కరూర్ ర్యాలీ: తల్లులు, పిల్లల రోదనతో దద్దరిల్లిన తమిళనాడు

శోక సంద్రంలో అరవ దేశం, విజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాధితులు

Update: 2025-09-29 09:35 GMT
బాలుడి మృతదేహం ముందు రోదిస్తున్న తల్లిదండ్రులు

మొన్న జరిగిన టీవీకే ఎన్నికల ర్యాలీ తమిళనాడును విషాదంలో ముంచింది. కరూర్ తొక్కిసలాటలో 40 మంది ప్రాణాలో కోల్పోయారు. వారిలో 18 నెలల ‘గురు విష్ణు’ కూడా ఉన్నాడు. గురు విష్ణు తల్లిదండ్రులు అతన్ని చేతిలో పట్టుకుని కరూర్ ప్రభుత్వ ఆస్పత్రిలోని వైద్యులను బ్రతికించమని వేడుకుంటున్న దృశ్యాలు అందరిని కలిచివేశాయి.

వారం క్రితం నుంచి విష్ణు నుంచి తొలి మాటలు వచ్చాయి. అతని వచ్చిరాని మాటలు విని తల్లిదండ్రులు మురిసిపోయారు. కానీ కరూర్ ర్యాలీ వారిని శాశ్వత నిశ్శబ్ధంలోకి నెట్టింది.
‘‘అతను జనసమూహంలో నలిగిపోయాడు. ఆ పిల్లవాడికి సహాయం చేయడానికి, అతన్ని ఎత్తుకోవడానికి ఎవరు ఆగలేదు. మేము గురును కోల్పోయాము’’ అని దినసరి కూలీ అయిన ఆయన తండ్రి విమల్ అన్నారు.
నా ప్రాణం ఉన్నా.. పోయినట్లే..
గురు విష్టు ఇల్లు ఎన్నికల ర్యాలీ జరిగిన రెండు వీధుల దూరంలోనే ఉంది. కుటుంబం నిరాడంబరమైన 10x10 గది లోపల పిల్లవాడి దేహాం గాజు శవపేటికలో ఉంచారు. అతని తల్లి తన గాజు పెట్టే లోపలికి చూస్తూ,ఏకధారగా కన్నీళ్లు కారుస్తోంది. ఈ హృదయ విదారక సంఘటన చూసి గురు తాత వేంకటేశన్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 18 నెలల చిన్నారి గురు కృష్ణ

 ‘‘విజయ్ తాను అందరికీ సోదరుడు. మామ, కుటుంబం అని చెప్పాడు. నా కూతురు తనతో పాటు బిడ్డను ర్యాలీకి తీసుకెళ్లింది. విజయ్ వచ్చినప్పుడూ ఆమె అతన్ని చూడాలనుకుంది. కానీ ఆమె జనసమూహంలో స్పృహ కోల్పోయింది. మరొకరు బిడ్డను మోసుకెళ్లింది. కానీ ఆ గందరగోళంలో ఈ బిడ్డ జారికిందపడిపోయింది. జనసమూహంలో అతను నలిగిపోయాడు’’ అని వేంకటేశన్ చెప్పారు.

గురు విష్ణు కుటుంబం చిన్నాభిన్నమైంది. ‘‘విజయ్ పార్టీ నుంచి ఒక్కరు కూడా మమ్మల్ని ఓదార్చడానికి రాలేదు. మేము మా విలువైన బిడ్డను కోల్పోయాను. మేము అతన్ని కోల్పోయాము’’ అని వేంకటేశన్ కన్నీళ్లతో అన్నాడు.
విడిపోయిన కుటుంబాల..
గురు విష్ణు కుటుంబం లాగే చాలామంది కరూర్ తొక్కిసలాటలో తమ ప్రియమైన వారిని కోల్పోయారు. టీవీకే పార్టీ కుటుంబ సమావేశం విజయ్ ప్రజలకు ‘‘నేను మీ మామను, మీ సోదరుడిని’’ అని చెప్పే మాటలను ప్రత్యక్షంగా వినడానికి వెళ్లిన కుటుంబాలు ఇప్పుడు చిన్నాభిన్నం అయ్యాయి.
తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లా వెల్లకోవిల్ లో మరో రెండు ఇళ్లు కూడా దు:ఖంలో మునిగిపోయాయి. గోకుల ప్రియ(29) అనే మహిళ తన భర్త జయ ప్రకాశ్, వారి బిడ్డతో కరూర్ ర్యాలీకి వెళ్లింది.
జనం ఎక్కువగా రావడంతో జయ ప్రకాశ్ బిడ్డతో వేదిక నుంచి బయలు దేరాలని పట్టుబట్టారు. కానీ విజయ్ ను చూసిన తరువాత ఇంటికి తిరిగి వస్తామని చెప్పి గోకుల ప్రియ అక్కడే ఉండిపోయింది.
కొన్ని నిమిషాలోనే గోకుల ప్రియ తొక్కిసలాట జరిగింది. జయప్రకాశ్, ఆయన బిడ్డ ప్రాణాలతో బయటపడ్డారు. కానీ గోకుల ప్రియ తిరిగి రాలేదు. ‘‘ఆమె అతన్ని చూసి తిరిగి వస్తాయని చెప్పింది. కానీ గాజు పెట్టెలో మా దగ్గరకు వచ్చింది’’ అని బంధువులు రోదిస్తూ చెప్పారు.

తొక్కిసలాటలో మరణించిన గోకుల ప్రియ


 


వెల్లకోవిల్ గ్రామంలోని ఒక కుటుంబానికి కూడా ఇదే రాత్రి కాళరాత్రి అయింది. సెల్ ఫోన్ దుకాణ యజమాని ఇద్దరు పిల్లల తండ్రి విజయ్ మద్దతుదారుడు అయిన మణికందన్ జనసమూహంలో నలిగిపోయాడు.
అతని భార్య, పిల్లలు అనాథలయ్యారు. ‘‘ఇప్పుడు మాకు ఎవరూ లేరు. విజయ్ తన జీవితాన్ని తిరిగి ఇవ్వగలరా? మేము అతనిని భయంకరమైన రీతిలో కోల్పోయాము. జనసమూహం అతనిపైకి నడిచింది’’ అని మణికందన్ బంధువు అన్నారు.
పోస్ట్ మార్టం తరువాత ఒక తల్లి, ఆమె ఇద్దరు చిన్న కుమార్తెలను ఒక సమాధిలో పక్కపక్కనే ఉంచి, వారి తల్లిని పక్కనే మరొక సమాధిలో ఉంచింది. మరొక అంత్యక్రియల సమయంలో ఒక యువ గర్భిణీ స్త్రీ తన కడుపు పట్టుకుని, తన భర్త శవపేటికపై కూలబడింది. ‘‘కనీసం నన్ను మరొకసారి చూడనివ్వండి’’ అని ఆమె వేడుకుంటున్న దృశ్యాలు అందరిని కలిచివేస్తున్నాయి.
నిరాశలో..
విజయ్ ను మామ అని గర్వంగా పిలిచే చాలామంది యువకులు, మహిళలుు నేడు నిరాశతో ఉన్నారని కరూర్ నివాసితులు చెబుతున్నారు. తొక్కిసలాట జరిగిన మూడు గంటల తరువాత టీవీకే నాయకుడు విజయ్ ఎక్స్ పోస్ట్ ద్వారా సందేశం పంపారు. కానీ వారిని ఓదార్చడానికి కుటుంబాలను ఇంకా సందర్శించలేదు.
‘‘అతను తన ప్రచారం వ్యాన్ లో వస్తానని చెప్పాడు. కానీ అతను సురక్షితంగా విమానాశ్రాయానికి బయలుదేరాడు. తొక్కిసలాట గురించి మీడియా నివేదికలలో ఇప్పటికే కనిపించినప్పటికీ అతను చెన్నై బయలుదేరాలని నిర్ణయించుకున్నాడు. అతను మా గురించి ఎప్పుడూ ఆలోచించలేదు’’ అని శనివారం వరకు విజయ్ అభిమాని అయిన ఎం. సుధ(20) ఏడుస్తూ చెప్పారు.


Tags:    

Similar News