ప్రజ్వల్ గెలిస్తే, ప్రమాణ స్వీకారం చేయవచ్చా?

అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న అరెస్టయినా కూడా.. తన ప్రాధమికి విధులను జైలు నుంచి నిర్వర్తించవచ్చని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

Update: 2024-05-28 12:14 GMT

అత్యాచారాల ఆరోపణలు ఎదుర్కొంటున్న జనతాదళ్ (సెక్యులర్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ కర్ణాటకలోని హాసన్ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు ఎన్నికైతే ఏమవుతుంది? మళ్లీ ఎంపీగా ప్రమాణం చేయవచ్చా?

ప్రజ్వల్ కేసును దర్యాప్తు చేస్తోన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ముందు లొంగిపోయి, అరెస్ట్ కాబడినపుడు మాత్రమే ఎంపీగా ప్రమాణ స్వీకారం చేయవచ్చని కొందరు నిపుణులు చెబుతున్నారు.

నేరం - శిక్ష:

అరెస్టయిన వ్యక్తి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావడానికి కోర్టు అనుమతి పొందవచ్చు. లేకుంటే న్యాయవాది ద్వారా అభ్యర్థన పంపితే అతని కోసం స్పీకర్ ప్రత్యేక సమయాన్ని కేటాయించవచ్చు. అయితే అతను ఎన్నికై పోలీసులకు లొంగిపోకపోతే 'శరణార్థి'గా పరిగణిస్తారు. లోక్‌సభ స్పీకర్ నిర్ణయాన్ని బట్టి తదుపరి పరిణామాలుంటాయి.

ఒక MP ప్రమాణ స్వీకారం చేయడానికి సమయ పరిమితి సాధారణంగా కొత్త సభ మొదటి సమావేశం తరువాత 'సహేతుకమైన వ్యవధిలో' ఉంటుంది. కానీ నిబంధనలు 'సహేతుకమైన సమయం' ఏమిటో పేర్కొనలేదు.

ప్రమాణ స్వీకారం..

కొత్తగా ఎన్నికైన సభ్యులు వీలైనంత త్వరగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇది సాధారణంగా ఎన్నికల ఫలితాలు వెలువడిన కొద్ది రోజుల నుండి వారాల వ్యవధిలో జరుగుతుందని కర్ణాటక హైకోర్టు న్యాయవాది కె దేవరాజ్ తెలిపారు.

నిబంధనల ప్రకారం కొత్తగా ఎన్నికైన లోక్‌సభ లేదా రాజ్యసభ మొదటి సెషన్‌ను రాష్ట్రపతి సమావేశపరుస్తారు. ప్రతి ఎంపీ తన పార్లమెంటులో తన సీట్లో కూర్చునే ముందు ప్రమాణం లేదా ధృవీకరణ పత్రాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 99 చెబుతోంది.

ప్రమాణం చేయకపోతే..

ఎన్నికయిన సభ్యుడు పరిమిత కాలవ్యవధిలో ప్రమాణం చేయకపోతే వారు ప్రొసీడింగ్స్‌లో పాల్గొనలేకపోవడం లేదా వారి జీతం, అలవెన్సులు తీసుకోలేకపోవచ్చు.

ప్రమాణ స్వీకారానికి నిర్దిష్ట గడువును నిర్దేశించే స్పష్టమైన రాజ్యాంగ లేదా చట్టబద్ధ నిబంధనలు లేకున్నా, ప్రమాణం చేయడంలో నిరంతరం విఫలమైతే వారి సభ్యత్వం గురించి ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉందని సుప్రీంకోర్టు న్యాయవాది పి ఉస్మాన్ అన్నారు.

చట్టపర లేదా వ్యక్తిగత కారణాల వల్ల ఎన్నికైన సభ్యుడు ప్రమాణం చేయలేకపోతే వారు ఈ సమస్యలను వెంటనే పరిష్కరించుకోవాలి.

పరారీలో ఉన్న ఎంపీ ఎన్నికయితే..

ఉస్మాన్ ప్రకారం.. పరారీలో ఉన్న వ్యక్తి ఎన్నికైనట్లయితే, వారు తమ పరిస్థితిని వివరించి, వీలైనంత త్వరగా ప్రమాణం చేయవలసి ఉంటుంది.లేదంటే సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది.

కర్ణాటక మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బిటి వెంకటేష్.. పరారీలో ఉన్న వ్యక్తి ఎన్నికైనట్లయితే, అధికారులకు లొంగిపోయే ముందు ప్రమాణం చేయలేడని పేర్కొన్నారు. పరారీలో ఉండటం అంటే ఆ వ్యక్తి అరెస్టు నుండి తప్పించుకుంటున్నాడని లేదా చట్టాన్ని అమలు చేసే కస్టడీ నుండి పారిపోయాడని అర్థం.

అధికారాలు వర్తిస్తాయి..

వెంకటేష్ ఫెడరల్‌తో మాట్లాడుతూ.. ప్రజ్వల్ ఎన్నికైతే, అతను ఎంపీ అధికారాలు వర్తిస్తాయన్నారు.

"అతను భారతదేశానికి తిరిగి వచ్చి పోలీసుల ముందు లొంగిపోవచ్చు. వారు ఆయనను అరెస్టు చేయవచ్చు కూడా. అప్పుడు కూడా అతను ప్రమాణ స్వీకారానికి లోక్‌సభకు హాజరు కావడానికి కోర్టు నుండి అనుమతి పొందవచ్చు. కారణాలు పేర్కొంటూ ప్రమాణ స్వీకారం వాయిదా వేయాలని స్పీకర్‌ను కోరవచ్చు.’’ అని చెప్పారు.

ఒక నిందితుడికి రెండు లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు శిక్ష పడితేనే అతని సభ్యత్వం రద్దు అవుతుందని న్యాయవాది కె. దేవరాజ్ అభిప్రాయపడ్డారు.ప్రస్తుతానికి ప్రజ్వల్ నిందితుడు మాత్రమే.

భారతదేశానికి తిరిగి వచ్చిన ప్రజ్వల్‌ ను పోలీసులు అరెస్టు చేసినా.. అతను జైలు నుండి ఎంపీగా తన ప్రాథమిక విధులను కూడా నిర్వర్తించవచ్చు. అవసరమైతే అతను పార్లమెంటుకు వెళ్లడానికి లేదా ప్రమాణ స్వీకారంలో పాల్గొనడానికి న్యాయపరమైన జోక్యాన్ని కోరవచ్చు.

ప్రజ్వల్ రేవణ్ణ కేసులో ఆయన అధికారులకు లొంగిపోవాలి. లేదంటే పోలీసులు అరెస్ట్ చేయాలి. అతనికి బెయిల్ మంజూరయితే, కోర్టు షరతుల ప్రకారం, స్వేచ్ఛగా తిరగడానికి అనుమతి కూడా లభించవచ్చు. బెయిల్‌పై విడుదలైన తర్వాత పార్లమెంటుకు హాజరుకావచ్చు. ప్రమాణ స్వీకారం చేయవచ్చు.

లోక్‌సభ ఎన్నికల సమయంలో ప్రజ్వల్ జర్మనీకి వెళ్లిపోయి, ఒక దేశం నుండి మరొక దేశానికి వెళుతున్నట్లు సమాచారం.

ఆలస్యం చేయకుండా భారత్‌కు తిరిగి వచ్చి అధికారులకు లొంగిపోవాలని అతని చిన్నాన్న, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డి కుమారస్వామి, తాత, మాజీ ప్రధాని హెచ్‌డి దేవెగౌడ ప్రజ్వల్‌ను కోరారు.

Tags:    

Similar News