నెట్టింట్లో వైరలయిన రెస్టారెంట్ బోర్డు.. ఇంతకు ఏం రాసిపెట్టారంటే..

రెస్టారెంట్‌కు వచ్చిన వాళ్లంతా గంటల కొద్ది కూర్చుండి పోవడాన్ని గమనించిన యజమాని.. కస్టమర్ల మనసు నొప్పించకుండా చెప్పే ప్రయత్నం చేశారు.;

Update: 2025-03-07 12:38 GMT

పాకశాల(Paakashala). ఇది ఓ పాపులర్ రెస్టారెంట్. బెంగళూరు(Bangalore) జేపీ నగర్‌లో ఉంటుంది. రెస్టారెంట్‌‌కు వచ్చిన వాళ్లంతా గోడమీద వేలాడుతున్న బోర్డువైపు చూడటం మొదలెట్టారు. దాని మీద ‘‘This facility is only for Dine-In Purpose. Not for Real Estate / Political Discussions. Please Understand and Cooperate’’ అని రాసి ఉంది. ఈ వాక్యాలకు అర్థం..‘‘ఇక్కడ ‘డైన్-ఇన్’ (కూర్చుని భోంచేయడం) సౌకర్యం ఉంది. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు లేదా రాజకీయ చర్చల కోసం కాదు. దయచేసి అర్థం చేసుకుని సహకరించండి’’ అని.

వచ్చిన వాళ్లంతా గంటల కొద్ది కూర్చుండి పోవడాన్ని గమనించిన రెస్టారెంట్ యజమాని ఇలా బోర్డు పెట్టడంపై పలువురు పలు రకాలుగా స్పందించారు. కొంతమంది వినియోగదారులు ఇలాంటి బోర్డులు హోటళ్లలో సాధారణమేనని అని కామెంట్ చేయగా.. మరికొందరు ఇది పెట్టడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఈ పోస్ట్‌ను 40,000 మంది చూశారు. కర్ణాటక కాంగ్రెస్ ప్రతినిధి లావణ్య బాలాల్ జైన్ ఈ బోర్డ్‌ను “వింతగా” అభివర్ణించారు. మరో యూజర్..వాస్తవమే.. కొంతమంది భోజనం చేయడానికి వచ్చినవాళ్లు ఎంతసేపటికి టేబుళ్లు ఖాళీ చేయరు” అని కామెంట్ పెట్టారు.

Tags:    

Similar News