు సీఎం సిద్ధరామయ్యను ఎందుకు కలిశారు? ఏమని కోరారు?

Update: 2024-06-25 12:37 GMT

కర్ణాటకలో హత్యకు గురైన రేణుకా స్వామి తల్లిదండ్రులు మంగళవారం కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలిశారు. తమ కుమారుడి మృతిపై జరుగుతున్న పోలీసుల విచారణపై సంతృప్తి వ్యక్తం చేశారు. గర్భిణి అయిన రేణుకాస్వామి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని కోరారు.అందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.

రేణుకా స్వామి హత్య కేసులో కన్నడ నటుడు దర్శన్, అతని స్నేహితురాలు పవిత్ర గౌడ సహా మొత్తం 17 మంది నిందితులుగా ఉన్నారు. వీరంతా ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

దర్శన్ నిన్నుకలవాలనుకుంటున్నాడని చెప్పి..రేణుకస్వామిని చిత్రదుర్గలోని దర్శన్ అభిమాన సంఘం సభ్యుడు రాఘవేంద్ర ఆర్‌ఆర్ నగర్‌లోని ఓ షెడ్‌కి తీసుకొచ్చినట్లు సమాచారం. అక్కడే జూన్ 8న చిత్రహింసలు పెట్టి హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

రేణుకాస్వామిని ఎందుకు హత్య చేశారు?

దర్శన్‌‌కు దాదాపు 20 ఏళ్ల క్రితమే విజయలక్ష్మితో పెళైంది. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. మోడల్‌, బుల్లితెర, సినీ నటి అయిన పవిత్ర గౌడతో దర్శన్‌ కొన్నేళ్లుగా కలిసి ఉంటున్నారు. ఈ సంబంధం వల్ల విజయలక్ష్మికి అన్యాయం జరుగుతుందన్న బాధతో చిత్రదుర్గ జిల్లా కేంద్రానికి చెందిన రేణుకాస్వామి అనే యువకుడు తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పవిత్రను లక్ష్యంగా చేసుకుని ఆమెకు అశ్లీల సందేశాల పంపాడు. దర్శన్‌కు దూరంగా ఉండాలని హెచ్చరించినట్లు పోలీసులు గుర్తించారు. అదే అతడి హత్యకు దారితీసింది. జూన్ 9న సుమనహళ్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌ పక్కనే ఉన్న నీటి కాలువ దగ్గర రేణుకా స్వామి మృతదేహం లభ్యమైంది.

Tags:    

Similar News