‘జయలలితకు అదానీతో సంబంధాలున్నాయి.’

గౌతమ్‌ అదానిపై అమెరికాలో కేసు నమోదయిన నేపథ్యంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత వార్తల్లో నిలిచారు.

Update: 2024-11-22 11:54 GMT

వ్యాపారవేత్త, బిలియనీర్‌ గౌతమ్‌ అదానిపై అమెరికాలో కేసు నమోదయిన నేపథ్యంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత వార్తలో నిలిచారు. ఒక యూనిట్ విద్యుత్‌ను రూ. 7.05కి కొనుగోలు చేసేలా ఆమె గతంలో అదానీ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారని డీఎంకే శుక్రవారం బయటపెట్టింది.

“యూనిట్ విద్యుత్‌ను రూ. 7.05కి కొనుగోలు చేసేందుకు 25 ఏళ్ల పాటు అదానీ గ్రూప్‌తో జయలలిత ఒప్పందం కుదుర్చుకున్నదన్న విషయం మర్చిపోవద్దు” అని డీఎంకే అధికార ప్రతినిధి శరవణ అన్నాదురై అన్నారు. కాబట్టి, జయలలిత నేరుగా అదానీ గ్రూప్‌తో విద్యుత్ ఒప్పందంపై సంతకం చేయడంతో అవినీతి ప్రారంభమైందని ఆయన ఆరోపించారు.

అదానీ గ్రూప్‌తో ఒప్పందం లేదు: బాలాజీ

కాగా, తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డ్ (టిఎన్‌ఇబి) అదానీ గ్రూప్‌తో ఎప్పుడూ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి ఒప్పందం చేసుకోలేదని టీఎన్ విద్యుత్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ గురువారం (నవంబర్ 21) స్పష్టం చేశారు. డీఎంకే ప్రభుత్వానికి చెందిన టిఎన్‌ఇబి, అదానీ గ్రూప్‌కు మధ్య గత మూడేళ్లుగా 'వాణిజ్య సంబంధాలు' లేవని చెప్పారు. 'చౌక ధర'కు విద్యుత్ కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సోలార్ ఎనర్జీ కార్ప్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SECI)తో రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ ఒప్పందం కుదుర్చుకుంది. పశ్చిమ TNలోని తన స్వస్థలమైన కరూర్‌లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ..TN ప్రభుత్వం, SECI మధ్య ఒక యూనిట్‌కు ₹2.61 తక్కువ ధరకు 1,500 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు కోసం ఒప్పందం కుదిరింది. మంత్రి ప్రకారం.. మునుపటి ఏఐఏడీఎంకే నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వంలో నిర్ణయించిన అధిక రేటు ₹7. "మా ఒప్పందం SECIతో మాత్రమే ఉంది. ఇది అదానీ గ్రూప్ వంటి ప్రైవేట్ కంపెనీల నుంచి సోలార్ పవర్ కొని మాకు విక్రయించింది. అదానీ గ్రూప్‌తో మాకు ప్రత్యక్ష సంబంధం లేదు" అని బాలాజీ చెప్పారు.

Tags:    

Similar News