కోల్డ్ రిఫ్ సిరప్ తయారీ సంస్థ లైసెన్స్ రద్దు

మధ్యప్రదేశ్ లో 23 మంది పిల్లల మరణానికి కారణమైన దగ్గుమందు

Update: 2025-10-14 10:35 GMT
కల్తీ అయిన కోల్డ్ రిఫ్ దగ్గు సిరప్

కల్తీ దగ్గు సిరప్ కోల్డ్ రిఫ్ ను తయారు చేస్తున్న శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్ కు జారీ చేసిన లైసెన్స్ ను తమిళనాడు ప్రభుత్వం రద్దు చేసింది. అలాగే ఆ సంస్థను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

రాష్ట్ర ఔషధ నియంత్రణ విభాగం జరిపిన తనిఖీలలో సిరప్ లలో 48.6 శాతం డైథిలిన్ గ్లైకాల్(డీఈజీ) ఉందని గుర్తించారు. ఇది అత్యంత విషపూరిత పారిశ్రామిక రసాయనం. ఈ ఔషధం సేవించిన అనేకమంది పిల్లలు మరణించారని బయాప్సీలో తేలింది. వీరంతా మధ్యప్రదేశ్ లోని చాలా చింద్వారా జిల్లాకు చెందినవారు.

లైసెన్స్ రద్దు..
కంపెనీ తయారీ, ప్రయోగాశాల పద్దతులను పాటించడంలో విఫలం అయిందని, 300 కి పైగా ప్రధాన నిబంధనలు ఉల్లంఘించిందని అధికారులు గుర్తించారు. ఆ కంపెనీ యజమాని జీ రంగనాథన్ ను ఇటీవల మధ్యప్రదేశ్ కు చెందిన ప్రత్యేక దర్యాప్తు బృందం అరెస్ట్ చేసింది.
అంతకుముందు, మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కేసుకు సంబంధించి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఆ సంస్థ, దాని కొంతమంది అధికారులపై దాడులు చేసింది.
‘‘శ్రేసన్ ఫార్మాస్యూటికల్స్ ఔషధ తయారీ లైసెన్స్ పూర్తిగా రద్దు చేశాం. ఆ కంపెనీ మూసివేశాం. తమిళనాడులో ఉన్న ఇతర ఔషధ తయారీ కంపెనీలకు కూడా సమగ్రంగా తనిఖీ చేయాలని ఆదేశాలు ఇచ్చాం’’ అని ప్రభుత్వం ప్రకటనలో తెలిపింది.
దగ్గు సిరప్..
అక్టోబర్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ సిరప్ అమ్మకాలను నిషేధించారు. ఆహార భద్రత, ఔషధ పరిపాలన శాఖ అధికారి ధృవీకరించారు. తమిళనాడు డైరెక్టరేట్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ కింద చెన్నైలోని డ్రగ్ టెస్టింగ్ లాబోరేటరీ నిర్వహించిన పరీక్షల్లో సిరప్ కు నాణ్యత లేదని నిర్ధారణ అయింది.
మధ్యప్రదేశ్, రాజస్థాన్ లలో కలుషితమైన దగ్గు సిరప్ వినియోగం కారణంగా మూత్రపిండాల వైఫల్యం కారణంగా పిల్లలు మరణించిన నేపథ్యంలో తమిళనాడు, రాజస్థాన్, మధ్యప్రదేశ్, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సిరప్ లు, యాంటీ బయాటిక్ లతో సహ కలుషితమైన మందులపై కఠిన చర్యలు ప్రారంభించాయి.
బాధిత పిల్లలలో చాలామందికి కోల్డ్ రిఫ్ ఇచ్చారు. ఇవి తీసుకున్నాక మొదట జ్వరం తగ్గక, తరువాత ఆరోగ్యం క్షీణించి, మూత్రపిండాల వైఫల్యంతో 23 మంది పిల్లలు మరణించారు.


Tags:    

Similar News