బంగారం స్మగ్లింగ్ చేస్తూ దొరికిపోయిన కన్నడ నటీ

నిందితురాలు కర్ణాటక డీజీపీ కుమార్తె అని ప్రకటించిన డీఆర్ఐ అధికారులు;

Update: 2025-03-05 09:47 GMT

బంగారం స్మగ్లింగ్ చేస్తూ కర్ణాటక నటీ రన్యారావును డీఆర్ఐ అధికారులకు దొరికిపోయారు. నిందితురాలు పోలీస్ హౌజింగ్ కార్పొరేషన్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్(డీజీపీ) కుమార్తె కూడా అని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజెన్స్ ప్రకటించింది.

బెంగళూర్ లోని కెంపె గౌడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో తనను అదుపులోకి తీసుకున్నట్లు, రన్యారావు నుంచి 14 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు డీఆర్ఐ అధికారులు వెల్లడించారు.

రన్యారావును అరెస్ట్ చేశాక తమ ప్రధాన కార్యాలయానికి తరలించారు. తరువాత ఎకనామిక్ ఆఫెన్స్ కోర్టులో హజరపరచగా 14 రోజులుగా జ్యూడిషియల్ రిమాండ్ విధించారు.
ఎమిరేట్స్ విమానంలో దుబాయ్ నుంచి సోమవారం అర్థరాత్రి రాగానే తనను అదుపులోకి తీసుకున్నారు. గత కొంతకాలంగా రన్యారావు తరుచుగా దుబాయ్ కు ప్రయాణిస్తున్నారు. ఈ విషయంపై సంబంధిత అధికారులు దృష్టి పెట్టినట్లు తెలుస్తొంది. మరోసారి దుబాయ్ వెళ్లి తిరిగి వస్తుండగా నిందితురాలిపై టార్గెట్ ఆపరేషన్ చేయగా, తన బెల్టులో 14 కిలోల బంగారం దాచిపెట్టినట్లు తేలింది.
నటీ అరెస్ట్ తరువాత డీఆర్ఐ అధికారులు సీసీటీవీ పుటేజీని పరిశీలించగా, తను దుబాయ్ వెళ్లిన అన్నిసార్లు ఒకే దుస్తులు ధరించినట్లు వెల్లడయింది. ఇప్పటిలాగే అప్పుడు కూడా బెల్టులోనే బంగారం ధరించి స్మగ్లింగ్ చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
ఆమె గత 15 రోజుల్లో నాలుగు సార్లు దుబాయ్ కి ప్రయాణించడంతో అధికారులకు అనుమానం వచ్చింది. కొన్ని నివేదికల ప్రకారం.. ఈ ఒక్క సంవత్సరంలోనే కనీసం 10 ట్రిప్పులు వెళ్లినట్లు తెలిసింది.
ఆమెకు దుబాయ్ నుంచి భారత్ కు బంగారం స్మగ్లింగ్ చేసే ముఠాలో భాగమా అనే అనుమానాలు వ్యక్తం చేశారు. విచారణలో వాటిని రాబట్టడానికి గత చరిత్రను సైతం అధికారులు బయటకు తీస్తున్నారు.
తప్పించుకునే వ్యూహాలు..
ప్రాథమిక నివేదికల ప్రకారం.. నటీ కస్టమ్స్ అధికారులను బురిడీ కొట్టించడానికి తన పలుకుబడిని ఉపయోగించుకున్నట్లు తెలుస్తోంది. తాను కర్ణాటక డీజీపీ కుమార్తె అని చెప్పినట్లు , అందుకు అనుగుణంగా సీనియర్ అధికారులు ఉపయోగించుకునే ప్రోటోకాల్ సేవలను ఉపయోగించుకుంది.
ఈ సందర్భంలో ఒక ప్రోటోకాల్ అధికారి ఆమెను టెర్మినల్ వద్ద కలుసుకుని విమానాశ్రయం నుంచి బయటకు తీసుకెళ్లేవారు. తరువాత ప్రభుత్వ వాహనంలో ఇంటికి వెళ్లేది. అయితే ఆమె కార్యకలపాల గురించి అధికారులకు తెలుసా.. తెలియదా అనే విషయంలో స్పష్టత లేదు. దీనిపై కూడా డీఆర్ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ఎవరీ నటీ..
చిక్కమగళూర్ కు చెందిన రన్యారావు నటీగా కొన్ని చిత్రాల్లో నటించారు. మాణిక్య(2014), వాఘా(2016), పటాకీ(2017) ఉన్నారు. ఆమె తండ్రి డీజీపీ రామచంద్రరావు జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. నాలుగు నెలల క్రితం ఆర్కిటెక్ట్ జతిన్ హుక్కేరిని వివాహం చేసుకుందని అన్నారు.
తన భర్త వ్యాపార లావాదేవీల గురించి తనకు తెలియదని అన్నారు. ‘‘ ఇది మాకు తీవ్ర షాక్. ఆమె మమ్మల్ని నిరాశపరిచింది. చట్టం ప్రకారం ప్రవర్తించాలి. లేకపోతే తన పని తాను చేసుకుంటుంది’’ అని ఆయన అన్నారు.


Tags:    

Similar News