కోల్‌కతా ఘటనతో కర్ణాటక ప్రభుత్వం అలర్టయ్యిందా?

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది.

Update: 2024-08-17 10:58 GMT

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం అప్రమత్తమైంది.రాష్ట్రవ్యాప్తంగా ఆసుపత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు, సిబ్బంది భద్రతాపర విషయాలపై చర్చించేందుకు ఆగస్టు 20న సమావేశం ఏర్పాటు చేసినట్లు కర్ణాటక ఆరోగ్య మంత్రి దినేష్ గుండూరావు శనివారం తెలిపారు.

కోల్‌కతా ఘటన దురదృష్టమని పేర్కొన్న గుండూరావు.. రోగుల కోసం ఆసుపత్రుల్లో పనిచేసే వ్యక్తుల భద్రత ప్రభుత్వాదేనని విలేఖరులతో అన్నారు. “నేను మంగళవారం వైద్యులు, నర్సులు ఇతర ఆసుపత్రి సిబ్బందితో సమావేశం అవుతున్నా. ప్రస్తుత చట్టంలో ఏం ఉంది? మేం ఏం చేయాలో చర్చిస్తాం." అని పేర్కొన్నారు.

ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్లు పిలుపుమేరకు వైద్యులు చేపడుతున్న దేశవ్యాప్త సమ్మెపై స్పందిస్తూ.. “నిరసనకు కారణం మాకు తెలుసు. కాని దాని వల్ల రోగులు ఇబ్బంది పడకూడదు. ఈ విషయాన్ని వైద్యులు, వైద్య సిబ్బందితో చర్చించాం. అత్యవసర సేవలు కొనసాగుతాయి.” అని గుండూరావు చెప్పారు.

ఆగస్టు 20న జరగనున్న సమావేశం రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో భద్రతా ప్రమాణాలకే పరిమితమా? అన్న ప్రశ్నకు.. ప్రభుత్వాసుపత్రి అయినా, ప్రైవేట్‌ ఆస్పత్రి అయినా సరే.. భద్రతా ప్రమాణాలు ముఖ్యం. ప్రతి ఒక్కరూ సురక్షిత వాతావరణంలో పని చేయాలి.’’ అని చెప్పారు.

Tags:    

Similar News