‘సర్’ మాకొద్దు: కేరళ అసెంబ్లీ తీర్మానం

బీహార్, ఎన్ఆర్సీ, సీఏఏ ఆందోళన లాంటివి జరుగుతాయని సీఎం విజయన్ ఆందోళన

Update: 2025-09-29 11:26 GMT
కేరళ ముఖ్యమంత్రి పినరయీ విజయన్

రాజ్యాంగపరంగా భారత ఎన్నికల సంఘానికి సంక్రమించిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణను(సర్) చేయడానికి వీల్లేదని కేరళ అసెంబ్లీ తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి పినరయి విజయన్ అసెంబ్లీ నిబంధన 118 కింద ప్రవేశపెట్టిన తీర్మానం.. వివాదాస్పద జాతీయ పౌరుల రిజిస్టర్(ఎన్ఆర్సీ) ను అమలు తరహ ఆందోళనగా మారే అవకాశం ఉందని హెచ్చరించింది. దీనికి ఎమ్మెల్యేలు రెండు సవరణలు ప్రతిపాదించగా సభ వాటిని ఆమోదించింది.

బీహార్ ఉదాహారణ..
బీహార్ లో గతంలో నిర్వహించిన ‘సర్’ ప్రక్రియ ఇప్పటికే విస్తృత ఆందోళన రేకెత్తిస్తోందని, దీనివల్ల ఓటర్ల జాబితా నుంచి ఏకపక్షంగా పేర్లు తొలగించారని ముఖ్యమంత్రి ఆరోపించారు. ‘‘బీహార్ లో మినహాయింపు రాజకీయాలు ఉన్నాయి. అక్కడ జరిగింది జాతీయ స్థాయిలో ఆందోళన రేకెత్తిస్తోంది’’ అని తీర్మానంలో ఆయన పేర్కొన్నారు.
రాజ్యాంగబద్దమైన ‘సర్’ ప్రక్రియ గురించి కేరళ అసెంబ్లీ ఆందోళన వ్యక్తం చేసింది. కేరళలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఆ తరువాత 2026 శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి.
ఈ సమయంలో సర్ చేపట్టడం, అమాయకంగా ఆమోదించి చూడలేమని సభ వాదించింది. ‘‘సర్’’ వంటి ప్రక్రియకు జాగ్రత్తగా తయారీ, విస్తృత సంప్రదింపులు అవసరం. దీనివల్ల ప్రజలలో ఏదో జరుగుతుందనే భయాలు కలుగుతాయి’’ అని తీర్మానం పేర్కొంది.
వివాదాస్పద పరిస్థితులు..
కేరళ తన ఓటర్ల జాబితాను చివరగా 2002 లో సవరించింది. ప్రస్తుత కసరత్తును ఆధారంగా చేసుకుని సభ అశాస్త్రీయమైనది, అన్యాయమైనదని పేర్కొంది.
తీర్మానంలో హైలైట్ చేయబడినట్లు.. సర్ ప్రకారం.. 1987 తరువాత జన్మించిన వారు ఓటర్లుగా అర్హత పొందాలంటే. తల్లిదండ్రులలో ఎవరికైనా పౌరసత్వ పత్రాలను అందించాలి.
2003 తరువాత జన్మించిన వారికి ఈ అవసరం తల్లిదండ్రులిద్దరి పౌరసత్వ పత్రాలను సమర్పించడం వరకు విస్తరించింది. రాజ్యాంగ ప్రకారం ఆర్టికల్ 326 కింద హమీ ఇచ్చినట్లు సార్వత్రిక వయోజన ఓటు హక్కును ఉల్లంఘిస్తున్నట్లు అసెంబ్లీ హెచ్చరించింది. ‘‘పత్రాలు లేవని ఓటర్ నమోదు తిరస్కరించడం పౌరుల ప్రాథమిక ప్రజాస్వామ్య హక్కును కాలరాయడమే’’ అని తీర్మానం పేర్కొంది.
సీఏఏ ఆందోళనలు..
సర్ వల్ల అణగారిన వర్గాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని అధ్యయనాలు చూపిస్తున్నాయని కేరళ అసెంబ్లీ పేర్కొంది. మైనారిటీ వర్గాలు, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, మహిళలు, ఆర్థికంగా బలహీన వర్గాలు ఓటర్ల జాబితానుంచి మినహయించబడిన వారిలో ఎక్కువ మంది ఉంటారు. ఇప్పటికే జాబితాలో ఉన్న ప్రవాస ఓటర్ల హక్కులు దెబ్బతినే ప్రమాదం ఉంది.
విమర్శకులు పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) ను బలోపేతం చేసే ప్రయత్నాలతో సర్ ఒత్తిడి చేసే అవకాశం ఉందని వాదించింది. ఇది పౌరసత్వాన్ని మతతత్వంగా మారుస్తుందని చెబుతుంది.
‘‘పౌరసత్వాన్ని మతతత్వంగా మార్చడానికి ప్రయత్నించేవారు తమ ఎజెండాను సాధించడానికి సర్ ను ఒక సాధనంగా ఉపయోగిస్తారు. ఇది ప్రజాస్వామ్యానికే ప్రత్యక్ష సవాల్ విసురుతుంది’’ అని అది హెచ్చరించింది.
ఎన్నికల సంఘానికి..
పారదర్శకత కోసం పిలుపునిస్తూ.. ప్రాథమిక హక్కులను రాజీ చేసే చర్యలను దూరంగా ఉండాలని, బదులుగా సాధారణ ఓటర్ల జాబితా సవరణలను న్యాయంగా అందరినీ కలుపుకుని నిర్వహించాలని అసెంబ్లీ ఎన్నికల సంఘాన్ని కోరింది.
సభలో ఈ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. పాలక లెప్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, ప్రతిపక్ష యూడీఎఫ్ రెండు మద్దతు తెలిపాయి.


Tags:    

Similar News