Kerala | నన్స్‌కు బెయిల్

అమ్మాయిల అక్రమ రవాణ, మత మార్పిడి కేసులో అరెస్ట్;

Update: 2025-08-02 10:53 GMT

కేరళ(Kerala)కు చెందిన ఇద్దరు నన్స్‌(Nuns), మరో వ్యక్తికి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఛత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్ జిల్లాలోని ప్రత్యేక కోర్టు శనివారం బెయిల్ మంజూరు చేసిందని న్యాయవాది అమృతో దాస్ తెలిపారు. మానవ అక్రమ రవాణా, బలవంతపు మత మార్పిడి ఆరోపణలపై వీరిని కొన్ని రోజుల క్రితం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నారాయణపూర్‌కు చెందిన ముగ్గురు బాలికలను బలవంతంగా మతమార్పిడి చేసి అక్రమంగా తరలిస్తున్నారని స్థానిక బజరంగ్ దళ్ కార్యకర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు..కేరళకు చెందిన నన్స్‌లు ప్రీతి మెర్రీ, వందన ఫ్రాన్సిస్, సుకమాన్ మాండవిలను జూలై 25న దుర్గ్ రైల్వే స్టేషన్‌లో అరెస్టు చేసినట్లు రైల్వే పోలీసు అధికారి తెలిపారు. కాగా విచారణ కోసం ముగ్గురిని కస్టడీకి ఇవ్వాలని ప్రాసిక్యూషన్ కోరలేదని, దాంతో నన్స్ వారి ఇళ్లకు తిరిగి వెళ్లారని దాస్ పేర్కొ్న్నారు. 

Tags:    

Similar News