కర్ణాటక: సీఎం రేసులోకి హోంమంత్రి జీ. పరమేశ్వర

దళిత ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తే తను కూడా పోటీలో ఉన్నట్లు ప్రకటన

Update: 2025-11-23 10:54 GMT
కర్ణాటక హోంమంత్రి జీ. పరమేశ్వర

కర్ణాటక రాజకీయాలలో అనూహ్యమైన ట్విస్ట్ రాబోతుందా? ముఖ్యమంత్రి పీఠం నుంచి సిద్ధరామయ్యను దింపాలని ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ ఓ వైపు ప్రయత్నాలు చేస్తుండగా, మరో వైపు హోంమంత్రి జీ. పరమేశ్వర కూడా తాను సీఎం రేసులో ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు.

రాష్ట్రంలో సీఎం పదవి మార్పు గనక ఉన్నట్లు అయితే దళిత సీఎం కావాలని అంటున్నారని, అదే జరిగితే తాను కూడా ముఖ్యమంత్రి రేసులో ఉండవచ్చని ప్రకటించారు. అయితే పార్టీ లోపల ఎలాంటి గందరగోళం లేదని చెప్పిన ఆయన కాంగ్రెస్ హై కమాండ్ కానీ, శాసనసభాపక్షంలో కానీ దీనిపై ఎలాంటి చర్చ జరగలేదని ఆయన పేర్కొన్నారు.

నాయకత్వ మార్పుపై ప్రస్తుతం విదేశాల్లో ఉన్న పార్టీ అగ్రనేత, రాహుల్ గాంధీ తో చర్చించిన తరువాత నాయకత్వ మార్పుపై ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నిర్ణయం తీసుకుంటారని ఆయన అన్నారు.
సీఎం ఊహాగానాలు..
కాంగ్రెస్ ప్రభుత్వం నవంబర్ 20 న తన ఐదేళ్ల పదవీకాలంలో సగం మార్క్ ను దాటినందుకు ముఖ్యమంత్రి మార్పు జరిగే అవకాశం ఉందని ఊహగానాలు చెలరేగుతున్నాయి. ఈ దశను కొందరు ‘నవంబర్ విప్లవం’గా పిలుస్తున్నారు.
2023 లో కాంగ్రెస్ గెలిచిన తరువాత సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య అధికారం ఒప్పందం చేసుకున్నారని వార్తలు వచ్చాక ప్రస్తుతం ఈ ఊహాగానాలు షికార్లు చేస్తున్నాయి.
‘‘నేను ఎప్పుడూ పోటీలోనే ఉన్నాను. అది పెద్ద సమస్య కాదు. నేను 2013 లో కేపీసీసీ కమిటికీ అధ్యక్షుడిని. నా హయాంలోనే పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. కానీ నేను ఆ క్రెడిట్ తీసుకోలేదు. ఆ ఎన్నికలలో నేను ఓడిపోయాను. గెలిస్తే ఏం జరిగి ఉండేదే నాకు తెలియదు’’ అని ముఖ్యమంత్రి రేసులో మీరు ఉన్నారా? అని అడిగిన ప్రశ్నకు జీ. పరమేశ్వర అన్నారు.
బెంగళూర్ విలేకరులతో మాట్లాడారు. ‘‘నేను అప్పుడు రేసులో ఉన్నాను. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడికి తరుచుగా సీఎం అయ్యే అవకాశం ఉంది. కానీ కొన్ని సందర్భాలలో దానిని పాటించరు’’ అన్నారు.
నాయకత్వ మార్పు జరిగితే తనను పరిగణించమని హై కమాండ్ ను అడుగుతారా అని అన్నప్పుడు పరమేశ్వర ఇలా అన్నారు. ‘‘ఆ పరిస్థితి రానివ్వండి, అలాంటి పరిస్థితి రాలేదు’’ అని అన్నారు. సిద్ధరామయ్య, శివకుమార్ మధ్య అత్యున్నత పదవి కోసం పోరాటం జరుగుతున్న సందర్భంలో ప్రత్యామ్నాయ సీఎం అభ్యర్థిగా ఆయన పేరు రావడం కేవలం మీడియా సృష్టిగా అభివర్ణించారు.
దళిత నాయకత్వ ప్రశ్నలు..
నాయకత్వ మార్పు జరిగితే దళిత ముఖ్యమంత్రి కోసం డిమాండ్ ఉందా? అని ప్రశ్నలు రాగా మరోసారి సమాధానాలు ఇచ్చారు. హెచ్ సీ దేవప్ప, సతీశ్ జార్కిహోళీ ఇతర వర్గాలతో కూడిన మంత్రులు ఎస్సీ, ఎస్టీ వర్గాల మంత్రులు సమావేశాలు నిర్వహించారని చెప్పారు.
‘‘ఒక దళితుడు ఎక్కువ కాలం ముఖ్యమంత్రి కావాలనే డిమాండ్ ఉంది’’.. కానీ మనం కలిసినంత మాత్రానా అది జరుగుతుందా? అని ఆయన అన్నారు.
ఎస్సీలలో అంతర్గత రిజర్వేషన్లు వంటి సమాజానికి సంబంధించిన అంశాలపై చాలాసార్లు సమావేశమయ్యారని అన్నారు. సమాజంలోని వ్యక్తులు సమావేశమై అనేక విషయాలను చర్చిస్తారని అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రిగా చేయడం చాలాకాలంగా కాంగ్రెస్ లో చర్చనీయాంశంగా ఉంది.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య శనివారం పార్టీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమైన నేపథ్యంలో అధికార పంపకంపై కాంగ్రెస్ లో నెలకొన్ని గందరగోళం పై అడిగిన ప్రశ్నకు, ఖర్గేను కలిసే ఆలోచన తనకు లేదన్నారు.
కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ సమావేశంలో సిద్ధరామయ్యను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారని అన్నారు. అయితే అప్పుడు అధికార పంపిణీ గురించి ఎలాంటి చర్చ జరగలేదన్నారు.


Tags:    

Similar News