Fengal Cyclone effect | తమిళనాడు సీఎం స్టాలిన్‌కు ప్రధాని మోదీ అభయం

‘‘విపత్తును ఎదుర్కోడానికి మీ తక్షణ ఆర్థిక సాయం అవసరం. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (NDRF) నుంచి రూ.2 వేల కోట్లు తక్షం విడుదల చేయండి’’ - మోదీకి స్టాలిన్ లేఖ.

Update: 2024-12-03 08:27 GMT

ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడు సీఎం ఎంకె స్టాలిన్‌కు హామీ ఇచ్చారు. ఫెంగల్ తుఫాను కారణంగా సంభవించిన భారీ వరదల నేపథ్యంలో రాష్ట్రానికి అండగా నిలుస్తామని స్టాలిన్‌కు ఆయన ఫోన్ చేసి చెప్పారు. పునరుద్ధరణ, పునరావాస పనుల కోసం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫండ్ (NDRF) నుంచి తక్షణమే రూ. 2వేలు కోట్లను విడుదల చేయాలని స్టాలిన్ కోరడంతో పీఎం స్పందించారు.

మోదీకి స్టాలిన్ లేఖ..

జరిగిన నష్టాన్ని స్టాలిన్ లేఖలో వివరిస్తూ.. ‘‘ఫెంగల్ తుఫాను కారణంగా తమిళనాడులోని 14 జిల్లాల్లో భారీ నష్టం సంభవించింది. తొలుత తంజావూరు, తిరువారూర్, నాగపట్నం, మైలాడుతురై జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, చెంగల్‌పట్టు, విల్లుపురం జిల్లాల్లో వరదలు పోటెత్తాయి. కురిశాయి. విల్లుపురం, కళ్లకురిచ్చి, కడలూరు, తిరువణ్ణామలైలో గంటకు 90 కి.మీ వేగంతో గాలులు వీయడంతో చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. ధర్మపురి, కృష్ణగిరి, రాణిపేట, వేలూరు, తిరుపత్తూరు పరిధిలో భారీ నష్టం చోటుచేసుకుంది. విపత్తు వల్ల మొత్తం 69 లక్షల కుటుంబాలు, 1.5 కోట్ల మంది తీవ్రంగా నష్టపోయారు. బాధితులకు పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. వరద ప్రభావిత జిల్లాల్లో పరిస్థితిని సీనియర్ మంత్రులు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (NDRF) నుంచి 9 బృందాలు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) నుంచి 9 బృందాలు పనిచేస్తున్నాయి. 12,648 మోటారు పంపులు వినియోగించి వరద నీటిని బయటకు పంపుతున్నాం.’’ అని పేర్కొన్నారు.

ప్రాణనష్టం.. దెబ్బతిన్న ఇల్లు..

"నేను కూడా వరద ప్రభావిత జిల్లాల్లో పర్యటించాను. విపత్తు ఫలితంగా 12 మంది చనిపోయారు. 2,416 గుడిసెలు, 721 ఇళ్లు దెబ్బతిన్నాయి. 2,11,139 హెక్టార్లలో వివిధ రకాల పంటలు ముంపునకు గురయ్యాయి. 1,847 కల్వర్టులు 417 ట్యాంకులు, 1,649 కి.మీ విద్యుత్ కండక్టర్లు, 23,664 విద్యుత్ స్తంభాలు మరియు 997 ట్రాన్స్‌ఫార్మర్లకు, 1,650 పంచాయతీ భవనాలు, 4,269 అంగన్‌వాడీ భవనాలు, 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 920 , 381 కమ్యూనిటీ హాళ్లకు నష్టం వాటిల్లింది. తాత్కాలిక పునరుద్ధరణ పనులకు రూ. 2,475 కోట్లు అవసరం. ఈ విపత్తును ఎదుర్కోడానికి మీ తక్షణ ఆర్థిక సాయం అవసరం. జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి (NDRF) నుంచి రూ.2 వేల కోట్ల విడుదల చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. అలాగే నష్టాన్ని సమగ్రంగా అంచనా వేయడానికి కేంద్ర బృందాన్ని కూడా పంపాలని కోరుతున్నా." అని స్టాలిన్ వరద పరిస్థితిని మోదీకి లేఖలో వివరించారు.

మూతపడ్డ పాఠశాలలు, కళాశాలలు..

భారీ వర్షాల కారణంగా విల్లుపురం, కడలూరు, పుదుచ్చేరి, రాణిపేట్, సేలం, తిరువణ్ణామలైలోని పాఠశాలలు, కళాశాలలకు మంగళవారం సెలవు ప్రకటించారు. భారీ వర్షాల దృష్ట్యా నీలగిరి జిల్లాలోని అన్ని పాఠశాలలు డిసెంబర్ 3న మూసివేసినట్లు అని జిల్లా మేజిస్ట్రేట్ లక్ష్మీ భవ్య తెలిపారు.  

Tags:    

Similar News