బీహారీలకు మద్దతు ఇవ్వండి: డీకే శివకుమార్

అసెంబ్లీ ఎన్నికలలో ఓటు వేసేందుకు వారికి మూడు రోజుల వేతనంలో కూడిన సెలవులు మంజూరు చేయాలని విజ్ఞప్తి

Update: 2025-11-04 12:48 GMT
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్

దక్షిణాది రాష్ట్రాలలో పనిచేస్తున్న బీహార్ ఓటర్లు అసెంబ్లీ ఎన్నికల పాల్గొనేందుకు మద్దతు ఇవ్వాలని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ పారిశ్రామిక సంస్థల యజమానులకు పిలుపునిచ్చారు.

తన కార్యాలయం మీడియాతో మాట్లాడిన ఆయన.. బీహార్ నివాసితులు పెద్ద సంఖ్యలో కర్ణాటకలో ఉన్నారని, ఎన్నికలలో ఓటు వేయడానికి కార్మికులకు కనీసం మూడు రోజుల పాటు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కోరారు.

కెపీసీసీ అధ్యక్షుడు కూడా అయిన డిప్యూటీ సీఎం ఎన్నికల ప్రక్రియలో వలస కార్మికుల భాగస్వామ్యాన్ని నిర్ధారించడంలో కంపెనీలు, వ్యాపార సంస్థలు సహకరించాలని కోరారు.

‘‘బీహార్ రాష్ట్ర సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి వీలుగా, ఎన్నికల ప్రక్రియలో చురుకుగా పాల్గొనేందుకు వీలుగా బీహార్ రాష్ట్ర ఓటర్లకు కనీసం మూడు రోజుల వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని అన్ని కంపెనీలు, వాణిజ్య వ్యవస్థాపకులు, హోటళ్లు, కాంట్రాక్టర్లు, బిల్డర్లు, దుకాణదారులు పారిశ్రామికవేత్తలను నేను అభ్యర్థిస్తున్నాను’’ అని శివకుమార్ అన్నారు.
243 మంది సభ్యులున్నా బీహార్ అసెంబ్లీకి నవంబర్ 6, నవంబర్ 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరగున్నాయి. నవంబర్ 14 న ఎన్నికల ఫలితాల ప్రకటన ఉంటుంది.


Tags:    

Similar News